హాట్‌ హాట్‌ చిప్స్‌ | ​Hot Hot Chips | Sakshi
Sakshi News home page

హాట్‌ హాట్‌ చిప్స్‌

Published Mon, Mar 4 2019 10:38 AM | Last Updated on Mon, Mar 4 2019 10:43 AM

​Hot Hot Chips - Sakshi

జగిత్యాల టౌన్‌: కాలానికి అనుగుణంగా రుచులు కూడా మారుతున్నాయి. ఆహార ప్రియులు కొత్తకొత్త రుచులను కోరుతున్నారు. ఏదిఏమైనా సాయంత్రం స్నాక్స్‌ పక్కా ఉండాల్సిందేనని ఆరాటపడుతున్నారు. పట్టణాల్లో అయితే ఇది తప్పనిసరిగా మారింది. రుచితో పాటు వేడివేడిగా హాట్‌ చిప్స్‌ అందించే కేంద్రాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో యువకులు హాట్ చిప్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. హాట్‌ చిప్స్‌పై ఈఆదివారం ప్రత్యేక కథనం మీకోసం .....
అందరికీ అందుబాటులో 
చిన్నారులు, పెద్దలు సాయంత్రం స్నాక్స్‌ కోసం చిప్స్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. చిప్స్‌ కేంద్రాల్లో వివిధ పిండి పదార్థాలతో ఘటి, బొంది, రింగులు, కారపూస, మిక్చర్, శబ్దాన, దల్‌మోట్, మురుకులు వంటివి అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు చిప్స్‌లో ఆలు, కాకరకాయ, అల్లం ఆలు చిప్స్, బనాన చిప్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

ఎంతో రుచి


తాజాగా ఎప్పటకప్పుడు పిండి పదర్ధాలు తయారు చేయడంతో ఎంతో రుచిగా ఉంటాయి. ప్రతి రోజు స్నాక్స్‌ కొనుగోలు చేస్తుంటాం. రుచి, శుచితో ఉండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. 
– గోపినాథ్, జగిత్యాల

ఆదరణ లభిస్తోంది

 
మొదట్లో ఇబ్బంది ఎదురైంది. రుచి శుభ్రత విషయంలో రాజీ పడలేదు. రోజు రోజుకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎక్కువగా చిప్స్‌ అమ్మకాలు ఉంటాయి. 
– నరేశ్, నిర్వాహుకుడు, జగిత్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement