employment recruitment
-
50 ప్లస్..: టెక్నాలజీ రంగంలో వయసు వివక్ష
పని ప్రదేశాల్లో స్త్రీ–పురుష వివక్ష తెలిసిందే. పెరిగే వయసు కూడా స్త్రీని వివక్షకు లోనయ్యేలా చేస్తుందా?! ‘అవును’ అంటున్నాయి ఇటీవలి నివేదికలు. వయసు అనేది ఒక అంకె మాత్రమే అయినా అంకెల్లో జీతం అందుకోవాలంటే మాత్రం నిత్యం సవాళ్లను అధిగమించాల్సిందే! తనను తాను నిరూపించుకోవాల్సిందే!! ఉద్యోగ నియమాకాల్లోనే కాదు పనిచేసే చోట స్త్రీలు వయస్సు సంబంధిత వివక్ష ఎదుర్కొంటున్నారని ఆర్ప్(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్) సంస్థ సర్వే స్పష్టం చేసింది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు మహిళలు తమ వయస్సు కారణంగా చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారని లేదంటే తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఈ సంస్థ వెల్లడించింది. అమెరికాలో ఈ వివక్ష 30 శాతం ఉంటే ఆసియా– ఆఫ్రికా మహిళల్లో 60 శాతంగా ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆర్ప్ సంస్థ అమెరికా, ఆసియా, ఆఫ్రికన్ మహిళలతో నిర్వహించిన పోల్‌లో 50 ఏళ్ళ పైబడిన ఉద్యోగులైన 6,643 మంది ఫొటోలను తీసుకుంది. ఆ ఫొటోల్లో వారు నిరాశ, దిగులు, విలువైన జీవితాన్ని కోల్పోయినవారిగా కనిపించారు. యాౖ¿ñ ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న ఉద్యోగునులైన మహిళలల్లో వృద్ధాప్యం అనే మాట విరివిగా వినిపించింది. జాతి/రంగు/బరువు/లింగ, సామాజిక తరగతి ఆధారంగా ఈ వివక్ష స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆరోగ్యంపై ప్రభావం యాభై ఏళ్లు దాటిన మగ ఉద్యోగులతో పోల్చితే వయసు వివక్ష కారణంగా మహిళలు ఎక్కువ శాతం ఆందోళన, డిప్రెషన్, మానసిక క్షోభ, ఊబకాయం, అధిక రక్తపోటు.. వంటి వాటికి సంబంధించిన లింక్‌లను ఓపెన్ చేసి, పరిశోధించినట్లుగా గుర్తించారు. ఈ కారణంగా ఈ వయసు వారిలో అధికబరువు పెరుగుతుందని, ఇది కూడా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రహించారు. మిగతా వాటికన్నా టెక్నాలజీ రంగంలోనే ఈ ప్రభావం ఎక్కువ ఉందని గుర్తించారు. సామర్థ్యంపై తక్కువ అంచనా! ప్రఖ్యాత బహుళజాతి కంపెనీలో పనిచేసి, ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్న 56 ఏళ్ల ఆమె (పేరు రాయడానికి ఇష్టపడలేదు) మాట్లాడుతూ ‘వయసు కారణంగానే జాబ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింద’ని తెలియజేశారు. ఉద్యోగినిగా కంపెనీ కి అందించిన తన సమర్థతనూ వెలిబుచ్చారు. ‘టెక్నాలజీ రంగంలో చాలా వరకు మగవారికి, యువతకే ప్రాధాన్యం ఉంటుంది. వయసు గురించి చర్చించాల్సిన అవసరం లేనప్పటికీ కంపెనీ యాజమాన్యం, వస్తున్న నవతరం కూడా 50 ప్లస్ వారికి టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో సరిగా తెలియదని అనుకుంటున్నారు. ఉద్యోగనియామకాల్లోనూ ఎక్కువ వయసు ఉన్నవారిని కోరుకోవడం లేదన్నది వాస్తవం’ అంటారు ఆమె. సమాజ ప్రభావం ‘ఇన్నాళ్లూ ఉద్యోగం చేశారు. సొంత ఇల్లు ఉంది, పిల్లలు స్థిరపడ్డారు. విశ్రాంతి తీసుకోవచ్చు కదా’ అని 50 ప్లస్ వారి పట్ల ఒక జాలితో కూడిన కన్సర్ చూపిస్తుంది సమాజం. అందువల్ల కూడా మహిళలు త్వరగా ఉద్యోగం నుంచి తప్పుకుంటారు’ అంటారు కార్పొరేట్ కంపెనీలకు అర్హత గల ఉద్యోగులను నియమించే ప్రతిభ. ఈ వయసు మహిళలు ఒక సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకుని, ఇంటికి పరిమితం అవుతున్నారంటారు. కాస్మొటిక్ సర్జరీలు.. మహిళలు అనుభవించే ఒత్తిడిలో ఎక్కువ భాగం యవ్వనంగా కనిపించాల్సిన అవసరానికి సంబంధించే ఉంటుందని యాంటీ ఏజింగ్ పరిశోధకుడు, బ్రేకింగ్ ది ఏజ్ కోడ్ రచయిత టెక్కా లెవీ అంటారు. కాస్మెటిక్ ప్రక్రియలు, సోషల్ మీడియా నుంచి కూడా ఈ వయసు వాళ్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పోల్‌లో పాల్గొన్నవారిలో సగానికి పైగా మేకప్‌కి సంబంధించిన ఒత్తిడిని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి 35 శాతం మంది ఆసక్తి చూపారు. ఏ రంగంలోనైనా తమకు తాముగా నిలబడటానికి ప్రతి దశలోనూ ప్రయత్నం చేస్తున్న మహిళలు ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ తమని తాము నిరూపించుకుంటున్నారు. అయినప్పటికీ ఎన్నో బాధ్యత లు, అవకాశాలు, సౌకర్యాల దృష్ట్యా మగవారితో పోల్చితే ప్రపంచ మహిళ వయసు రీత్యా వివక్ష ఎదుర్కొంటున్నదన్నది వాస్తవం. కారణాలతో ఆగిపోకూడదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను సమర్థవంతంగా నడుపుతున్న వారిలోనూ యాభై ఏళ్ల పైబడిన మహిళలున్నారు. సవాల్‌గా తీసుకుంటే వయసు అనేది పెద్ద విషయం కాదు. కంపెనీలు కూడా సమర్థంగా పనిచేసేవారిపైనే దృష్టిపెడతాయి. ఎప్పుడూ నైపుణ్యాలు పెంచుకోవడం, తమని తాము అప్‌గ్రేడ్ చేసుకోవడంపై దృష్టి పెడితే ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. పిల్లల విషయంగానో, ఆరోగ్యం బాగోలేదనో, సౌకర్యంగా ఉండచ్చు కదా అనో.. చాలా మంది యాభైలలో ఉన్నవారు జాబ్ మానేస్తారు. లేదంటే సెలవులు ఎక్కువ పెట్టేస్తుంటారు. దానికి ‘వయసు’ కారణం చూపడం మాత్రం సరికాదు. – ప్రతిభ పులిజాల, మీ స్కూల్ (మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్) ఛాలెంజ్ తప్పదు యాభై ఏళ్ల తర్వాత టెక్నాలజీ రంగంలో మహిళలకు పురుషులతో పోల్చితే ఉద్యోగావకాశాలు తక్కువే. ఈ వివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉంది. యాభై ఏళ్ల తర్వాత మంచి హోదాలో ఉన్నవారు ఇప్పటికీ పది శాతం మహిళలే ఉన్నారు. వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. యాభై ఏళ్ల వయసులోనూ మంచి ప్రాజెక్టులు రాబట్టడానికి నేను ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అందుకే, ఇంకా కంపెనీని నిర్వహించగలుగుతున్నాను. వివక్ష ఉందని వెనకడుగు వేయకుండా తమని తాము నిరూపించుకుంటూ, సొంతంగా ప్రణాళిక లు వేసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడం, బాధ్యతలు తీరి తమకి తాముగా కొత్త మార్గాన్ని వేసుకోవడానికి మాత్రం ఇది అత్యుత్తమమైన వయసు. – ప్రీతి మాలిక్, కార్పొరేట్ మేనేజ్మెంట్ – నిర్మలారెడ్డి -
ఉమ్మడి రాష్ట్రంలో ఖాళీ పోస్టులు 2,54,000
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన పూర్తయిన నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు సర్కారీ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు. యువతకు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆ నేతలే ముఖ్యమంత్రులుగా తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు రెట్టింపయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టాలన్న డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కసరత్తులో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ లెక్క తేల్చింది. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో 12,46,600 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా.. గత మార్చి నాటి కల్లా 9.92 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నట్లు తేలింది. అంటే మిగతా 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్క. ఇందులో రాష్ట్ర స్థాయి కేడర్లోనే 18 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ నిర్ధారించింది. ఉద్యోగుల పంపిణీ కోసం కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ ఈ వివరాల ఆధారంగా ప్రస్తుతమున్న ఉద్యోగులతో పాటు ఖాళీ పోస్టులను కూడా జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకూ పంపిణీ చేస్తుంది. ఇలా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో 60,661 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే జీవోలు జారీ చేసింది. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇందులో రాష్ట్ర స్థాయి, జిల్లా, జోనల్ స్థాయి పోస్టులున్నాయి. దీంతో ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఏర్పడినందున ముందుగా ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చాలాకాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనందున నిరుద్యోగుల వయో పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు. ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోస్టుల భర్తీని మాత్రమే చేపడుతుంది. తెలంగాణకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ బాధ్యతలు తీసుకుంటుంది. ఈ మేరకు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదు. -
ఉద్యోగాలకు ‘ఉరి’ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయిలో ఫుల్స్టాప్ పడింది. 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించినా ఫలితం లేకుండా పోయింది. నోటిఫికేషన్ల జారీకి సాంకేతికంగా అడ్డంకులు లేకపోయినా.. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న గందరగోళంతో ప్రభుత్వం ఈ విషయం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్లను జారీ చేయాలా? వద్దా? అని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసి రెండు నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ సీఆర్ బిశ్వాల్ రెండురోజుల కిందట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. అయినా నోటిఫికేషన్ల జారీ అంశంపై స్పష్టత రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్ కోటా భర్తీ విషయంలో అపోహలు వస్తాయనే ఉద్దేశంతోనే నోటిఫికేషన్ల జారీని పక ్కనబెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నా.. దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో ఏళ్ల తరబడి శిక్షణ పొందుతూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఎదురుచూపులు చూస్తున్నారు. వేల రూపాయలు వెచ్చించి సిద్ధమైనా పరీక్షల నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్, ఎస్సై వంటి పోస్టులు, ఏపీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2 తదితర పోస్టులకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు ఏం చేయాలో పాలుపోని అయోమయంలో ఉన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ శిక్షణ పొందుతున్న అనేకమంది అభ్యర్థులు ఆర్థికభారం దృష్ట్యా ఇంటిదారి పడుతున్నారు. మూలనపడిన ఏపీపీఎస్సీ షెడ్యూల్ గత నాలుగు నెలల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 63,518 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన దాదాపు 13 వేల పోస్టులకు నోటిఫికేషన్ల జారీకి సిద్ధమైంది. నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి వంటి తేదీల వివరాలతో షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంతలోనే ‘రాష్ట్ర విభజన’ అంశం తెరపైకి వచ్చింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో షెడ్యూలు కాస్తా కాగితాలకే పరిమితమైపోయింది. పోలీసు శాఖలో, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీల ద్వారా కూడా పోస్టుల భర్తీ నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి స్పష్టత వస్తే పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ సిద్ధంగా ఉంది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన అన్ని పోస్టులకు రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వారీ వివరాలు సేకరిస్తోంది. ప్రభుత్వం ఓకే అంటే నోటిఫికేషన్లను జారీ చేస్తామని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అయితే మరో నాలుగైదు నెలల్లో రాష్ట్ర విడిపోయే అవకాశాలున్న దృష్ట్యా ఇంత భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ సరికాదని, విభజన తరువాత ఆయా రాష్ట్రాల్లో నియామకాలకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఆమోదం పొందిన పోస్టుల వివరాలు.. ప్రభుత్వ ప్రధాన కార్యదరిశ గత ఏప్రిల్ 28న వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల్లోనూ కలిపి 63,621 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అందులో తేల్చారు. వాటిల్లో ఇప్పటివరకు 63,518 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3వ తేదీన 33,738 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. అందులో ఏపీపీఎస్సీ ద్వారా 11,250 పోస్టులు (గ్రూపు-1, గ్రూపు-2, గ్రూపు-4, లెక్చరర్ తదితర అన్ని కేటగిరీలు), పోలీసు శాఖలో 11,623 పోస్టులు (కానిస్టేబుల్, ఎస్సై), డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల (డీఎస్సీలు) ద్వారా 10,865 పోస్టులను భర్తీ చేసుకోవచ్చని పేర్కొంది. ఇక జూలై 2వ తేదీన 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, ఏపీపీఎస్సీ ద్వారా మరో 1,127 పోస్టుల భర్తీకి, డిపార్ట్మెంటల్ సెలెక్షన్ కమిటీల ద్వారా 2,443 పోస్టుల భర్తీకి ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందే 2,677 గ్రామ కార్యదర్శి పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. తాజాగా సెప్టెంబర్ 30వ తేదీన కూడా మరో 3,025 పోస్టుల భర్తీకి ఓకే చెప్పింది. ఆ తరువాత మూడు రోజులకే తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో నోటిఫికేషన్ల జారీపై పూర్తిస్థాయిలో నీలినీడలు కమ్ముకున్నాయి.