లోవలో నిజం ‘తలుపు’ తీశారు
నలుగురు ఉద్యోగుల సస్పెన్ష¯ŒS
సస్పెండైన సూపరింటెండెంట్ డిమోష¯ŒS
‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందన
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన లోవ తలుపులమ్మ దేవస్థానంలో అవినీతి తిమింగలాలపై ఎట్టకేలకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. దేవస్థానం ఘాట్‌రోడ్డులో అవనుమతి లేకుండానే రోడ్లు ఆధునికీకరణ పేరుతో ని««దlులు మింగేయడం, ఆలయంలో దుకాణాలను బినామీ, బంధువుల పేర్లతో ఉద్యోగాలు నిర్వహించడమే కాకుండా లీజు సొమ్ములు జమచేయకుండా ఎగవేసిన భాగోతాలను పక్క‘దారి’ పనులు, ‘కోటిన్నరకు కన్నం’, సస్పెన్ష¯ŒS డిస్మిస్, ‘తలుపులమ్మా నిజం తలుపు తీయమ్మా’ ‘ఒక తండ్రి...నలుగురు కొడుకులు’ శీర్షికలతో గత నవంబరు నుంచి ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ భాగోతంపై ప్రత్యేక నిఘా పెట్టి అవినీతికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించి ప్రచురించింది. బంధువులను బినామీలుగా చూపించిన ఆలయ ఉద్యోగులైన తండ్రి, నలుగురు కొడుకులు కలిసి కోటిన్నర మెక్కేసి అమ్మవారికి శఠగోపం పెట్టారు.
బాధ్యులపై చర్యలకు ఆదేశాలు
‘సాక్షి’ వరుస కథనాలపై స్పందించిన దేవస్థానం పాలక మండలి, ఈఓ సంయుక్తంగా బాధ్యులపై చర్యలకు దేవాదాయ శాఖ కమిషనర్‌కు సిఫార్సు చేశారు. అధికార పార్టీ నేతలు అక్రమార్కులకు అండగా నిలవడంతో బాధ్యులపై చర్యలకు ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా ఇంతకాలం వెనుకాడుతూ వచ్చారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదిక వెళ్లి నెల రోజులైపోయింది. మరింత జాప్యం జరిగితే అక్రమార్కులు దేవస్థానానికి జమ చేయాల్సిన సుమారు రూ.1.33 కోట్లు వెనక్కు రావడం సాంకేతికంగా అసాధ్యమనే నిర్ధారణకు వచ్చి ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. బాధ్యులైన నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఈఓ అసిస్టెంట్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్, చైర్మ¯ŒS కరపా అప్పారావు, ధర్మకర్త యాదాల లోవకృష్ణ తదితరులు శుక్రవారం విలేకర్లకు తెలిపారు.
నలుగురు ఉద్యోగులు సస్పెండవగా మెక్కేసిన రూ.1.33 కోట్లు తిరిగి రాబట్టేందుకు దేవస్థానం కోర్టులో కేసులు వేసింది. అనుమతి లేకుండా దేవస్థానంలో రోడ్లు నిర్మాణం చేపట్టిన విషయాన్ని ‘పక్కదారి పనులు’ శీర్షికన వెలుగులోకి తేవడంతో గత నవంబరు 21న సస్పెండ్ చేసిన సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రూ.22 లక్షలు దుర్వినియోగానికి పాల్పడ్డట్టు తాజాగా నిర్ధారించారు. ఈ కారణంగా సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ను డిమోష¯ŒS చేశారు. ఈ మేరకు సీనియర్ అసిస్టెంట్‌గా డిమోష¯ŒS ఎందుకు చేయకూడదో 15 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఈవో చంద్రశేఖర్ నోటీసు జారీ చేశారు. లోవ దేవస్థానంలో అవినీతిని బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు విడిచిపెట్టకుండా కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ని భక్తులు అభినందిస్తున్నారు.
‘సాక్షి’ చెప్పిందే నిజం...
లోవ దేవస్థానంలో వివిధ హక్కులకు నిర్వహించే టెండర్, బహిరంగ వేలంలో బినామీ పేర్లతో దక్కించుకుని రూ.1.33 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని ‘సాక్షి’ చెప్పిందే నిజమని ఆ శాఖ విచారణలో నిగ్గు తేలింది. మూడేళ్లుగా నెల వాయిదాలు చెల్లించకుండా ఈ మొత్తాన్ని ఎగవేసినట్టు గుర్తించారు. ఇందుకు బాధ్యులుగా గుర్తించి ఆలయంలో పనిచేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అగ్రహారపు రామారావు (ధ్వని వాయిద్యకారుడు), అగ్రహారపు రామచంద్రరావు (డోలు వాయిద్యకారుడు), అగ్రహారపు శ్రీను (శృతి వాయిద్యకారుడు), అగ్రహారపు లోవరాజు (తాళం వాయిద్యకారుడు)లను సస్పెండ్ చేశారు.