employees suicide
-
గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం నిర్దయగా, మొండి వైఖరితో వ్యవహరించడం వల్లే కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, గుండెపోటుతో మరణిస్తున్నారని చెప్పడానికి ఆధారాలు కావాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడున్న సంక్షోభం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేందుకు ఆధారాలు చూపాలని కోరింది. అయినా గుండెపోట్లు, ఆత్మహత్యలను హైకోర్టు ఎలా ఆపగలదని ప్రశ్నించింది. గుండెపోటుతో మరణించే వాళ్ల ప్రాణాల్ని ప్రభుత్వం మాత్రం ఎలా రక్షించగలదని పేర్కొంది. అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని ఆర్టీసీ యూనియన్ నిర్ణయించింది. ఈ సంక్షోభాలన్నింటికీ సమ్మే కారణమని నిందించదలిస్తే, అందుకు యూనియన్నే బాధ్యులని చేయాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. సమ్మెపై నిర్ణయించుకోవడానికి ముందే వీటన్నింటిపై అధ్యయనం చేసుండాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం వల్లే అవన్నీ జరుగుతున్నా యని అంటే ఎలా? అని ప్రశ్నించింది. కోర్టులు కూడా రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తాయని, తమ చేతిలో మంత్రదం డం ఏమీ ఉండదని చెప్పింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభి షేక్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ఒక్క కార్మికుడినైనా డిస్మిస్ చేసిందా? విశ్వేశ్వరరావు వాదిస్తూ.. ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించడం వల్లనే ఒత్తిడికి గురై పలువురు గుండెపోటు వచ్చి మరణించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వాళ్ల సంఖ్య 30 వరకూ ఉంది. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళితే పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇది అమానుషం. హైకోర్టు స్పందించి విధుల్లోకి చేరే వాళ్లని అడ్డుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు స్పందిస్తూ... పీఎఫ్ నిధుల్ని తీసుకోవడమో లేదా కాంట్రాక్టు కార్మికులు విధుల్లో చేరడం వల్లో ఆత్మహత్యలు చేసుకున్నారా లేక చేయడానికి పనిలేనందున ఆత్మహత్యలు చేసుకున్నారా.. వీటికి ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. సమ్మె మొదలు పెట్టిన వెంటనే ప్రభుత్వమే ‘సెల్ఫ్ డిస్మిసల్’అని చెప్పిందని విశ్వేశ్వరరావు సమాధానమిచ్చారు. అయితే కోర్టుకు ఆధారాలే ముఖ్యమని, సూర్యోదయం అవగానే కడుపు నొప్పి వస్తోందని చెప్పి సూర్యుడినో, సూర్యోదయాన్నో కారణమని నిర్ధారించలేం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్టీసీ ఉద్యోగి ఒక్కరినైనా ప్రభుత్వం డిస్మిస్ చేసిందా అని ప్రశ్నించింది. హైకోర్టుకు కార్మికుడి సూసైడ్ నోట్ ప్రభుత్వ వైఖరి కారణంగానే భవిష్యత్ భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకునేముందు రాసిన లేఖను (సూసైడ్ నోట్) పరిశీలించాలని దాని ప్రతిని విశ్వేశ్వరరావు నివేదించారు. సమ్మె, ఆ తర్వాత ఆత్మహ త్యలకు తావిచ్చిన కారణాలను తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఆత్మహత్యలను, గుండెపోటులను తామెలా ఆపగలమని, సమ్మె కారణంగానే జరిగాయని ఎలా చెప్పగలరని, ఇదే వాదన సబబు అనుకుంటే సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ను నిందించాలని వ్యాఖ్యానించింది. కస్టోడియల్ డెత్‌లపై స్పందించినట్లుగానే ప్రభుత్వ తీరు అనైతికంగా ఉందని, హైకోర్టు స్పందించకపోతే జనం ఎక్కడికి వెళ్లాలని విశ్వేశ్వరరావు అన్నారు. కస్టోడియల్ డెత్‌లపై గతంలో కోర్టు స్పందించిన తీరులోనే వీటిపైన కూడా హైకోర్టు స్పందించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కార్మికులేమీ నిస్సహాయులు కాదని, అలా అనుకుంటే భ్రమేనని, అది తప్పుడు అభిప్రాయమని, కార్మికులు సరైన వేదిక (సంబంధిత కోర్టుకు)కు వెళ్లాలని, అన్నింటికీ హైకోర్టును ఆశ్రయిస్తే తమ వద్దేమీ మంత్రదండం ఉండదని చెప్పింది. రోగం ఏదో గుర్తించి దానికి వైద్యం చేయించుకోవాలేగానీ గుండె సమస్యకు కిడ్నీ డాక్టర్ దగ్గరకు వెళితే లాభం ఏముంటుందని ప్రశ్నించింది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద సంబంధిత కోర్టుల్లో కార్మికుల సమస్యలపై తేల్చుకోవాలని హితవు చెప్పింది. జీతాల చెల్లింపు గురించి ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద కేసు వేశారని, మిగతా సమస్యలపై ఆయా కోర్టుల్లో న్యాయ పోరాటం చేసుకోవచ్చునని సూచించింది. రాజ్యాంగ ధర్మాసనాలకు అసాధారణ అధికారాలు ఉంటాయని, సమ్మె విరమించిన కార్మికులు విధు ల్లో చేరేందుకు అడ్డంకులు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, న్యాయస్థానాలూ రాజ్యాంగ నిర్ధేశాలకు లోబడే పనిచేయాలని, అసాధారణ అధికారాల పేరుతో కోరి నవన్నీ చేసేందుకు కోర్టుల్లో మంత్రదండం ఏమీ ఉండదని గుర్తుంచుకోవాలని తేల్చిచెప్పింది. కనీసం విధుల్లో చేరేందుకు డిపోలకు వెళ్లే కార్మికుల్ని అడ్డుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విశ్వేశ్వరరావు కోరారు. సవరణ పిటిషన్ దాఖలు చేయండి ఆర్థిక ఇబ్బందులతో కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, వారి క్షోభ ఊహకు అందనిదని, దయచేసి మానవీయతతో హైకోర్టు స్పందించాలని విశ్వేశ్వరరావు కోరారు. దీనిపై ధర్మాసనం కల్పించుకుని.. యూనియన్ తో ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మె విరమణకు చర్యలు తీసుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిల్లో కోరారని, సమ్మె విరమించినందున ఇప్పుడు విధుల్లో చేరేందుకు అనుమతించాలని కోరుతున్నారని, ఈమేరకు చట్ట నిబంధనల మేరకు పిల్లోని అభ్యర్థనను మార్పు చేసి సవరణ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. అందుకు అంగీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేయాలని విశ్వేశ్వరరావు కోరినప్పటికీ, దీనిపై ఏమీ స్పష్టం చేయని ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కార్మికులను డిస్మిస్ చేసినట్టు ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించలేదు కదా అని ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ తీరుతోనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పలు సూసైడ్ నోట్లను పిటిషన్ న్యాయస్థానం ముందు ఉంచారు. పిటిషనర్ వాదనపై స్పందించిన హైకోర్టు సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ నాయకులే దీనికి బాధ్యత వహించాలని తెలిపింది. యూనియన్లు సమ్మెకు పిలుపునిస్తే.. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వ ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేమని తెలిపింది. అయితే ఈ సందర్భంగా పిటిషనర్ మాట్లాడుతూ.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వెళ్లిన పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు జరిగే అవకాశం ఉందని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం.. కార్మికులను డిపోల్లోకి అనుమతి ఇవ్వకపోతే మరో అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని సూచించింది. దీనిపై రేపు అఫిడవిట్ ఫైల్ చేస్తామని పిటిషనర్ తెలిపారు. అనంతరం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
చిక్కుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: రాజకీయ వేధింపులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వెరసి కింది స్థాయి అధికారులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ముత్తుకుమార స్వామి మరణించారో లేదో, ఉన్నతాధికారుల వేధింపులతో ధర్మపురిలో మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా తిరుచ్చి వైద్యుడు స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో తిరునల్వేలి జిల్లాలో వ్యవసాయ శాఖ ఇంజనీరు ముత్తుకుమార స్వామి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ప్రధాన ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌ను అరెస్టు చేసి ఉన్నారు. విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీలో భారీ ఎత్తున అవినీతి తాండవం చేసినట్టు తేలి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 119 పోస్టుల భర్తీకి ఒక్కో పోస్టుకు 1.75 లక్షల చొప్పున ప్రధాన ఇంజనీర్ సెంథిల్ వసూళ్లు చేసి, మొత్తం రెండు కోట్లకు పైగా నగదును అగ్రికృష్ణమూర్తికి ఇచ్చి ఉన్నట్టు విచారనలో వెలుగు చూసి ఉన్నది. అలాగే, కన్యాకుమారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు విచారనలో తేలి ఉన్నది. ఆ ఎమ్మెల్యే ఏకంగా ముత్తుకుమార స్వామిని తన అనుచరుల్ని పంపి బెదిరించి కిడ్నాప్ యత్నం కూడా చేసినట్టు సమాచారం అందడటంతో ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అవుతోన్నది. అలాగే, మరో ముఖ్య నేతను సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు కసరత్తులు జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ధర్మపురిలో ఉన్నతాధికారుల వేదింపులో ఓ కింది స్థాయి ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం మరింత చర్చకు దారి తీసి ఉన్నది. ఆత్మహత్య : ధర్మపురి జిల్లా కంబై నల్లూరు పట్టణ పంచాయతీ కార్యాలయ అసిస్టెంట్‌గా ఆది(45) పనిచేస్తున్నాడు. గత నెల రోజులుగా ఆయన మరో ఊరికి డిప్యూటేషన్ మీద వెళ్లారు. రెండు రోజుల క్రితం మళ్లీ కంబై నల్లూరులో తన విధుల్ని నిర్వర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆది తన ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు పట్టణ పంచాయతీ కార్యాలయంలోని ఉన్నతాధికారుల వేదింపులే కారణం అని ఆది తమ్ముడు తంగ వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడ్ని మానసికంగా హింసించారని, డిప్యూటేషన్ల పేరిట ఇతర ఊర్లకు పంపించడంతో పాటుగా వచ్చి రాగే, తమకు కావాల్సిన వారికి అవసరమయ్యే పనులు త్వరితగతిన చేయాలంటూ ఉన్నతాధికారులు, స్థానికంగా ఉండే నాయకులు వేదిస్తూ వచ్చినట్టుగా తంగవేల్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఒత్తిళ్లతోనే ఆత్మహత్యాయత్నం: గత వారం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నెహ్రు రాజకీయ ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఆరు నెలల క్రితం తంజావూరు నుంచి తిరుచ్చి ఆసుపత్రికి బదిలీ అయినట్టు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో ఉన్న తనను ఇక్కడి ఆసుపత్రి వైద్యాధికారిగా పనిచేయాలని స్థానికంగా ఉన్న అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఆ బాధ్యతలు చేపట్టినా, చివరకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని వివరించారు. అధికార పక్షం నాయకుడు అంటు ఒకరు, మంత్రి అనుచరుడు అంటు మరొకరుడు ఇలా రోజుకు యాభై ఫోన్ కాల్స్ రూపంలో వేదింపులు వచ్చేవి అని పేర్కొన్నారు. తమ వాళ్లకు చికిత్సలు చేయాలని కొందరు, తమ వాళ్లకు ఆ పనిచేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని వేదించడం మొదలెట్టారన్నారు. ఆరోగ్య శాఖమంత్రి తనతో ఇంత వరకు ఒక్క సారిగా కూడా మాట్లాడ లేదని, ఆయన సహచరులం అని, పీఎ అని పేర్కొంటూ, పలుమార్లు చివాట్లు ఎదురు అయ్యేదన్నారు. ఈ రాజకీయ ఒత్తిళ్లు తాళ లేక సంఘటన జరిగిన రోజు ఆసుపత్రికి వచ్చి సహచర సిబ్బందికి తన ఆవేదనను వెల్లగక్కినట్టు పేర్కొన్నారు. ఆతర్వాత తీవ్ర మనో వే దనకు గురై 30 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానని, అయితే, తనను రక్షించి మళ్లీ రాజకీయ ఈ వేదింపులు ఎదుర్కొనేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో రాష్ర్టంలో పాలన కుంటు పడిందన్న ఆరోపణలు సాగుతున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్య బాట పట్టడం ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలవరం రేపుతున్నది.