Ellen Johnson sirleaf
-
ఎలెన్ జాన్సన్కు నేడు ఇందిర శాంతి బహుమతి
న్యూఢిల్లీ: లైబీరియా అధ్యక్షురాలు, నోబెల్ బహుమతి విజేత ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ గురువారం ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాన్సన్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుమతి ప్రదానం చేయనున్నారు. ఆఫ్రికాలో ఓ దేశానికి అధ్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళగా 74 ఏళ్ల ఎలెన్ చరిత్ర సృష్టించారు. ఎలెన్ ప్రస్తుతం భారత పర్యటనలోనే ఉన్నారు. ఆర్థికవేత్త కూడా అయిన ఆమె మహిళల హక్కుల కోసం, శాంతి కోసం విశేష కృషిచేశారు. 2011లో లేమా జిబోవీ, తవకెల్ కర్మాన్లతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. -
40 లక్షల జనాభాకు ఒకే సీటీస్కాన్
సాక్షి, హైదరాబాద్: తమ దేశంలో నలైభె లక్షల జనాభా ఉంటే కేవలం ఒకే సీటీ స్కాన్ యంత్రం అందుబాటులో ఉందని లైబీరియా దేశ అధ్యక్షురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ తెలిపారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలో మంగళవారం లైబీరియా నేత్ర ఆరోగ్య కార్యక్రమం ప్రారంభమైంది. ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ గుల్లపల్లి ఎన్.రావుతో కలిసి ఎలెన్ జాన్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి వైద్యానికి సంబంధించి తమ దేశంలో ఒక్క వైద్యుడు కూడా లేరని చెప్పారు. ఒక నివేదిక ప్రకారం లైబీరియాలో 0.5 శాతం మంది అంధులు ఉన్నారని తెలిపారు. ఇప్పుడిప్పుడే తమ దేశంలో వైద్య ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. కనీసం ఐదు కిలోమీటర్లు వెళితేగానీ వైద్య సహాయం అందని స్థితిలో తమ దేశ పౌరులు ఉన్నారని పేర్కొన్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి తమ దేశ ప్రజలకు నేత్ర వైద్యం అందించనుండడంపై ఆమె అభినందలు తెలిపారు.