employees promotions
-
‘పంచాయతీరాజ్’లో పదోన్నతులు
సాక్షి, అమరావతి: పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల నుంచి ఎంపీడీవోల వరకు పదోన్నతులు దక్కనున్నాయి. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 52 డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులతో పాటు జిల్లాల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ జెడ్పీ సీఈవో పోస్టులలో ఎంపీడీవోలకు పదోన్నతులు కల్పించనున్నారు. ఇందుకోసం సీనియారిటీ జాబితాను రూపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 128 ఎంపీడీవో పోస్టుల్లో మండల స్థాయిలో పనిచేసే ఈవోపీఆర్డీలతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ అధికారుల(సూపరిండెంట్లు)కు పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం 4 జోన్ల పరిధిలో 45 ఈవోపీఆర్డీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఈవోపీఆర్డీలకు పదోన్నతుల ద్వారా అదనంగా చేరే పోస్టుల్లో గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులతో పాటు జెడ్పీ, ఎంపీపీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసే వారికి పదోన్నతి కల్పించనున్నారు. ఏపీలోని 4 జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శులు.. గ్రేడ్–2 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లోకి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్ దక్కనుంది. -
20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాం..
సాక్షి, మహబూబ్నగర్: దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 20 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, ఇందుకు తగ్గట్టుగా పని చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డిలు పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉద్యోగుల పదోన్నతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులను ఆయా ఉద్యోగులకు అందించారు. రాష్ట్రం ఏర్పడ్డాక లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు చేయాలని మంత్రులు కోరారు. ఖజానా డబ్బులన్ని ఉద్యోగుల జీతాల పెంపుకే ఇచ్చారన్న భావన ప్రజల్లో కలగకుండా పీఆర్సీని పెంచుకుందమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, న్యాయ బద్దమైన పీఆర్సీ వచ్చేలా తాము కృషి చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అనంతరం టీఎన్జీవో 2021 డైరీ, క్యాలెండర్లను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖలో వివక్ష
అమరావతి : గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై వివక్ష కొనసాగుతున్నదని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ (సి) ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జగజ్యోతి, జి.చిట్టిబాబు ఆరోపించారు. తాడేపల్లిలోని గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్సీ కార్యాలయ ఆవరణలో శనివారం ఏర్పాటు చేసిన ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. 1984లో ఇంజనీరింగ్ విభాగం ప్రారంభమైన ప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు లేవన్నారు. అగ్రవర్ణాల వారికి వస్తున్నాయని, అర్హతలున్నా తమకు రావడం లేదని ఆరోపించారు. విశాఖపట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కొందరు ఎస్ఈలు, ఈఈలు, డీప్యూటీ ఈఈలు చక్రం తిప్పుతున్నారని, మంత్రిని సైతం పక్కదోవ పట్టించి కొందరు ఇన్ చార్జి ఈఈలుగా కొనసాగుతున్నారని అన్నారు. ఇన్ చార్జి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీల్లో అర్హతలున్న వారికి ప్రమోషన్లు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా లేరన్నారు. దీనివల్ల కుల వివక్ష కొనసాగుతోందని వాపోయారు. సీతంపేట, కేఆర్ పురం ఇంజనీరింగ్ విభాగాల్లోని ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నా వారి స్థానంలో ఇన్చార్జిలు మాత్రమే కొనసాగుతున్నారని చెప్పారు. దళిత గిరిజన ఉద్యోగులకు ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి సహాయ నిరాకరణ ఉందన్నారు. విజ్ఞానం ద్వారా సమాజంలోని రుగ్మతలను అంబేద్కర్ ఎలా ఎదుర్కొన్నారో అదే బాటలో తాము నడుస్తున్నామని హెచ్చరించారు. -
'మెరిట్ ఆధారంగా ప్రమోషన్లు వద్దు'
హైదరాబాద్ : మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలనుకోవడం సరికాదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. ప్రమోషన్లను సీనియారిటీ ఆధారంగా పాత పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేఖత ఉందని మురళీకృష్ణ పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రమోషన్ల వివాదం అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.