the electoral list
-
ఓటుకు ‘తెలుగు’ నోటు
ఓటుకు రూ.500 పంచి ఒట్టేసుకుంటున్న తెలుగుతమ్ముళ్లు పోలింగ్‌కు నాలుగురోజులకు ముందే ప్రలోభాలు పుత్తూరులో మూడు వార్డుల్లో నగదు పంపిణీ హస్తిలో నాలుగు వార్డుల్లో పంపకం పూర్తి మదనపల్లెలో ఓటర్ల ఇంటికి వస్తువులు, బియ్యం సాక్షి, చిత్తూరు: మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు నాలుగురోజుల ముందే ఓటర్లకు పలు రకాల తాయిలాలు అందజేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి నిఘా ఎక్కువగా ఉంటుందని భావించి నగదు పంపిణీతో ప్రలోభాలకు దిగుతున్నారు. ప్రధానంగా చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు రాత్రి సమయాల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల లిస్టు ఆధారంగా ఓటుకు రూ.500 ఇస్తున్నట్లు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. పుత్తూరు పట్టణంలో వైఎస్సార్సీపీ కచ్చితంగా గెలుస్తుందనుకున్న వార్డులను వదిలేసి, మిగిలినవార్డుల్లో తెలుగుతమ్ముళ్లు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆ పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఓటుకు రూ.500 చొప్పున ఇస్తున్నారని వారు చెబుతున్నారు. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలోని నాలుగువార్డుల్లో కూడా ఓటుకు *500 చొప్పున డబ్బులు పంచి, ఓటేస్తామని ప్రమాణం చేయించుకున్నట్టు సమాచారం. చిత్తూరు కార్పొరేషన్లో ఇప్పటికే భారీగా డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. డబ్బులు పంచి ఓటర్లను ఆకట్టుకోవాలని టీడీపీ నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. శివారు డివిజన్లలో అర్ధరాత్రి నగదు పంచుతున్నట్టు తెలిసింది. పుంగనూరు మున్సిపాలిటీ, మదనపల్లె మున్సిపాలిటీలో వివిధ వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు డబ్బులతో పాటు బియ్యం కూడా అందజేసేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు తెలిసింది. మదనపల్లెలో టీడీపీ అభ్యర్థికి చెందిన బియ్యం బ్యాగ్‌లను కూడా పోలీసులు పట్టుకున్నారు. పలమనేరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు డబ్బులు కన్నా చీరలు, ముక్కుపుడకలు పంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. నగరి మున్సిపాలిటీలోనూ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము సొంతంగానైనా డబ్బులు పంచాల్సిందేనని తమ్ముళ్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఆరు మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్లో అభ్యర్థులు ఓటర్లకు నోటు తాయిలం ఇచ్చేందుకు రంగంలోకి దిగేశారు. -
మున్సిపల్ ఎన్నికలకు రెడీ
సాక్షి, చిత్తూరు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఏది ఏమైనా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఏ క్షణంలో నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు నిర్వహిం చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా మున్సిపల్ కమిషనర్లు చెబుతున్నారు. జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు, శ్రీకాళహస్తి, మదనపల్లె,పుంగనూరు, నగరి, పలమనేరు, పుత్తూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో తిరుపతి కార్పొరేషన్‌కు మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకం లేదని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌కు సమస్యే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. ఆరు నెలలు క్రితం ప్రభుత్వం తిమ్మినాయుడు పాళ్యం, రాజీవ్‌నగర్, ఎం.ఆర్.పల్లె పంచాయతీలను విలీనం చేసింది. వీటిని డివిజన్లుగా చేయాలంటే ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లలోనే కలపాలి. కొత్తగా డివిజన్ల ఏర్పాటుకు అవకాశం లేదు. దీంతో తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాలంటే సమస్యలు ఉన్నాయని అధికారులకు తెలియజేసినట్టు సమాచారం. మిగిలిన మున్సిపాలిటీలకు ఓకే చిత్తూరు కార్పొరేషన్లో డివిజన్ల విభజన ఏర్పాటు సమయంలోనే పూర్తి చేయడంతో ఇక్కడ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పుంగనూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేసుకున్నారు.