eman ahmed
-
భారీకాయురాలు.. ఎమ్మాన్ మృతి
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత భారీకాయంతో రికార్డులకు ఎక్కిన ఎమ్మాన్ అహ్మద్ అబూదాబిలోని బుర్జీల్ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. తన 37వ బర్త్‌డే వేడుకలను పూర్తి చేసుకున్న వారానికే ఆమె కన్నుమూశారు. ఎమ్మాన్ మృతిని బుర్జీల్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. కిడ్నీలు పనిచేయకపోవడం, గుండె సంబంధిత వ్యాధులతో ఆమె బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది నిపుణులైన వైద్యులు ఆమెను నిత్యం పర్యవేక్షించారని బుర్జీల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈజిఫ్టుకు చెందిన ఎమ్మాన్ అహ్మద్ అరుదైన వ్యాధివల్ల శరీరం భారీగా పెరిగిపోయింది. మొదట చికిత్స కోసం ఎమ్మార్ ముంబైలోని సైఫీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో గోడలను బద్దలు కొట్టాల్సి వచ్చింది. అంతేకాక ప్రత్యేక విమానంలో ఆమెను ముంబై తరలించారు. ఆమెను క్రేన్ల సాయంతో సైఫీ ఆసుపత్రి లోని ప్రత్యేక గదికి తరలించారు. కొంతకాలం ముంబైలోని చికిత్స తీసుకున్నారు. అనంతరం ఆమెను అబుదాబిలోని బుర్జీల్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా బుర్జీల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఎమ్మాన్ అక్కడే మృతి చెందారు. -
ఇక దుబాయి ఆస్పత్రిలో లావాటి మహిళ
దుబాయి: ముంబయిలో చికిత్స చేయించుకొని వెళ్లిన ఈజిప్టుకు చెందిన స్థూలకాయురాలు ఎమన్ అహ్మద్ అబుదాబిలోని ఆస్పత్రిలో చేరింది. ఈ ఆస్పత్రిలో ఆమెకు ధీర్ఘకాలంపాటు శారీరక, మానసిక వైద్యాన్ని అందించనున్నారు. దాదాపు అరటన్ను బరువుతో ప్రపంచంలోనే అతి లావాటి మహిళగా రికార్డుల్లోకి ఎక్కిన ఎమన్‌ను ఒక సవాల్‌గా తీసుకొని ముంబయి వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ఆమెను ఈజిప్టు నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె సర్జరీ చేసి దాదాపు 323 కిలోల బరువు తగ్గించారు. ప్రస్తుతం ఆమె బరువు 176.6కేజీలు. దీంతో తిరిగి ఆమెను పంపించేశారు. ప్రస్తుతం ఏడాదిపాటు చికిత్స పొందేందుకు ఎమన్ అబుదాబిలోని వీపీఎస్ బుర్జీల్ ఆస్పత్రిలో చేరింది. ఈ సందర్భంగా యాసిన్ శహత్ అనే వైద్యుడు మాట్లాడుతూ తన ప్రయాణం సౌకర్యాంగానే సాగినట్లు ఎమన్ తెలిపిందన్నారు. ఆమె కోసం ప్రత్యేకంగా ఇటలీ నుంచి హైడ్రాలిక స్ట్రెచర్ తీసుకొచ్చామని, 20మంది వైద్యులను ఆమెకు కేటాయించి వైద్యం చేయబోతున్నట్లు ప్రకటించారు. -
500 కిలోల నుంచి 176కు బరువు తగ్గింది
ముంబై: అత్యధిక బరువుతో బాధపడుతున్న ఈజిప్ట్ మహిళ ఎమాన్ అహ్మద్‌ను త్వరలోనే యూఏఈలోని అబుదాబి ఆస్పత్రికి మార్చనున్నారు. ముంబైలోని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భారీగా బరువు తగ్గినట్టు వైద్యులు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ 23న ఎమాన్ 500 కిలోల బరువు ఉండగా, ఇప్పుడు (శుక్రవారం) 176.6 కిలోలకు తగ్గినట్టు వైద్యులు చెప్పారు. ఆమెను ప్రత్యేకంగా కార్గో విమానంలో ముంబైకు తీసుకురాగా, ఇప్పుడు రెగ్యులర్ విమానంలో బిజినెస్ క్లాస్‌లో వెళ్లవచ్చని తెలిపారు. ఇక్కడ ఆమెకు చికిత్స పూర్తయ్యిందని, యూఏఈలోని బుర్జీల్ ఆస్పత్రికి తరలించనున్నట్టు సైఫీ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి దీపక్ సావంత్ ఆస్పత్రికి వచ్చి ఎమాన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు తెలియజేశారు. ఎమాన్ సోదరిపై కేసు: తమపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు చికిత్స విషయంలో జోక్యం చేసుకుంటోందంటూ ఎమాన్ సోదరి షైమా సెమిల్పై సైఫీ ఆస్పత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఎమాన్‌కు మంచినీళ్లు ఇచ్చారని వైద్యులు చెప్పారు. ఎమాన్ నేరుగా మంచి నీళ్లు తాగలేరని, ఆమెకు ట్యూబ్ ద్వారా అందించాలని వైద్యులు వివరించారు. కాగా ఎమాన్‌కు దాహం వేయడంతో తాను నీళ్లు ఇచ్చానని, వైద్యులు పోలీసులను పిలిపించారని, పరాయి దేశంలో తమకు తెలిసినవాళ్లు ఎవరూ లేరని, ఆమె బాగోగులు తానే చూసుకోవాలని షైమా చెప్పింది. -
చాలా ఏళ్ల తర్వాత చేతులు కదిలించింది!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందిన ఈజిప్టుకు చెందిన ఇమాన్ అహ్మద్(36)కు ముంబై వైద్యులు అందిస్తున్న వైద్యం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఆమె బరువు తగ్గించేందుకు ముంబైలోని సైఫీ ఆస్పత్రి డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు సజావుగా సాగుతున్నాయి. మూడు వారాల్లో 108 కిలోల బరువు తగ్గిన ఇమాన్ అహ్మద్ మరో ఇప్పుడు తన చేతులను కూడా కదిలించగిలిగింది. తన చేతులను పైకి లేపి ముఖాన్ని పట్టుకోగలిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు తన వైద్యం అందిస్తున్న బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలాకు గాల్లో ముద్దులు విసిరిందని తెలిపాయి. ఆహార నియమాలు కచ్చితంగా పాటించడంతో పాటు ఆమెతో ప్రతిరోజు ఫిజియోథెరపీ చేయిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. వచ్చే రెండు వారాల్లో మెదడు సిటీ స్కాన్ తీస్తామని వెల్లడించారు. ఆమె 150 కిలోలకుపైగా తగ్గిందని, ఇప్పుడు ఆమె బరువు 340 కిలోలని డాక్టర్లు చెప్పారు. ఫిజియోధెరపీకి ఆమె స్పందిస్తోందని, చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి ఆమె తన ముఖాన్ని చేతులతో అందుకోగలిగిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే ఇమాన్ అహ్మద్ బరువు తగ్గి ఇంటికి వెళుతుందన్న ఆశాభావాన్ని వైద్యులు వ్యక్తం చేశారు.