embroidered works
-
రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!
మన పూర్వీకుల కాలంలో ఎంతో కొంత ఫ్యాషన్ ఉండేది. అయితే ఇప్పటిలా దానికి అంతలా క్రేజ్ లేకపోయినా నాటి రాజరికపు కుటుంబాలు గొప్ప గొప్ప డిజైనర్ వేర్ దుస్తులను ధరించేవారు. నాటి కాలంలో చేతిలో ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్‌వేర్ చీరలు గురించి చాలమందికి తెలియదు. నాటి కాలంలో ఎంబ్రాయిడరీ చేయడం ఉందా అనుకుంటారు. కానీ ఆ కాలంలోనే హస్తకళాకారులు నైపుణ్యం ఆశ్చర్యచకితులను చేసేలా అద్భుతంగా ఉండేది. నాటి స్మృతుల్ని మరచిపోకుండా చేసేలా మన రాజరికపు దర్పానికి గుర్తుగా అలనాటి సాంప్రదాయ దుస్తులను చక్కటి బ్రాండ్ నేమ్‌తో అందరికీ చేరువయ్యేలా చేస్తోంది నందినిసింగ్. ఎవరీ నందిని సింగ్? ఎలా అలనాటి రాజరికపు సాంప్రదాయ దుస్తులను వెలుగులోకి తీసుకొస్తోందంటే..అవద్ రాజ కుటుంబానికి చెందిన నందిని సింగ్ కరోనా మహమ్మారి సమయంలో రాజుల కాలం నాటి దుస్తులకు సంబంధించిన బ్రాండ్‌ని నెలకొల్పింది. అంతేగాదు అలనాటి సాంప్రదాయ హస్తకళాకారులను ప్రోత్సహించడమే కాకుండా నాటి సాంప్రదాయ చీరలను ప్రస్తుత జనరేషన్ తెలుసుకునేలా మంచి బ్రాండ్ నేమ్‌తో పరిచయం చేస్తోంది. ఈ రాజరికపు సంప్రదాయ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో ప్రదర్శిస్తోంది. ఈ బాండ్‌కి చెందిన దుస్తులు రాయల్ ఫేబుల్స్ వెడ్డింగ్ ఎడిట్లోనూ, ప్యాలెస్ అటెలియర్స్ అండ్ డిజైన్ స్టూడియోలలో ప్రదర్శనలిచ్చింది. ఈ మేరకు నందిని తన బ్రాండ్ జర్నీ గురించి మాట్లాడుతూ..తన గ్రామంలోని ఒక ఎన్జీవోకి సంబంధించిన పనిపై..ఝూన్సీ, లక్నో వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడూ.. ఎందరో హస్తకళకారులు తన వద్దకు వచ్చి తమ సమస్యను వివరించడంతో దీనిపై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడే వారందర్నీ ఒక కమ్యూనిటీగా చేసి..షిఫాన్లు, ఆర్గాంజస్ వంటి బట్టలపై ఎంబ్రాయిడీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది.. అది ఒకరకంగా వారికి పని కల్పించినట్లు అవుతుంది కూడా అని భావించింది నందిని. అందుకోసం అని హోల్‌సేల్ వ్యాపారులను సంప్రదించి మరీ హస్తకళకారులకు ఉపాధి దొరికేలా చేసింది. ఆ దుస్తులను చాస్మీ అనే బ్రాండ్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ పేరుని మహాభారతం నుంచి తీసుకుంది. ఆ పురాణ గాథలో శ్రీకృష్ణుడు అనే చా అస్మీ (నేను అన్నాను) అనే సంస్కృత పదాన్ని తన దుస్తులకు బ్రాండ్ నేమ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ సంప్రదాయ డిజైన్లను మంచి బ్రాండ్ నేమ్‌తో తీసుకురావడంలో ప్రేరణ తన తల్లి, అమ్మమ్మ, అత్తలే కారణం అంటోంది. ఎందుకంటే వారు ధరించే ఎంబ్రాయిడరీ చీరలతో తనకున్న చిన్న నాటి జ్ఞాపకాలే దీన్ని ఫ్యాషన్వేర్గా తీసుకొచ్చేందుji దారితీసిందని చెబుతోంది. "ఇక ఈ చాస్మీ బ్రాండెడ్ చీరలను హస్తకళకారులు సింగిల్-థ్రెడ్ వర్క్ లేదా 'సింగిల్ టార్'తో ఎంబ్రాయిడరీ చేయడం విశేషం. అందుకోసం పట్టుదారాలను ఉపయోగిస్తారు. అయితే ఈ ఎంబ్రాయిడరీ ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎక్కువ దారాలను మిక్స్ చేయడం జరుగుతుంది. కానీ హస్తకళాకారులు మాత్రం సింగిల్ దారంతోనే ఎక్కువ సమయం కేటాయించి మరీ తీర్చిదిద్దుతారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది కూడా. అలాగే పిట్టా, జాలీ, రేషం ఎంబ్రాయిడరీతో సహా వివిద రకాల వర్క్‌లు చేస్తారు. అంతేగాదు శాలువాలు, లెహంగాలు, దుపట్టాలు, చీరలు, బ్లౌజ్‌లపై కూడా ఎంబ్రాయిడరీ చేస్తాం". అని నందిని చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం అలనాటి రాజవంశ మహిళలు ధరించే ఎంబ్రాయిడరీ చీరలను ఎలా ఉంటాయో చూసేయండి. View this post on Instagram A post shared by Chaasmi (@chaasmiofficial) (చదవండి: కట్టడితో పిల్లలను గడప దాటేలా చెయ్యొద్దు..!) -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
క్షణికావేశంతో నిండు ప్రాణం తీసుకుంది
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండటమే కారణం పెడనలో ఘటన పెడన రూరల్ : ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నందుకు తల్లి మందలించిందనే కోపంతో ఓ యువతి బల వంతంగా ప్రాణం తీసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన స మాచారం ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారులోని వీరభద్రపురంలో యర్రా గిరిజాకుమారి కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉ న్నారు. భర్త చనిపోవడంతో చేనేత పనులు చేసుకుంటూ కు టుంబాన్ని పోషిస్తోంది. పెద్దకుమార్తె దివ్య నాగరేవతి(20) గుడ్లవల్లేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో గతేడాది ఈసీఈ కో ర్సు పూర్తి చేసింది. మచిలీపట్నంలోని భెల్ కంపెనీలో అ ప్రెంటీస్గా శిక్షణ పొందుతోంది. రెండో కుమార్తె కూడా పా లిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. కు మారుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. నాగరేవతి గురువారం రాత్రి ఫోన్లో ప్రేమికుడితో మాట్లాడుతుండగా తల్లి మందలించింది. తరువాత తల్లి, కుమారుడు నిద్రకు ఉపక్రమిస్తుండగా రేవతి కిరోసిన్ డ బ్బా తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భరించలేక కేకలు వేస్తూ బయటకు వచ్చి కుప్పకూలిపోయింది. లోపలనుంచి తల్లి, కుమారుడు వచ్చి ఆమెపై ఇసుక చల్లి మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి అక్కడికక్కడే మరణించింది. ఎస్సై అల్లు దుర్గాప్రసాద్ వ చ్చి విచారణ నిర్వహించారు. బందరు డీఎస్పీ డాక్టర్ కె. శ్రీనివాస్, బందరు రూరల్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి శుక్రవారం ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. స్థా నిక ఆర్ఐ తేజ, వీఆర్వో భద్రంతో పంచనామా నిర్వహించి, బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేపట్టారు. రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో.. రేవతి గుడ్లవల్లేరు కళాశాలలో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో పె డనకు చెందిన ఓ మాస్టర్ వీవర్ కుమారుడితో ప్రేమలో ప డింది. అతడు కూడా గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ చదివేవాడు. ఇద్దరూ రోజూ రైలులో కాలేజీకి వెళ్లి వస్తుండేవారు. రెండేళ్లు గా వీరు ప్రేమించుకుంటున్నారు. రేవతి తన ప్రేమ గురించి తల్లికి తెలియజేసి, ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరింది. దీంతో గి రిజ సంవత్సరం క్రితం రేవతి ప్రేమికుడి ఇంటికి వెళ్లి, అతడి కుటుంబసభ్యులతో మాట్లాడింది. అయితే మాస్టర్ వీవర్ స్థితిమంతుడు కావడంతో ఈ వివాహానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. రే వతి తరచూ ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి అభ్యంతరం చెప్పేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రేవ తి ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి మందలించింది. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. రేవతిని ప్రే మికుడికి ఇచ్చి వివాహం చేసేందుకు అతడి కుటుంబసభ్యు లు అంగీకరించి ఉంటే తన కుమార్తె ప్రాణం దక్కేదని గిరిజాకుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రేవతిని కోడలిగా చేసుకునేందుకు నిరాకరించిన వారిపై కేసు నమోదు చేయా లని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.