emi jackson
-
వైల్డ్ నైట్స్... ఆన్ సెట్స్!
బోల్డ్... వెరీ బోల్డ్! పాటల్లో అమీ జాక్సన్‌ని చూసినోళ్లు ఎవరైనా ఈ మాట అనాల్సిందే. సాంగుల్లో అమీ అప్పియరెన్స్ అంత స్పెషల్‌గా ఉంటుంది మరి! కానీ, సాంగ్ షూటింగు మాత్రం వెరీ వైల్డ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారామె. నాలుగు రోజులుగా చెన్నైలో స్పెషల్‌గా వేసిన సెట్లో ‘2.0’ కోసం రజనీకాంత్, అమీలపై దర్శకుడు శంకర్ ఓ సాంగ్ తీస్తున్నారు. ఆల్రెడీ ఈ పాట కోసం అమీ మామూలుగా రిహార్సల్స్ చేయలేదు. అల్మోస్ట్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేశారు. అయినా... షూటింగులో తిప్పలు తప్పడం లేదట! శుక్రవారం రాత్రి ‘వైల్డ్ ఫ్రైడే నైట్స్... ఆన్ సెట్’ అని ఇన్సెట్లో ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సెట్లో ఆర్టిస్టులను గాల్లో గింగిరాలు కొట్టిస్తున్నారంటే... పాటను ఏ రేంజ్లో తీస్తున్నారో మరి! ‘రోబో’కి సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ రోబోగా నటిస్తున్నారనేది చెన్నై గుసగుస. మరది నిజమో? కాదో? సినిమా విడుదలైన తర్వాత చూడాలి! రీసెంట్గా రిలీజ్ చేసిన అమీ ఫస్ట్ లుక్ మాత్రం రోబోలానే ఉంది!! -
సూర్యతో ఆ ఇద్దరు
కోలీవుడ్‌లో మళ్లీ కథానాయకుల ద్విపాత్రాభినయాల జోరు పెరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమల్ హాసన్‌లు చాలా కాలం తరువాత ఒకే సమయంలో డ్యూయల్ రోల్ చిత్రాలు చేయడం విశేషం. కమల్ హాసన్ ఉత్తమ విలన్ చిత్రంలోను, రజనీకాంత్ లింగా చిత్రం లోనూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పైకొచ్చాయి. తాజాగా ఈ దిగ్గజాల బాటలో నటుడు సూర్య పయనించడానికి రెడీ అవుతున్నారు. మంగాత్తా, బిరియాని, చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా సూర్య హీరోగా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ ప్రారంభమయిన ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. వీటిలో ఒకటి ఆత్మ పాత్ర అని సమాచారం. హాలీవుడ్ చిత్రం హలో ఘోస్ట్, కోలీవుడ్ చిత్రం కల్యాణ రామన్ చిత్రాల తరహాలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కల్యాణరామన్ చిత్రంలో కమల్ హాసన్ ఎత్తు పళ్లు, టింకర నడకలతో అమాయక పాత్ర అయిన టైటిల్ పాత్రను అద్భుతంగా పోషించారు. ఇప్పుడు ఆ తరహా పాత్రలో సూర్య కూడా ఒక డిఫరెంట్ గెటప్‌కు మారనున్నారట. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఇద్దరు సూర్యలకు ఇద్దరు అందాల భామలు రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. వీరిలో క్రేజీ తార నయనతార ఇప్పటికే ఓకే అయ్యారు. సూర్య, నయనతారల కాంబినేషన్లో ఇంతకు ముందు ఆదవన్ చిత్రం వచ్చింది. మరో సారి ఈ జోడీ తెరపై అలరించనున్నారు. అలాగే మరో హీరోయిన్గా సెక్సీ బ్యూటీ ఎమీజాక్సన్‌ను ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పాత్రకు నటి శ్రుతి హాసన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే సూర్య, శృతిహాసన్ ఇంతకు ముందు నటించిన 7ఆమ్ అరివు చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమె ఈ తాజా చిత్రంలో ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి యువ గీత రచయిత మాదన్ కాల్గి మాటలు రాయడం విశేషం. -
శంకర్ సఫలమయ్యేనా?
బ్రహ్మాండ చిత్రాలకు చిరునామా దర్శకుడు శంకర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన చిత్రాల్లో వైవిధ్యం ఉంటుంది. కొత్తదనానికి కొరతేముండదు. భారీ తనం గురించి చెప్పనక్కర్లేదు. సమాజానికి ఉపయోగపడే చక్కని సందేశం ఉంటుంది. మొత్తం మీద శంకర్ దర్శకత్వ శైలే సెపరేటు. అందుకే ఆయన స్టార్ దర్శకుడయ్యారు. శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్ నుంచి ఆ మధ్య విడుదలయిన నన్బన్ చిత్రం వరకు ఒక్కసారి పరిశీలిస్తే ఒక చిత్ర ఛాయలు మరో చిత్రంలో కనిపించవు. శంకర్ భారీగా ఖర్చు పెట్టేశారంటారు. అయితే ఆయన ఖర్చు చేసే ప్రతి రూపాయి విలువ వెండితెరపై కనిపిస్తుంది. అందుకే ఆయన చిత్రాలు ప్రేక్షకలను కనువిందు చేస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడంలో శంకర్‌ది అందేవేసిన చెయ్యి. అందుకే ఆయన చిత్రాలు వీక్షకులను అబ్బుర పరుస్తాయి. నిర్మాతకు గల్లాపెట్టెలు నింపుతాయి. వారు శంకర్ చిత్రాలకు కోట్లు ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడానికి కారణం కూడా ఇదే. శంకర్ చిత్రాలు నిర్మాణంలో ఆలస్యం అయినా అర్థవంతంగానూ, అందంగానూ, అద్భుతంగానూ ఉంటాయి. అలాంటి దర్శక సవ్యసాచి ప్రస్తుతం తన ఐక్యూను ఐ చిత్రంపై ఎట్టారు. విక్రమ్, ఎమీజాక్సన్‌లు నాయకీ నాయకులుగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అన్నియన్ తరువాత ఈ ఐ చిత్రం ద్వారా నటుడు విక్రమ్‌ను మరో కోణంలో అద్భుతంగా ఆవిష్కరించనున్నారు. ఈ దర్శక శిల్పి తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న శంకర్ తన తాజా చిత్రానికి బడ్జెట్‌ను రూ.150 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు రజనీ, కమల్ హాసన్‌ల తరువాత ఆ స్థాయిలో వెలుగొందుతున్న విజయ్, అజిత్‌లను ఈ చిత్రంలో హీరోలుగా నటింపజేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఇందులో ఆయన ఎంత వరకు సఫలం అవుతారో వేచి చూడాల్సిందే.