కోర్టులో అగ్రిగోల్డ్ చైర్మన్
ఏటూరు: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లకు 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఏలూరు మెజిస్ర్టేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు శుక్రవారం ఏలూరు కోర్టులో వారిని హాజరుపరిచారు. వీరిని 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు రిమాండ్ విధించింది. అనంతరం వారిని వైద్య పరీకల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా హైకోర్టుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గురువారం రాత్రి వీరిని అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌లలో కేసులు పెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.
కాగా, బకాయి పడ్డ రూ. 105 కోట్లు చెల్లించకపోవడంతో పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని ఆంధ్రాబ్యాంక్ సీజ్ చేసింది. మరోవైపు అగ్రిగోల్డ్ కేసు ఈరోజు హైకోర్టులో విచారణ కొనసాగనుంది.