Employee salary
-
ఆర్టీసీ ఉద్యోగులకు ‘సహకార రుణాలు’
హైకోర్టు జోక్యం ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం నింపింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ‘ఉద్యోగుల సొంత నిధి’ నుంచి రుణాలందుకుంటున్నారు. పిల్లల చదువులు, సొంతింటిని సమకూర్చుకోవ టం, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాలకు రుణం పొందుతున్నా రు.. కేవలం 40 రోజుల వ్యవధిలో ఏకంగా 9,500 మంది రూ.200 కోట్ల వరకు రుణాల రూపంలో పొందారు.సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్) పేరుకుపోయిన రుణ దరఖాస్తులను క్లియర్ చేసింది. రూ.355 కోట్ల మేర దరఖాస్తుదారులకు చెల్లింపులు చేసింది. అడపాదడపా స్వల్ప మొత్తం రుణాల రూపంలో ఇవ్వటం తప్ప ఇంత మొత్తంలో చెల్లించడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. ఇటు ఉద్యోగుల ఇంటి అవసరాలకు రుణాలు, పదవీ విరమణ పొందిన వారికి సెటిల్మెంట్లు, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులతో ఒక్కసారిగా సీసీఎస్ కార్యాలయం సందడిగా మారింది.హైకోర్టు జోక్యంతో...ప్రతినెలా ఉద్యోగుల జీతం నుంచి నిర్ధారిత మొత్తం మినహాయించి సీసీఎస్‌లో ఆర్టీసీ డిపాజిట్ చేస్తుంది. ఇలా పోగయ్యే మొత్తం నుంచి ఉద్యోగులకు రుణాలివ్వటం సీసీఎస్ విధి. ⇒ ఉద్యోగుల జీతాల నుంచి ఆ మొత్తాన్ని మినహాయిస్తూ దాన్ని కొన్నేళ్లుగా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దీంతో సీసీఎస్ దివాలా దశకు చేరిన విషయం తెలిసిందే. దీంతో సీసీఎస్ పాలకవర్గం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తోంది. ⇒గతేడాది రూ.200 కోట్ల మొత్తాన్ని సీసీఎస్‌కు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ, కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లించటంతో సీసీఎస్ పాలకవర్గం కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. మిగతా రూ.150 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఏప్రిల్‌లో కోర్డు ఆర్టీసీని ఆదేశించింది. దీంతో ఆ నెల చివరలో ఆ మొత్తాన్ని ఆర్టీసీ జమ చేసింది. ⇒ది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు నుంచి సీసీఎస్ మరో రూ.150 కోట్లు రుణం పొందింది. ఈ రూ.300 కోట్లను ఉద్యోగులకు రుణాలుగా, రిటైర్డ్ ఉద్యోగుల సెటిల్మెంట్లకు వినియోగించాలని నిర్ణయించింది. 9,500 దరఖాస్తులు ఏప్రిల్ చివరి నాటికి సీసీఎస్‌లో రుణాల కోసం 6,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ రెండున్నరేళ్లుగా పేరుకుపోయినవే. నిధులు సమకూరాయని తెలియగానే మరో 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వెరసి 9,500 దరఖాస్తుదారులకు రుణాల కింద రూ.200 కోట్లు సీసీఎస్ అందజేసింది. అప్పటివరకు వారి జీతాల నుంచి కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేసిన మొత్తాన్ని రిటైర్మెంట్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.కానీ నిధులు లేక ఏడాదిన్నరగా దాదాపు 1,200 మందికి చెల్లించలేదు. ఇప్పుడు వారికి కూడా సెటిల్ చేశారు. సీసీఎస్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటంతో అందులో నుంచి తమ సభ్యత్వాన్ని రద్దు చేసి సెటిల్ చేయాల్సిందిగా మరో 3,200 మంది దరఖాస్తులు కూడా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. వారందరికీ చెల్లించేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి ఆర్టీసీ జమ చేసిన నెలవారీ మొత్తం రూ.55 కోట్లను కూడా ఇందుకు వినియోగించారు. ఇక సీసీఎస్‌లో డిపాజిట్లు పెట్టిన రిటైర్డ్ ఉద్యోగులకు 9 నెలలుగా పేరుకుపోయిన వడ్డీ మొత్తం మరో రూ.9 కోట్లు కూడా చెల్లించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో రూ.355 కోట్లు చెల్లించారు.ఇంకా రావాల్సినవి రూ.980 కోట్లురుణాలు ఇస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు దరఖాస్తులు సమర్పించారు. పోగైన నిధులు రూ.355 కోట్లు ఖర్చయిపోవటంతో, ఇప్పుడు కొత్తగా వచ్చిన దరఖాస్తుల్లో 3 వేలు పెండింగ్ జాబితాలోకి చేరాయి. ఇంకా కొత్త దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రతినెలా సీసీఎస్‌కు చెల్లించే మొత్తం రూ.20 కోట్లు మాత్రమే. అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలంటే ఈ మొత్తం సరిపోదు. సీసీఎస్‌కు ఆర్టీసీ చెల్లించాల్సిన మిగతా బకాయిలు చెల్లిస్తే తప్ప ఇవి క్లియర్ అయ్యే సూచనలు కనిపించటం లేదు. ఇప్పటికీ, సీసీఎస్‌కు ఆర్టీసీ రూ.570 కోట్ల మొత్తం (అసలు) బకాయి ఉంది. దీనిపై చెల్లించాల్సిన వడ్డీ మరో రూ.410 కోట్ల వరకు ఉంటుందని అంచనా. వెరసి మరో రూ.980 కోట్ల వరకు ఆర్టీసీ బకాయి ఉన్నట్టు తేలుతోంది. విడతలవారీగానైనా ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే మిగతా దరఖాస్తులు క్లియర్ అవుతాయి. -
ఏ ఉద్యోగికీ జీతం తగ్గలేదు.. పే స్లిప్‌లు చూస్తే విషయం తెలుస్తుంది: సీఎస్
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గలేదని, ప్రతి ఒక్కరి గ్రాస్ జీతం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చెప్పారు. జీతాలు పెరిగాయి కాబట్టి ఆందోళనలు విరమించుకుని మంత్రుల కమిటీతో చర్చలకు రావాలన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పే ఫిక్సేషన్ దాదాపు పూర్తయిందని.. డిసెంబర్, జనవరి నెలల పే స్లిప్‌లను పోల్చి చూసుకుని ఎంత జీతం పెరిగిందో తెలుసుకోవచ్చన్నారు. మంగళవారం రాత్రికల్లా ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు పడతాయని తెలిపారు. ఐఆర్ కలిసినా, కలవకపోయినా జీతాల్లో పెరుగుదల ఉందన్నారు. ఎవరి జీతం తగ్గించకూడదని సీఎం చెప్పారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 32 గ్రేడ్ల పే స్లిప్‌లను పరిశీలిస్తే ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. సాధారణంగా పీఆర్సీలో ఐఆర్ కలపరని, ఇప్పుడు దాన్ని కలిపి చూసినా కొంచెం పెరుగుదల ఉందని చెప్పారు. ఐఆర్ తీసేసి పీఆర్సీ టు పీఆర్సీ చూస్తే ఇంకా కొంచెం పెరుగుదల ఎక్కువ ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసరావు, ఎల్. సత్యనారాయణల నూతన పే స్లిప్‌లు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 3, 4 సంవత్సరాలుగా ఇబ్బందికరంగా ఉంది. రూ.60 వేల కోట్ల ఆదాయం తగ్గింది. ప్రతి సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉండాలి. కానీ కోవిడ్ వల్ల ఆదాయం పెరగలేదు. గత మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాం. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ సిఫారసులు చేశాం. ► అయినా 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పీఆర్సీకి మించి ఉద్యోగులకు మేలు జరిగింది. రిటైర్మెంట్ వయసు రెండేళ్ల పెంపుదల, ఎంఐజీ ఇళ్లలో 20 శాతం రాయితీ వంటివి పీఆర్సీకి సంబంధం లేకపోయినా సీఎం ఇచ్చారు. ► ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. అందువల్ల సమ్మె ఆలోచన విరమించుకోవాలి. సమ్మె వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో అన్ని అంశాలపైనా చర్చించాలి. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉంది. కావున పరస్పర చర్చల ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయి. హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాలపైనా చర్చిద్దాం ► ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాలపైనా సామారస్యంగా మాట్లాడుకుందాం. ► ఉద్యోగులతో సంబంధం లేని వ్యక్తులు ఈ అంశాన్ని హైజాక్ చేస్తున్నారు. ఎంత వరకు చేయాలో అంత వరకు ఉద్యోగులకు మేలు చేయాలని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కొత్త పీఆర్సీ అమలుకు గతంలో 6 నెలల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 6 రోజుల్లో చేశాం. మనదంతా ఒకే కుటుంబం మన ఉద్యోగులందరిదీ ఒకే కుటుంబం. కొత్త పీఆర్సీ అమలు కోసం డీడీఓలు, ఎస్టీఓలు, డీటీఓలు, డీడీలు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చాలా సహకరించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు వారి ఖాతాల్లో వేశాం. 3.3 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లో పింఛను జమ అయింది. 3.97 లక్షల మంది ఉద్యోగులకు పే ఫిక్సేషన్ చేశాం. వారి ఖాతాల్లో జీతం పడింది. ప్రతి ఉద్యోగికి వారి జీతం వివరాలు పంపాం. అంతే కాకుండా 94,827 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించాం. 3,68,545 మంది పెన్షనర్లకు జీతాలు వేశాం. – ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రతి ఒక్కరి జీతం పెరిగింది.. ప్రతి ఉద్యోగికి పాత పీఆర్సీ ప్రకారం డిసెంబర్ నెల జీతం ఎంత వచ్చింది.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఎంత వచ్చిందో పే స్లిప్‌లో వివరంగా ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో డిప్యుటేషన్‌పై కార్యదర్శి హోదాలో పని చేస్తున్న శ్రీనివాసరావు గ్రాస్ జీతం డిసెంబర్లో రూ.199,685 ఉండగా, కొత్త పీఆర్సీ ప్రకారం రూ.2.32 లక్షలు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయంలో పనిచేసే సహాయ సెక్షన్ అధికారి వి శ్రీనివాసులుకు డిసెంబర్లో రూ.50,044 గ్రాస్ జీతం ఉంటే, జనవరి గ్రాస్ జీతం రూ.57,618 వచ్చింది. డిసెంబర్లో ఇతని బేసిక్ పే రూ.27,360 ఉండగా, జనవరిలో అది రూ.42,140కి పెరిగింది. డిసెంబర్లో హెచ్ఆర్ఏ రూ.5,472 ఉండగా జనవరిలో రూ.6,742 ఉంది. ఆయన నికర జీతం డిసెంబర్లో రూ.43,855 కాగా, జనవరిలో రూ.50,075కు పెరిగింది. జల వనరుల శాఖలో ఏఈఈగా పని చేస్తున్న లావు సీతారామయ్య డిసెంబర్ గ్రాస్ రూ.91,181 కాగా, జనవరిలో రూ.99,038కు పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే రూ.20,635 పెరిగింది. పోలీసు శాఖలో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న బి వెంకటరమణ డిసెంబర్ గ్రాస్ జీతం రూ.1,31,924 కాగా, జనవరిలో గ్రాస్ రూ.1,48,063కి పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే ఆయన జీతం రూ.34,048 పెరిగింది. 32 గ్రేడ్ల ఉద్యోగులు, అధికారుల్లో ప్రతి ఒక్కరి జీతం పెరిగింది. – శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి -
‘108’ ఉద్యోగుల వేతనాల పెంపు
రూ.4 వేలు పెంచుతూ ఉత్తర్వులు హైదరాబాద్: జీవీకే–ఈఎంఆర్ఐ పరిధిలోని ‘108’ అత్యవసర సర్వీసు ఉద్యోగుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనానికి అదనంగా రూ.4 వేలు పెంచుతూ ఉత్తర్వులి చ్చారు. ఈ పెంపు గతేడాది ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. మొత్తం 1,650 మంది ‘108’ ఉద్యోగులకు పెంచిన వేతనాలు వర్తి స్తాయని అధికారులు తెలిపారు. వేతనాల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌కు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి రాష్ట్ర ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందడి మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
అరకొరగానే అందిన ‘ఆసరా’
- పింఛన్ల పంపిణీపై బ్యాంక్ సెలవుల ప్రభావం - అక్టోబర్ పింఛన్ కోసం నేటికీ తప్పని ఎదురు చూపులు - మొత్తం రూ.397 కోట్లకు ఇప్పటివరకు పంపిణీ చేసింది రూ.157 కోట్లే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆసరా’ పథకం లబ్ధిదారులకు పింఛన్లు అరకొరగానే అందాయి. ఈ నెల 1నుంచి 10 లోగా పూర్తి కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ నెలాఖరవుతున్నా ఓ కొలిక్కి రాలేదు. రాష్ట్రంలోని 36 లక్షలమంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం రూ.397 కోట్లను విడుదల చేసినప్పటికీ ఆ సొమ్ము క్షేత్రస్థాయికి చేరకపోవడం ప్రభుత్వ వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యంగా మొదలైనప్పటికీ, తాజాగా శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు రావడంతో పంపిణీ ఎక్కడికక్కడే నిలిచిపోరుుంది. ప్రారంభంలో రూ.500 నోట్లు లేకున్నా బ్యాంకులిచ్చిన రూ.2000 నోట్లనే ఇద్దరు లేదా ముగ్గురు లబ్ధిదారులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పంపిణీ చేసింది. ఆ నోట్లను పంచుకోవడంలో పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ నుంచి వివిధ బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు విరివిగా వచ్చినా, క్షేత్రస్థారుులో సరిపడా మొత్తాలకు కొత్తనోట్లను బ్యాం కర్లు ఇవ్వడం లేదని పంపిణీ సిబ్బంది వాపోతున్నారు. బ్యాంకుల నుంచి కావాల్సినన్ని కొత్తనోట్లు అందినట్లయితే శని, ఆదివారాల్లో కూడా లక్షలాదిమందికి పింఛన్ సొమ్మును అందించగలిగేవారమని చెబుతున్నారు. శుక్రవారం వరకు మొత్తం లబ్ధిదారుల్లో 14.44 లక్షలమందికి రూ.157.22 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేసినట్లు సెర్ప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో పోస్టాఫీసుల ద్వారా.5.50 లక్షలమందికి రూ. 61.80 కోట్లు, బ్యాంకు ఖాతాలున్న 8.85 లక్షలమందికి రూ.94.41 కోట్లు, పంచాయతీ సిబ్బంది ద్వారా గ్రామాల్లోని సుమారు 9వేల మందికి ఇప్పటివరకు రూ.1.05కోట్లు పంపిణీ చేశారు. అక్టోబర్ పింఛన్ సొమ్మే నేటికీ అందకపోతే, నవంబర్ నెల పింఛన్ ఎప్పుడొస్తుందోనని పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్ సిబ్బందికి 1న వేతనాలు డౌటే! పెద్దనోట్ల రద్దు ప్రభావం ఆసరా పెన్షనర్లతో పాటు ఆయా పింఛన్లను పంపిణీ చేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సిబ్బందిపైనా పడింది. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలను అదుకునే సెర్ప్ సిబ్బందికి ఈ నెల 1న వేతనాలొచ్చేది డౌటేనని ఉన్నతాధికారులు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. సెర్ప్‌లో వివిధ స్థారుుల్లో పనిచేస్తున్న 4,126 మంది ఉద్యోగుల వేతనాలకు రూ.11.5 కోట్లు అవసరమవుతాయి. ఈ మొత్తానికి ప్రతినెలా ఒకటో తేదీకి 15రోజుల ముందుగానే ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను జారీచేసేది. అరుుతే.. నెలాఖరు వస్తున్నా బీఆర్వోను సర్కారు విడుదల చేయకపోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెద్దనోట్ల రద్దు కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెలలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడం, కీలకమైన ప్రభుత్వ పథకాలకు పెద్దమొత్తాల్లో బిల్లులను తప్పనిసరిగా చెల్లించాల్సి రావడం.. తదితర కారణాలతో సెర్ప్ ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్ ఇవ్వడంపై ఆర్థిక శాఖ మీనమేషాలు లెక్కిస్తోందని తెలిసింది. ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాని పక్షంలో ఇతర పద్దుల నుంచైనా వేతనాలను చెల్లించాలని పలువురు చిరుద్యోగులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.