Emma Raducanu
-
యూఎస్ ఓపెన్‌లో సంచలనం.. డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్‌షాక్
యూఎస్ ఓపెన్‌లో బుధవారం తెల్లవారుజామున పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో బ్రిటన్ స్టార్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఎమ్మా రాడుకానుకు బిగ్‌షాక్ తగిలింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ టెన్నిస్ క్రీడాకారిణి అలిజె కార్నెట్ చేతిలో 6-3, 6-3తో చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన మరుసటి ఏడాదే తొలి రౌండ్లో వెనుదిరిగిన మూడో క్రీడాకారిణిగా ఎమ్మా రాడుకాను నిలిచింది. ఇంతకముందు 2004లో యూఎస్ ఓపెన్ నెగ్గిన స్వెత్లానా కుజ్నెత్సోవా.. మరుసటి ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక 2016లో విజేతగా నిలిచిన ఏంజెలిక్ కెర్బర్.. మరుసటి ఏడాది నవోమి ఒసాకా చేతిలో తొలి రౌండ్లోనే చిత్తుగా ఓడి ఇంటిబాట పట్టింది. ఇక 40వ ర్యాంకర్ అయిన అలిజా కార్నెట్ రికార్డు స్థాయిలో 63వ గ్రాండ్‌స్లామ్ ఆడుతుండడం విశేషం. అయితే ఇప్పటివరకు క్వార్టర్స్ వరకు మాత్రమే వెల్లగలిగింది. అయితే ఈ సీజన్లో టాప్ 20లో ఉన్న ఆరుగురు క్రీడాకారిణులను ఓడించడం విశేషం. .@alizecornet is victorious in Armstrong! She defeats Raducanu, 6-3, 6-3 to advance to Round 2. pic.twitter.com/RHAd0zCBxv — US Open Tennis (@usopen) August 31, 2022 చదవండి: US Open 2022: యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు -
Cincinnati Open 2022: తొలి రౌండ్లోనే సెరెనాకు చుక్కెదురు
సిన్సినాటి: తన టెన్నిస్ కెరీర్ చరమాంకంలో ఉందని అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ తన ఆటతీరుతో నిరూపించింది. ఇటీవల టొరంటో ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్లోనే నిష్క్రమించిన 40 ఏళ్ల సెరెనా తాజాగా సిన్సినాటి ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సెరెనా 4–6, 0–6తో బ్రిటన్ టీనేజర్, గత ఏడాది యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకాను చేతిలో పరాజయం పాలైంది. యూఎస్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతానని ఇటీవల సెరెనా ఒక మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 1995లో ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా ఇప్పటివరకు 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించింది. 19 ఏళ్ల రాడుకానుతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా రెండో సెట్లో ఒక్క గేమ్ కూడా గెలవలేకపోయింది. సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచిన పదో ప్లేయర్‌గా రాడుకాను ఘనత వహించింది. 2017లో జొహనా కొంటా (బ్రిటన్) చేతిలో చివరిసారి సెరెనా ఒక సెట్‌ను 0–6తో కోల్పోయింది. సిమోనా హలెప్ (రొమేనియా), అనాబెల్ మెదీనా గారిగెస్ (స్పెయిన్), వీనస్ విలియమ్స్ (అమెరికా), ప్యాటీ ష్నిదెర్ (స్విట్జర్లాండ్), జస్టిన్ హెనిన్ (బెల్జియం), జెలెనా జంకోవిచ్ (సెర్బియా), మేరీజో ఫెర్నాండెజ్ (అమెరికా), అలెక్సియా డెషామ్ బాలెరెట్ (ఫ్రాన్స్) కూడా సెరెనాపై ఒక సెట్‌ను 6–0తో గెలిచారు. -
వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. జకోవిచ్ శుభారంభం..
లండన్ :వరుసగా నాలుగో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు తొలి రౌండ్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. సోమవారం మొదలైన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ జొకోవిచ్ 2 గంటల 27 నిమిషాల్లో 6–3, 3–6, 6–3, 6–4తో 81వ ర్యాంకర్ సూన్‌వూ క్వాన్ (దక్షిణ కొరియా)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మొత్తం 15 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. ఇప్పటికి ఆరుసార్లు వింబుల్డన్ టోర్నీలో విజేతగా నిలిచిన జొకోవిచ్‌కిది ఈ టోర్నీ చరిత్రలో 80వ విజయం కావడం విశేషం. తద్వారా నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) కనీసం 80 అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో గెలిచిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. ఏడో సీడ్ హుర్కాజ్ అవుట్ మరోవైపు ఏడో సీడ్, గత ఏడాది సెమీఫైనలిస్ట్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్) తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 3 గంటల 28 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫోకినా (స్పెయిన్) 7–6 (7/4), 6–4, 5–7, 2–6, 7–6 (10/8)తో హుర్కాజ్పై సంచలన విజయం సాధించి తొలిసారి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 7–6 (7/1), 7–6 (11/9), 6–2తో వినోలాస్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ కామెరాన్ నోరీ (బ్రిటన్) 6–0, 7–6 (7/3), 6–3తో అందుజార్ (స్పెయిన్)పై గెలిచారు. రాడుకానూ ముందంజ మహిళల సింగిల్స్‌లో బ్రిటన్ ఆశాకిరణం, పదో సీడ్ ఎమ్మా రాడుకానూ, మూడో సీడ్ ఆన్స్ జబర్ (ట్యూనిషియా), రెండో సీడ్ కొంటావీట్ (ఎస్తోనియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో రాడు కానూ 6–4, 6–4తో అలీసన్ వాన్ ఉత్కావంక్ (బెల్జియం)పై, జబర్ 6–1, 6–3తో మిర్జామ్ జోర్క్లుండ్ (స్వీడన్)పై, కొంటావీట్ 7–5, 6–1తో బెర్నార్డా పెరా (అమెరికా)పై గెలిచారు. -
Emma Raducanu: వెంబడించి, వేధించాడు.. చాలా భయపడ్డా!
Emma Raducanu: బ్రిటన్ టెన్నిస్ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్ మగర్ అనే వ్యక్తికి యునైటెడ్ కింగ్డమ్ కోర్టు మొట్టికాయలు వేసింది. ఎమ్మాను వేధించినందుకు గానూ ఈ సైకో అభిమానిని ఐదేళ్లపాటు ఆమెకు చుట్టుపక్కలకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయస్థానం ‘రిస్ట్రెయినింగ్ ఆర్డర్’(నిషేధాజ్ఞ) జారీ చేసింది. కాగా గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 4 వరకు మగర్ ఎమ్మాను వెంబడించాడు. మూడుసార్లు ఆమె ఇంటికి వెళ్లి వివిధ బహుమతులు, కార్డులు అక్కడ పెట్టాడు. తాను ఎమ్మాను కలిసేందుకు 23 మైళ్ల దూరం నడిచానని, కాబట్టి తాను ఆమె ప్రేమకు పాత్రుడినని ఓ నోట్ రాశాడు. అంతేకాదు ఎమ్మా ఇంటి వద్ద ఉన్న క్రిస్మస్ ట్రీని కూడా అతడు దొంగిలించాడు. అంతేగాక ఆమె తండ్రి షూ కూడా ఎత్తుకొచ్చాడు. ఈ క్రమంలో ఎమ్మా రాడుకాను తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కోర్టు మగర్‌ను దోషిగా తేల్చింది. ఇక ఈ వేధింపుల గురించి ఇటీవల ఎమ్మా మాట్లాడుతూ... అతడి ప్రవర్తన తనను భయాందోళనకు గురిచేసిందని, ఈ ఘటన తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లలేకపోయానని చెప్పుకొచ్చింది. నా ఇంట్లోనే నాకు భద్రత లేదంటే మరి ఎక్కడ రక్షణ ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా 19 ఏళ్ల ఎమ్మా యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SL: విజయం సాధించినప్పటికి నిరాశలో రోహిత్.. కారణం? -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల మోత
మెల్బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా భావించిన మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్), యూఎస్ ఓపెన్ చాంపియన్, బ్రిటన్ టీనేజర్ ఎమ్మా రాడుకాను, ఆరో సీడ్ అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, మూడో ర్యాంకర్ ముగురుజా 3–6, 3–6తో 61వ ర్యాంకర్ అలిజె కార్నె (ఫ్రాన్స్) చేతిలో... 17వ సీడ్ రాడుకాను 4–6, 6–4, 3–6తో 98వ ర్యాంకర్ డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో) చేతిలో... కొంటావీట్ 2–6, 4–6తో 39వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. అలిజె కార్నెతో జరిగిన మ్యాచ్‌లో 2016 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, 2017 వింబుల్డన్ టోర్నీ విజేత అయిన ముగురుజా 33 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. గత ఏడాది యూఎస్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో బరిలోకి దిగి ఏకంగా టైటిల్‌ను సాధించి పెను సంచలనం సృష్టించిన బ్రిటన్ టీనేజర్ రాడుకాను ఇక్కడ మాత్రం అద్భుతం చేయలేకపోయింది. కొవినిచ్తో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రాడుకాను నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 39 అనవసర తప్పిదాలు చేసింది. కొవినిచ్ సర్వీస్‌లో 15 సార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలు వస్తే రాడుకాను ఆరుసార్లు సద్వినియోగం చేసుకుంది. తన సర్వీస్‌ను ఏడుసార్లు చేజార్చుకుంది. ఈ గెలుపుతో కొవినిచ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడో రౌండ్‌కు చేరిన తొలి మోంటెనిగ్రో ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రెండో సీడ్ సబలెంకా (బెలారస్), 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. సబలెంకా 1–6, 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, హలెప్ 6–2, 6–0తో బీట్రిజ్ (బ్రెజిల్)పై, స్వియాటెక్ 6–2, 6–2తో రెబెకా పీటర్సన్ (స్వీడన్)పై గెలిచారు. మెద్వెదెవ్ కష్టపడి... పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) కష్టపడి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. మెద్వెదెవ్ 2 గంటల 58 నిమిషాల్లో 7–6 (7/1), 4–6, 6–4, 6–2తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై నెగ్గగా... సిట్సిపాస్ 3 గంటల 22 నిమిషాల్లో 7–6 (7/1), 6–7 (5/7), 6–3, 6–4తో సెబాస్టియన్ బేజ్ (అర్జెంటీనా)ను ఓడించాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–4, 6–2, 6–0తో బెరాన్కిస్ (లిథువేనియా)పై, తొమ్మిదో సీడ్ ఫిలిక్స్ అలియాసిమ్ (కెనడా) 4 గంటల 19 నిమిషాల్లో 7–6 (7/4), 6–7 (4/7), 7–6 (7/5), 7–6 (7/4)తో ఫోకినా (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్ ఆండీ ముర్రే (బ్రిటన్) 4–6, 4–6, 4–6తో టారో డానియల్ (జపాన్) చేతిలో... 13వ సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–7 (6/8), 4–6, 4–6తో క్రిస్టోఫర్ ఒకానెల్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు. -
Australian Open 2022: యూఎస్ ఓపెన్ చాంపియన్‌కు దిమ్మతిరిగే షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ ఓపెన్ చాంపియన్.. బ్రిటీష్ టీనేజర్ ఎమ్మా రాడుకానుకు ఊహించని షాక్ ఎదురైంది. మోంటెనెగ్రోకు చెందిన 98వ ర్యాంకర్ డంకా కోవినిక్ చేతిలో 6-4,4-6,6-3తో ఓడిన ఎమ్మా రాడుకాను రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి సెట్లో 3-0తో ఆధిక్యంలో కనిపించిన రాడుకాను ఆ తర్వాత వరుసగా ఐదు గేమ్‌లు కోల్పోయి సెట్ కోల్పోయింది. చదవండి: Novak Djokovic: పోతూ పోతూ నష్టం మిగిల్చాడు.. కట్టేది ఎవరు? సర్వీస్ చేసే సమయంలో కుడిచేతికి గాయం కావడంతో ట్రీట్మెంట్ చేయించుకొని బరిలోకి దిగిన రాడుకాను రెండో సెట్ గెలిచినప్పటికి..మూడో సెట్లో డంకా కోవినిక్ ఫుంజుకొని 6-3తో ఓడించి సెట్‌ను కైవసం చేసుకుంది. ఒక ఒక మేజర్ గ్రాండ్‌స్లామ్‌లో కోవినిక్ మూడో రౌండ్ చేరడం ఇదే తొలిసారి. మూడో రౌండ్లో రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత సిమోనా హలెప్ లేదా బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయీయాతో తలపడనుంది. రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఆండీ ముర్రే మరోవైపు పురుషుల సింగిల్స్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు చుక్కెదురైంది. రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన టారో డేనియల్ చేతిలో 6-4, 6-4,6-4 వరుస సెట్లలో ఓడి ఇంటిదారి పట్టాడు. దాదాపు 2 గంటల 48 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో అన్ని సెట్లలోనే టారో.. ముర్రేపై స్పష్టమైన ఆధిక్యం కనబరిచాడు. జొకోవిచ్, ఫెదరర్ లాంటి ఆటగాళ్లు దూరమైన వేళ ఈసారి టైటిల్ ఫెవరెట్‌గా భావించిన ముర్రే రెండోరౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఆసక్తి కలిగించింది.