Employee Health Card Scheme
-
ఉద్యోగుల ఆరోగ్యానికి మరింత భద్రత
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు చేసేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను తీర్చిదిద్దారు. నిధులు కూడా ఎక్కువ కేటాయిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌పై ఖర్చు చేసిన మొత్తంకంటే ఈ నాలుగేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కువ వెచ్చించింది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఈహెచ్ఎస్ కింద రూ.748.81 కోట్లు మాత్రమే వ్యయం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ స్కీం కింద రూ.1,094.69 కోట్లు ఖర్చు చేసింది. మరో పక్క ఈహెచ్ఎస్ ఉన్నప్పటికీ ఉద్యోగుల అభ్యర్థన మేరకు మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించింది. అవాంతరాల్లేకుండా ఈహెచ్ఎస్ ఈహెచ్ఎస్కు ఎటువంటి అవాంతరాల్లేకుండా, ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈహెచ్‌స్‌కు సంబంధించి ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్‌ను ఏ నెలకు ఆ నెల ఎంప్లాయీస్ హెల్త్ స్కీము ట్రస్టుకు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇందుకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపింది. అంటే ఈ నెల ఉద్యోగులు, ప్రభుత్వ వాటా వచ్చే నెలలో నేరుగా ట్రస్టుకు జమ అవుతుంది. తద్వారా ఆస్పత్రులకు ఈహెచ్ఎస్ చెల్లింపులు సకాలంలో జరుగుతాయి. దీనివల్ల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి ఎటువంటి అవాంతరాలు ఉండవు. ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్మెంట్ కింద గత రెండేళ్లలో రూ..242 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 28,097 బిల్లులకు రూ.109.84 కోట్లు, 2022–23లో 16,495 బిల్లులకు రూ.132.41 కోట్లు మంజూరు చేసింది. క్లెయిమ్స్ పరిష్కారంలో జాప్యం ఉండదు: వెంకటరామిరెడ్డి ఎంప్లాయీస్ హెల్త్ స్కీములో ఉద్యోగులు, ప్రభుత్వ కంట్రిబ్యూషన్లను నెలవారీ ట్రస్టుకు జమ చేయడం వల్ల ఆస్పత్రులకు క్లెయిమ్స్ పరిష్కారంలో ఇకపై జాప్యం ఉండదని, ఇది ఉద్యోగులకు చాలా మేలు చేస్తుందని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామి రెడ్డి తెలిపారు. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడం కూడా ఉద్యోగులకు మేలు చేకూర్చడమేనని చెప్పారు. హెల్త్ స్కీముల్లో ఎటువంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. -
AP: ఈహెచ్ఎస్పై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: ఉద్యోగులు ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్ జవహార్ రెడ్డి సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ అంశాల తోపాటు వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు గురించి కూడా చర్చించారు. ముఖ్యంగా ఈహెచ్ఎస్లో మరిన్నీ అంశాలు చేర్చడం గురించి కూడా మాట్లాడారు. ఈమేరకు ఈహెచ్ఎస్లో ప్రస్తుతం ఉన్న కొన్ని ప్యాకేజీల ధరల పెంపు, ఉద్యోగుల నెలవారీ కంట్రీబ్యూషన్ పెంపు, మెడికల్ రీ ఇంబర్స్మెంట్ పరిమితి పెంచాల్సిన ఆవశ్యకత, కేన్సర్ వంటి రోగాలకు పరిమితి లేకుండా అందించే అంశం, అలాగే 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులుకు వన్‌టైం మాస్టర్ హెల్త్ చెకప్ తదితర అంశాల గురించి సీఎస్ జవహార్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అంతేగాదు ఇందుకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తే ఉద్యోగ సంఘాలతో మాట్లాడి రాష్ట్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుందామని అధికారులుకు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఆరోగ్య పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎస్ జవహార్ రెడ్డి. కాగా, ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి యం.టీ.కృష్ణబాబు,ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి (హెచ్ ఆర్)చిరంజీవి చౌదరి, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, ప్రత్యేక కార్యదర్శి (సియంఆర్ఎఫ్) డా.హరికృష్ణ, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్ర ప్రసాద్,ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ అధికారి టిఎస్ఆర్ మూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. (చదవండి: అపోహలొద్దు.. మూడు రాజధానులపై సజ్జల క్లారిటీ) -
16 నుంచి పరిమితిలేని వైద్యం
♦ ఉద్యోగుల హెల్త్ కార్డుల పథకం పూర్తి స్థాయి అమలు ♦ పథకం ఖర్చులో సగమే భరించనున్న ప్రభుత్వం ♦ మిగతా సగం ఉద్యోగుల ప్రీమియం ద్వారా వసూలు ♦ ప్రీమియం దాదాపు మూడు రెట్లు పెరిగే అవకాశం ♦ పథకం పూర్తి స్థాయిలో అమలుకు రూ.400 కోట్లు అంచనా సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు హెల్త్ కార్డుల పథకం అమలు కోసం ఉద్యోగులు ఎదురుచూపు దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి హెల్త్ కార్డులపై ఉద్యోగులకు పరిమితి లేని వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం రెండు గంటలకు పైగా సాగిన సమావేశంలో కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులతోపాటు వైద్య,ఆరోగ్యశాఖ, ఎన్టీఆర్ ఆరోగ్య సేవా అధికారులు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, కత్తి నరసింహారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, కమలాకరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలోని ముఖ్య అంశాలు.. ► ప్యాకేజీ ధరలు ఖరారైన తర్వాత పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని,ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం కావాలని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులు అడిగారు. ► ప్యాకేజీ ధరల ఖరారుకు ఎంత సమయం తీసుకున్నా పాత తేదీ నుంచే అమలు చేయడానికి వీలుంటుంది కాబట్టి తక్షణం హెల్త్ కార్డుల పథకాన్ని పూర్తి స్ధాయిలో అమలులోకి తెచ్చి తర్వాత ప్యాకేజీ ధరల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. ► దీనికి సీఎం సానుకూలంగా స్పందించి తక్షణం హెల్త్ కార్డుల పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆస్పత్రుల ప్రతినిధులను ఆదేశించారు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెల్త్ కార్డుల పథకం అమలుకు రూ.200 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో 40శాతం(రూ.80 కోట్లు) ఉద్యోగుల వాటా కాగా మిగతా రూ.120 కోట్లను ప్రభుత్వమే భరించాలి. అయితే ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి ఏటా రూ.400 కోట్లు అవసరమని తాజాగా అంచనా వేశారు. ఇందులో సగం భరించడానికి ఉద్యోగులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.90, 120 ప్రీమియం దాదాపు మూడు రెట్లు పెరగనుంది. పీఆర్సీ నుంచే గ్రాట్యుటీ పెంపు వర్తింపు గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని రూ.12 లక్షలకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను ఈ ఏడాది జనవరి నుంచి 2014 జూన్2 నుంచి అమలు చేయాలని జేఏసీ చేసిన విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో సవరణ చేయాలని అధికారులకు సీఎం సూచించారు.