emploement
-
ఏవియేషన్ రంగంలో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీ విమానయాన రంగం .. మరో లక్ష మందికి ప్రత్యక్షంగా కొలువులు కల్పించే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటరీ అంచనాల కమిటీకి కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏవియేషన్, ఏరోనాటికల్ తయారీ రంగంలో సుమారు 2,50,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందున్నట్లు వివరించింది. వీరిలో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్గో, రిటైల్, సెక్యూరిటీ గార్డులు మొదలైన వారు ఉన్నారు. ఈ సంఖ్య 2024 నాటికి 3,50,000కు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏవియేషన్‌లో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉన్నట్లు వివరించింది. లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చదవండి👉 రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ! -
కరోనా: భారీగా ఉద్యోగాల కోత
కోవిడ్-19 మహమ్మారి పంజా విసరడంతో చాలామంది వైరస్ ధాటికి తట్టుకోలేక ప్రాణాలుకోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వేలమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయి, నిర్వహణ, వ్యయభారాలను తగ్గించుకునేందుకు ఉద్యోగాల కోత విధిస్తున్నాయి. ఈక్రమంలో వివిధ కంపెనీలలో పనిచేస్తోన్న కాంట్రాక్ట్(తాత్కాలిక) ఉద్యోగుల తొలగింపుకు మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్, ఇన్సురెన్స్, రిటైల్, ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలలో పనిచేస్తోన్న తాత్కాలిక ఉద్యోగులపై అధికంగా కోత విధిస్తున్నారు. తద్వారా కంపెనీల నిర్వహణ వ్యయాలను కొంతమేర తగ్గించుకోవచ్చని యజమాన్యాలు భావిస్తున్నాయి. ఆయా కంపెనీలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చే క్లైంట్లు సైతం తమ ఆర్డర్లను తగ్గించేశారు. కొంత మంది ఆర్డర్లు ఇచ్చిన్పటికీ సర్వీసులపై డిస్కౌంట్లు అడుగుతున్నారు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో వ్యాపారాలను సజీవంగా నిలుపుకునేందుకు డిస్కౌంట్లు ఇవ్వక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అధిక సంఖ్యలో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక ఆయా కంపెనీల హెచ్ఆర్ టీమ్‌లు ఉద్యోగులకు తొలగింపు పత్రాలను పంపుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గించాలా?లేదా వేతనాల్లో కోత విధించాలా అని ఆలోచిస్తున్నాయి. బీ2బీ ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ ఉడాన్ ఏప్రిల్ నెలలో 10-15 శాతం తాత్కాలిక ఉద్యోగులపై కోత విధించింది.దీని ప్రభావం 3000 మందిపై పడింది. ఇదే నెలలో ఆన్లైన్లో గోల్డ్లోన్లు నిర్వహించే రూపిక్ కంపెనీ సైతం ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు 600 మంది బ్లూ, గ్రే కాలర్ ఉద్యోగులను పరోక్షంగా ప్రభావితం చేసింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలు అయిన జొమాటో, స్విగ్గీలు కూడా వేతనాల్లో సవరింపులు చేసి తిరిగి ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటామని తెలిపాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ షేర్‌చాట్ బుధవారం 101 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ సంఖ్య కంపెనీ సిబ్బందిలో నాలుగో వంతుగా ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
‘స్కిల్డ్’లో గ్రేటర్ నం.3
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో గ్రీన్‌సిటీ బెంగళూరు నిలిచింది. నైపుణ్యం గల ఉద్యోగులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్న నగరాలపై అతిపెద్ద ’ప్రొఫెషనల్ నెట్వర్క్’అయిన ‘లింక్డ్ఇన్’ తాజా అధ్యయనం ‘భారత ఉద్యోగస్తుల నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి.. ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది.. దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి... అనే విశేషాలతోఈ నివేదికను లింక్డ్ఇన్ రూపొందించింది. యువ ఉద్యోగులు భారత్‌లోనే అధికం.. ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని ఈ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్ఇన్ ఇండియా పేర్కొంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలకు 2020 తొలి త్రైమాసికంలో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ చండీగఢ్, వడోదర, జయపుర ఉన్నాయి. ఈ రంగాల్లోనే అత్యధిక కొలువులు.. 1.సాఫ్ట్వేర్, ఐటీ సేవలు 2.తయారీ రంగం, ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు 3.విద్యా రంగం యువతలో డాలర్ డ్రీమ్స్.. దేశంలో పలు మెట్రో నగరాల్లో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నప్పటికీ యువతలో డాలర్ డ్రీమ్స్ కనుమరుగు కాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో పలు నగరాల్లో పెరిగిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. యువత ప్రధానంగా ఏ దేశాలకు వెళుతున్నారనేది పరిశీలించగా.. మొదట అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. ఈ రంగాల్లో నైపుణ్యాలకు భలే గిరాకీ.. 1. ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్, మైనింగ్ రంగాల్లో ఆటో క్యాడ్ నిపుణులకు గిరాకీ ఉంది 2. మేనేజ్మెంట్ ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కునే పనిలేకుండానే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది. 3. ముంబై, ఢిల్లీ నగరాల్లో మేనేజ్మెంట్ రంగంలో అధికంగా ఉద్యోగాలున్నాయి. ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు సిటీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. -
ఆడా.. ఈడా మనోళ్లే!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా తెలుగువారి జాడలే కనిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు విద్య, ఉద్యోగం, ఉపాధి కోసం ఆయా రాష్ట్రాల్లో తాత్కాలిక, స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నట్లు కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వీరంతా దశాబ్దకాలం క్రితమే అక్కడికి వెళ్లి వివిధ రంగాల్లో సెటిల్ అయినట్లు వెల్లడించింది. ఏపీ నుంచి కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు.. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు అత్యధికులు వలస వెళ్లినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. తెలుగు రాష్ట్రాల నుంచి వలసవెళ్లిన వ్యక్తులు, కుటుంబాలను ఈ అధ్యయనంలో సుమారుగా లెక్కించారు. వీరిలో అత్యధికంగా 8.90 లక్షల మంది కర్ణాటకలో స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు వెల్లడించారు. ఇక రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో సుమారు 4.37 లక్షల మంది స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు సైతం.. తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు వలస వెళ్లినవారు ఉండటం విశేషం. విద్య, ఉద్యోగం, ఉపాధి కోసమే అత్యధికులు ఆయా రాష్ట్రాలకు పయనమైనట్లు ఈ అధ్యయనం పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో తెలంగాణ ప్రాంతానికి నిజాం కాలం నుంచి భౌగోళికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా సాన్నిహిత్యం ఎక్కువగా ఉండటంతో పలువురు ఆయా రాష్ట్రాలకు పయనమైనట్లు వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో పరిశ్రమలు, భవన నిర్మాణ కార్మికులు, పవర్‌లూమ్‌లు, చేనేత, మార్కెటింగ్, ఐటీ, వ్యాపారం, వాణిజ్యం, ఆటోమోబైల్, నిర్మాణరంగంతోపాటు ఇతర రంగాల్లో తెలుగువారు ఉపాధి పొందుతున్నట్లు తెలిపింది. కర్ణాటకకు వలసవెళ్లిన తెలుగువారిలో సుమారు 1.60 లక్షల మంది సింగిల్‌గా ఉపాధి కోసం వెళ్లినట్లు పేర్కొంది. మరో 7.3 లక్షల మంది కుటుంబాలతో సహా వలస వెళ్లినట్లు తెలిపింది. ప్రధానంగా తెలుగువారు బీదర్, రాయచూర్, బసవకల్యాణ్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇక తెలుగురాష్ట్రాల నుంచి అత్యల్పంగా కేరళ, పుదుచ్చేరి, బిహార్, జార్ఖండ్ ప్రాంతాలతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు పయనమైనట్లు పేర్కొంది. రాష్ట్రాలకు వలసవెళ్లిన తెలుగువారి సంఖ్య సుమారుగా.. రాష్ట్రం వలస వెళ్లిన వారు కర్ణాటక 8.90 లక్షలు మహారాష్ట్ర 4.37 లక్షలు తమిళనాడు 2.86 లక్షలు ఒడిశా 1.20 లక్షలు గుజరాత్ 46,784 కేరళ 6,269 జమ్మూ కశ్మీర్ 2,085 పుదుచ్చేరి 40 పంజాబ్ 7,789 హరియాణా 8256 రాజస్థాన్ 12,193 మధ్యప్రదేశ్ 17,375 గుజరాత్ 46,784 గోవా 5,652 హిమాచల్‌ప్రదేశ్ 1,933 ఉత్తరాఖండ్ 117 ఢిల్లీ 23,436 ఉత్తరప్రదేశ్ 16,060 బిహార్ 06 అసోం 3,465 అరుణాచల్‌ప్రదేశ్ 43 నాగాలాండ్ 407 మణిపూర్ 167 మిజోరాం 92 పశ్చిమబెంగాల్ 16,707 జార్ఖండ్ 21 ఛత్తీస్‌గఢ్ 6,484 -
హాట్ హాట్ చిప్స్
జగిత్యాల టౌన్: కాలానికి అనుగుణంగా రుచులు కూడా మారుతున్నాయి. ఆహార ప్రియులు కొత్తకొత్త రుచులను కోరుతున్నారు. ఏదిఏమైనా సాయంత్రం స్నాక్స్ పక్కా ఉండాల్సిందేనని ఆరాటపడుతున్నారు. పట్టణాల్లో అయితే ఇది తప్పనిసరిగా మారింది. రుచితో పాటు వేడివేడిగా హాట్ చిప్స్ అందించే కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో యువకులు హాట్ చిప్స్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. హాట్ చిప్స్‌పై ఈఆదివారం ప్రత్యేక కథనం మీకోసం ..... అందరికీ అందుబాటులో చిన్నారులు, పెద్దలు సాయంత్రం స్నాక్స్ కోసం చిప్స్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చిప్స్ కేంద్రాల్లో వివిధ పిండి పదార్థాలతో ఘటి, బొంది, రింగులు, కారపూస, మిక్చర్, శబ్దాన, దల్మోట్, మురుకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చిప్స్‌లో ఆలు, కాకరకాయ, అల్లం ఆలు చిప్స్, బనాన చిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎంతో రుచి తాజాగా ఎప్పటకప్పుడు పిండి పదర్ధాలు తయారు చేయడంతో ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజు స్నాక్స్ కొనుగోలు చేస్తుంటాం. రుచి, శుచితో ఉండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. – గోపినాథ్, జగిత్యాల ఆదరణ లభిస్తోంది మొదట్లో ఇబ్బంది ఎదురైంది. రుచి శుభ్రత విషయంలో రాజీ పడలేదు. రోజు రోజుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా చిప్స్ అమ్మకాలు ఉంటాయి. – నరేశ్, నిర్వాహుకుడు, జగిత్యాల -
నైపుణ్య వృద్ధితోనే ఉద్యోగావకాశాలు
నెల్లూరు(టౌన్): మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించినప్పుడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఏపీఎస్ఎస్డీసీ సీఈఓ గంటా సుబ్బారావు తెలిపారు. సోమవారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని సెమినార్ హాల్లో పీజీ, డిగ్రీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సరాసరి ఏడాదికి 3 లక్షల మంది పట్టభద్రులు వస్తున్నారని, వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మార్కులపై దృష్టి పెట్టి నైపుణ్యాలను తక్కువ స్థాయిలో పెంపొందించడం కారణంగా చెప్పారు. నైపుణ్యాలను పెంపు దిశగా ఆంధ్రప్రదేశ్ సంస్కరణలు అన్ని స్థాయిల్లో చేపట్టిందన్నారు. ఏపీఎస్ఎస్డీసీ అన్ని స్థాయిల్లో అన్ని వర్గాలకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నిరుద్యోగ యువత ఉపాధి కల్పనలో పాటు బడుతుందని తెలిపారు. సమావేశంలో వీఎస్‌యూ వైస్.ఛాన్సలర్ వీరయ్య, రిజిస్ట్రార్ శివశంకర్, డీన్ చంద్రయ్య, ప్రదీప్, సురేష్, శ్యామ్మోహన్, లోకనాధం, భాగ్యశ్రీ, సతీష్, శివప్రసాద్, ఆయా కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.