‘108’ ఉద్యోగుల వేతనాల పెంపు
రూ.4 వేలు పెంచుతూ ఉత్తర్వులు
హైదరాబాద్: జీవీకే–ఈఎంఆర్‌ఐ పరిధిలోని ‘108’ అత్యవసర సర్వీసు ఉద్యోగుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనానికి అదనంగా రూ.4 వేలు పెంచుతూ ఉత్తర్వులి చ్చారు. ఈ పెంపు గతేడాది ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు.
మొత్తం 1,650 మంది ‘108’ ఉద్యోగులకు పెంచిన వేతనాలు వర్తి స్తాయని అధికారులు తెలిపారు. వేతనాల పెంపు పట్ల సీఎం కేసీఆర్‌కు, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి రాష్ట్ర ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మందడి మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.