Eluru Court
-
చింతమనేనికి చుక్కెదురు
సాక్షి, ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరులోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దు లేదా తొలగి౦చాలనే అభ్యర్థనను అ౦గీకరి౦చబోమని కోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వడానికి నిరాకరించింది. జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో హైకోర్టు తలుపుతట్టేందుకు చింతమనేని సిద్ధమవుతున్నారు. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో నెల రోజులపాటు సాధారణ జైలుశిక్ష విధించారు. అనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. -
అగ్రిగోల్డ్ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. గురువారం ముగ్గురు నిందితులను ఏలూరు కోర్టులో సీఐడి అధికారులు హాజరు పర్చారు. నిందితులకు అక్కడి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే నిందితులను 4 రోజుల కస్టడీకి సీఐడీ కోరినట్టు తెలిసింది. అరెస్టైన వారిలో అగ్రిగోల్డ్ ఫార్మా వైఎస్ ఛైర్మన్ సదాశివవరప్రసాద్, అగ్రిగోల్డ్ కనస్ట్రక్షన్స్ ఎండీ రామచంద్రరావు, డ్రీమ్‌ల్యాండ్ వెంచర్స్ ఎండీ అహ్మద్‌ఖాన్ ఉన్నారు. -
అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ సదాశివ వరప్రసాద్, ఎండీ రామిరెడ్డి శ్రీరామచంద్రారావు, డెరైక్టర్ పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్‌లను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఏలూరు కోర్టులో హజరు పరిచారు. -
వచ్చేవారం అగ్రి గోల్డ్ విచారణ
హైదరాబాద్: అగ్రి గోల్డ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి తాజాగా చేసిన అరెస్టులపై అఫిడవిట్ దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. కాగా అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి వేసిన కమిటీ సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశమవుతామని తెలిపింది. మరోపక్క, ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే, అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలసిందే. సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో వారిని హాజరుపరిచారు. వీరిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీకల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ బాధితులు ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గురువారం రాత్రి వీరిని అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. -
కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్
ఏటూరు: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో వారిని హాజరుపరిచారు. వీరిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీకల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా హైకోర్టుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గురువారం రాత్రి వీరిని అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కాగా, బకాయి పడ్డ రూ. 105 కోట్లు చెల్లించకపోవడంతో పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని ఆంధ్రాబ్యాంక్ సీజ్ చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసు ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.