Ekta Bishth
-
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
టీమిండియా లక్ష్యం 248
వడోదర: దక్షణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా లక్ష్యం 248 పరుగులు. దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ (69; 98 బంతుల్లో, 7ఫోర్లు) అర్ద సెంచరీ రాణించింది. వోల్వార్డ్‌కు తోడుగా డు ప్రీజ్(44), ఓపెనర్ లిజెల్ లీ(44) రాణించడంతో సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సఫారీ జట్టుకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. తొలి వికెటుకు 76 పరుగులు జోడించిన అనంతరం లిజెల్ లీని పూనమ్ యాదవ్ అవుట్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ త్రిష చెట్టి(22) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. ఆ వెంటనే వోల్వార్డ్ వెనుదిరగడంతో సఫారి జట్టు కష్టల్లో పడింది. ఈ క్రమంలో డు ప్రీజ్ బాధ్యతయుతంగా ఆడటంతో దక్షిణాఫ్రికా మంచి స్కోర్ చేయగలిగింది. ఇక పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుండటంతో టీమిండియాకు ఈ స్కోర్ ఛేదించడం పెద్ద కష్టమేమి కాదని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. -
ఏక్తా మాయాజాలం
ముంబై: సొంతగడ్డపై బౌలర్లు చెలరేగడంతో... ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 66 పరుగుల తేడాతో గెలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్‌కు రెండు పాయింట్లు లభించాయి. ఎడంచేతి వాటం స్పిన్నర్ ఏక్తా బిష్త్ మాయాజాలానికి ఇంగ్లండ్ చేతులెత్తేసింది. 8 ఓవర్లు వేసిన ఏక్తా 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకుంది. ఏక్తాకు లభించిన చివరి మూడు వికెట్లు ఐదు బంతుల తేడాలో రావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 49.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. స్పిన్నర్లు ఏక్తా బిష్త్ (4/25), దీప్తి శర్మ (2/33) భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించారు.అంతకుముందు భారత ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్ (58 బంతుల్లో 48; 8 ఫోర్లు), స్మృతి మంధాన (42 బంతుల్లో 24; 3 ఫోర్లు) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. స్మృతి ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ తడబడింది. ఒకదశలో ఒక వికెట్‌కు 85 పరుగులతో పటిష్టంగా కనిపించిన టీమిండియా పది పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయి ఐదు వికెట్లకు 95 పరుగులతో నిలిచింది. ఈ దశలో కెప్టెన్ కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 44; 4 ఫోర్లు), వికెట్ కీపర్ తానియా (41 బంతుల్లో 25; 2 ఫోర్లు) సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఆరో వికెట్‌కు 54 పరుగులు జత చేశారు.తానియా, మిథాలీ ఔటయ్యాక చివర్లో జులన్ గోస్వామి (37 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జార్జియా అమండా ఎల్విస్, నటాలీ షివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్ రెండేసి వికెట్లు తీశారు. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. పేసర్ శిఖా పాండే (2/21) ధాటికి ఇంగ్లండ్ 38 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే నటాలీ షివెర్ (44; 5 ఫోర్లు), కెప్టెన్ హీతెర్ నైట్ (39 నాటౌట్; 2 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 73 పరుగులు జోడించి ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరు క్రీజులో నిలదొక్కుకోవడంతో ఇంగ్లండ్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ 31వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు 111 పరుగుల వద్ద నటాలీ షివెర్‌ను ఏక్తా బిష్త్ రనౌట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. అనంతరం ఏక్తా తన స్పిన్ మాయాజాలంతో విజృంభించింది. తొలుత కేథరీన్ బ్రంట్‌ను ఔట్ చేసిన ఆమె... ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఐదు బంతుల తేడాలో ష్రబ్సోల్, సోఫీ ఎకిల్‌స్టోన్, అలెగ్జాండ్రా హార్ట్‌లెలను ‘డకౌట్’ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లను 25 పరుగుల తేడాలో కోల్పోవడం గమనార్హం. -
‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్ ప్యాకప్
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్ షిప్లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్‌లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ సారథి హెదర్ నైట్(39 నాటౌట్), ఆల్‌రౌండర్ సీవర్(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్ అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్ (48)లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్‌తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్ ప్రీత్ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్ డియోల్(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎల్విస్, సీవిర్, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. -
'ఏక్తా'తా చేతిలో పాక్ ఖతం
►5 వికెట్లు తీసిన ఏక్తా బిష్త్ ►95 పరుగులతో భారత్ ఘన విజయం ప్రపంచకప్‌లో భారత మహిళల జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా దాయాది పాక్‌ను దంచేసింది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ భారత విజయంలో బ్యాట్స్‌మెన్ ఘనత వహిస్తే... ఈ మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా బౌలర్లే గెలిపించారు. స్వల్ప స్కోరును కాపాడుకునే ప్రయత్నంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏక్తా బిష్త్ (10–2–18–5) అద్భుతమైన స్పెల్‌తో రెచ్చిపోయింది. ఎవరినీ క్రీజులో నిలువనీయకుండా దెబ్బ మీద దెబ్బ తీసింది. పాక్‌ను చిత్తుగా ఓడించిన మిథాలీ సేన... రెండు వారాల క్రితం ఇదే ఇంగ్లండ్‌లో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభవాన్ని మరిపించే ప్రయత్నం చేసింది. డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎదురేలేకుండా దూసుకెళ్తోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి మరీ టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 95 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ (72 బంతుల్లో 47; 5 ఫోర్లు), సుష్మ వర్మ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. పాక్ బౌలర్లలో నష్రా సంధు 4 వికెట్లు తీసింది. తర్వాత పాకిస్తాన్ 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సనా మీర్ (29)దే టాప్ స్కోర్. అద్భుత బౌలింగ్‌తో ఏక్తా బిష్త్ (5/18) పాక్ పతనాన్ని శాసించింది. రాణించిన పూనమ్ రౌత్ టాస్ నెగ్గిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పూనమ్ రౌత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్మృతి మంధన (2) విఫలమైంది. తర్వాత దీప్తి శర్మ, పూనమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించింది. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరిస్తుండటంతో పరుగుల వేగం మందగించింది. రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాక జట్టు స్కోరు 74 పరుగుల వద్ద పూనమ్ రౌత్ ఔటయ్యింది. నష్ర సంధుకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించింది. తర్వాత స్వల్ప వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో భారత్ కష్టాల్లో పడింది. మిథాలీ రాజ్ (8), దీప్తి శర్మ (63 బంతుల్లో 28; 2 ఫోర్లు)లను నష్ర సంధు ఔట్ చేయగా... హర్మన్‌ప్రీత్ కౌర్ (10), మోనా మేశ్రమ్ (6)లిద్దరు సాదియా యూసుఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 111 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కీపర్ సుష్మ వర్మ, జులన్ గోస్వామితో కలిసి (36 బంతుల్లో 14) కాసేపు పోరాడింది. 74 పరుగులకే ఖేల్ ఖతం: జోరు మీదున్న భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న పాకిస్తాన్ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఒక పరుగు మీద ప్రారంభమైన పాక్ పతనం ఇక ఎక్కడా ఆగలేదు. రెండో ఓవర్ నుంచే స్పిన్నర్ ఏక్తా బిష్త్ తన మాయాజాలాన్ని చూపించింది. మొదట అయేషా జాఫర్ (1)ను ఔట్ చేసిన ఆమె... సిద్రా నవాజ్ (0), ఇరమ్ జావెద్ (0)లను పెవిలియన్ పంపింది. ఈ మూడు వికెట్లు ఎల్బీడబ్ల్యూ రూపంలోనే వచ్చాయి. జవేరియా (6) జులన్ గోస్వామి బౌలింగ్‌లో నిష్క్రమించింది. దీంతో చూస్తుండగానే పాక్ స్కోరు 26/6కు చేరింది. ఓపెనర్ నాహిదా ఖాన్ (23), కెప్టెన్ సనా మీర్ (29) ఆదుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ►10- 0 వన్డేల్లో పాకిస్తాన్‌తో తలపడిన పది సార్లు భారత్‌దే విజయం