Employment wages
-
ఉపాధి హామీ కూలీలతో నగ్నంగా నిలబడి అసభ్యకర ప్రవర్తన
తమిళనాడు: మద్యం మత్తులో ఉపాఽధి హామీ కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు స్థానికంగా ఉపాధీ హమీ పనులు చేస్తున్నారు. మంగళవారం మద్యం మత్తులో వారి వద్దకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన ప్రభాకరన్ నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మహిళలు బుధవారం ఉదయం పుల్లరంబాక్కం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో తిరువళ్లూరు–ఊత్తుకోట మార్గంలో రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముళ్ల పొదల్లో దాక్కుకున్న ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
కూలి డబ్బులు 'సస్పెండ్'
గిద్దలూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆశయం నీరుగారుతోంది. పథకం ప్రారంభంలో ఎందరో పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. గ్రామంలోనే పనులు కల్పించడం వలన ఉపాధి పనులు చేసుకుంటూ వారికి ఉన్న అరకొర భూములను సాగుచేసుకుంటూ ఆర్థికంగా కొంతమేర ఉపశమనం పొందారు. ప్రస్తుతం ఉపాధిహామీ పథకం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. పథకం లక్ష్యం మంచిదే అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యానికి ఉపాధి కూలీలుపనుల విషయంలో ఆసక్తి చూపడం లేదు. ఇవ్వాల్సిన కూలి డబ్బులను సకాలంలో అందజేయకపోవడమే ఇందుకు కారణమని కూలీలు ఆరోపిస్తున్నారు. మూడేళ్లుగా సస్పెన్షన్ ఖాతాల్లో ఉన్న సొమ్ము కూలీలకు అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. కూలీల వేతనం బ్యాంకు ఖాతాలో జమకావాలంటే కూలీల జాబ్‌కార్డు నంబరు, ఆధార్‌కార్డు నంబరు, బ్యాంకు ఖాతాకు అనుసంధానం కావాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కాకపోతే కూలీకి రావాల్సిన కూలి సొమ్మును సస్పెన్షన్ ఖాతాలో జమచేస్తారు. సస్పెన్షన్ ఖాతాల్లో ఉన్న నగదును సదరు కూలీకి చెల్లించడంలో ఉపాధి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మూడేళ్లుగా కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా సస్పెన్షన్ ఖాతాల్లో జమలు పేరుకుపోయాయి. సస్పెన్షన్ ఖాతాల్లో రూ.2.51 కోట్లు: గత మూడేళ్లుగా సస్పెన్షన్ ఖాతాల్లో రూ.2.51 కోట్ల ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో చేసిన పనికి సంబంధించిన కూలి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 56 మండలాల్లో 40,300 మంది కూలీల ఖాతాలు సస్పెన్షన్‌లో ఉన్నాయి. ఇందుకు గాను రూ.2.51 కోట్ల నిధులు కూలీలకు అందకుండా ఉపాధి ఖాతాల్లోనే ఉండిపోయాయి. కష్టపడినందుకు గాను వచ్చే కూలి బ్యాంకులో పడకపోవడంతో కూలి డబ్బుల కోసం కూలీలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చూద్దాం.. చేద్దాం అంటూ కూలీలకు చెబుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప వారికి కూలి డబ్బులు వచ్చేలా చేయడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కూలీలకు శాపం... అధికారుల నిర్లక్ష్యం ఉపాధి కూలీలకు శాపంగా మారింది. ఉపాధి కూలీలకు జాబ్‌కార్డు ఇచ్చిన తర్వాత వారి ఖాతాలకు ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. జాబ్‌కార్డు నంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా నంబరుకు ఆధార్‌కార్డును అనుసంధానం ఖచ్చితంగా ఉంటేనే వారికి కూలి డబ్బులు ఖాతాలో జమవుతాయి. దగ్గరుండి కంప్యూటర్ ఆపరేటర్లతో ఈ ఖాతాలను అనుసంధానం చేయించే బాధ్యత అధికారులే తీసుకోవాలి. అయినప్పటికీ వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చిందని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ ఖాతాలను అనుసంధానం చేస్తేనే కూలీలు చేసిన పనులకు వేతనాలు జమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకు అధికారులు, ఉపాధి అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఉపాధి కూలీలకు చెందిన కూలి డబ్బులు ఉన్న సస్పెన్షన్ ఖాతాల సమస్యను పరిష్కరించాలని కూలీలు కోరుతున్నారు. ♦ ఈమె పేరు మట్టెమల్ల లుథియమ్మ, రాచర్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామం. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి ఈమెకు రావాల్సిన మొత్తం రూ.8,900. గత సంవత్సర కాలంగా తనకు రావాల్సిన కూలి సొమ్ము గురించి ఉపాధి సిబ్బందిని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. ‘ఇల్లు గడవడం కోసం పనికి వెళితే చేసిన పనికి వేతనాలు చెల్లించకపోతే ఎలా. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింకు కాలేదని అందుకే డబ్బులు రాలేదని అధికారులు చెబుతున్నారని’ లుథియారాణి ఆవేదన చెందుతోంది. ♦ ఈ యువకుని పేరు ఎం.రోశయ్య, రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామం. గత ఏడాది చేసిన పనికి సంబంధించిన రూ.6 వేలు వరకు కూలి సొమ్ము రావాలి. 9 వారాల పాటు పనిచేస్తే ఒక్క రూపాయి బిల్లు ఇవ్వలేదు. ‘వేసవిలో పనులు చేసి సంపాదించుకున్న డబ్బుతో చదువుకునేందుకు ఉపయోగించుకోవచ్చని ప్రతి రోజూ పనికి వెళ్తున్నాను. అయినప్పటికీ కూలి సొమ్ము ఇవ్వడం లేదు. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ జతకాకుంటే చేయాల్సిన బాధ్యత ఉపాధి అధికారులదే కానీ ఇన్ని రోజులుగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని’ రోశయ్య ప్రశ్నిస్తున్నాడు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలి సస్పెండ్ ఖాతాల్లో కూలి సొమ్ము జమ అయిన వారు వారికి చెందిన జాబ్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు ఇస్తే వారు అనుసంధానం చేస్తారు. అనంతరం పేమెంట్లు జనరేట్ చేయడం ద్వారా ఆయా ఖాతాలకు నగదు జమవుతుంది. పాత బకాయిలు రావాల్సిన వారు సంబంధిత పోస్టల్ సిబ్బందిని కలిస్తే వారు నగదు ఇస్తారు. సస్పెండ్ ఖాతాల్లో ఉన్న నగదును కూలీలకు ఇచ్చేందుకు ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్సులను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా సేకరించి ఎవరి కూలి సొమ్ము వారికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. – పద్మావతి, డ్వామా ఏపీడీ. -
కష్టం చేసినా...కడుపు నిండదు
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీని పేదల కడుపు నింపేందుకు పెట్టింది. పని లేని పేదకు పని కల్పించడం.. కనీస వేతనం ఇవ్వడం.. వాళ్ల ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఉపాధిని హామీగా పేర్కొంటూ దానికి చట్టబద్ధత కల్పించింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పని చేసినా వారికి కష్టార్జితం లభించడం లేదు. దీంతో ఆకలి బా«ధలు తీరక వలస పోతున్నారు. కేంద్రం అందించిన నిధులను ఇతర పనులకు మళ్లించడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీన్ని కప్పేట్టేందుకు నానా ఆగచాట్లు పడుతుంది. దీనిపై సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు: జిల్లాలో ప్రస్తుతం ఉపాధి పనులకు వెళ్లేందుకు పేదలు ఆసక్తి చూపడం లేదు.నాలుగు నెలలుగా కూలి చేసిన పనులకు సబంధించిన బకాయిలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5.50లక్షల మంది కూలీలు ఉన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో గత వేసవి నుంచి ఉపాధి పనులు జోరుగా సాగాయి. ఏప్రిల్ వరకు వేతనాలు అందినా మే నుంచి రావడం లేదు. గత జూన్ నాటికి బకాయిలు రూ.27 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి రూ.44 కోట్లకు చేరాయి. ఉపాధి నిధులను ఇతర పనులకు వినియోగించడంతోనే కేంద్రం నిధులు నిలిపేసిందని అధికారులు చెబుతున్నారు. నీరు–చెట్టుకు మళ్లింపు ఉపాధి కూలీల వేతనానికి వినియోగించాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల లబ్ధికి చేపట్టిన నీరు–చెట్టుకు మళ్లించినట్లు సిబ్బంది చెబుతున్నారు. సాధారణంగా కూలీల వేతనానికి 60 శాతం, మెటీరియల్‌కు 40 శాతం నిధులను ఉపయోగించాలి. జిల్లాలో ప్రస్తుతం కూలీల వేతనానికి 40 శాతం, 60 శాతాన్ని మెటీరియల్‌కు వినియోగించారు. ప్రస్తుతం జిల్లాలో 3173 పనులు పూర్తికాగా ఇందుకుగాను రూ.280.90 కోట్లను ఖర్చుచేశారు. ఇందులో ఉపాధి కూలీల వేతనానికి వినియోగించాల్సిన నిధులు వాడటంతో కేంద్రం నిధులను నిలిపేసి ఇప్పటి వరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను తెలపాలని ఆదేశించింది.దీంతో పాటు పలు జిల్లాలో తనిఖీలు మొదలు పెట్టింది. ఇదంతా పూర్తయ్యేప్పటికి మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూలీల వేతనం అందడం కష్టమే. నెలన్నర కిందట రూ.500 కోట్లు వస్తున్నాయని అధికారులు ప్రకటించినా చివరకు విడుదల చేసింది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. ఇది ఏ మూలకు సరిపోలేదు. జిల్లాలకు కనీసం రూ.10 కోట్లు కూడా రాలేదని సిబ్బంది తెలిపారు. ఇబ్బందులు పడుతున్న సిబ్బంది కూలీల వేతనాలు అందకపోవడాన్ని ప్రభుత్వం రికార్డుల నమోదు, వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు అంటూ కుంటిసాకులు చెబుతోంది. ఇప్పటి వరకు 20 అంశాలతో పని వివరాలను నమోదు చేసి తయారు చేయాలని అధికారులు కోరారు. కానీ దీనిపై నెల రోజుల నుంచి నాన్చుతూ త్వరగా అన్ని రికార్డులు తయారు చేసి కార్యాలయంలో అందించాలని ఆదేశించారు. నెల కిందట కేంద్ర అధికారులు వస్తారని దసరా సెలవుల్లో కూడా విధులు నిర్వహించారు. తాజా ఆదేశాలతో ఆదివారంతో పాటు రాత్రుళ్లు కూడా కార్యాలయాల్లోనే ఉండి రికార్డులు తయారు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి పెరుగుతుండటంతో వారు మానసిక వేదన చెందుతున్నారు. ఈ వివరాలన్ని అన్లైన్లో ఉన్నా మళ్లీ రికార్డుల తయారీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
ఎందుకొచ్చారు?
ఎవరు రమ్మన్నారు..! ఎవరికోసం వచ్చారు..!! ఎందుకొచ్చారు..! మాకోసం వచ్చారా..! ఉంటే ఉండండి.. లేకుంటే పొండి..! ఇది పింఛన్‌దారులు, ఉపాధి కూలీల పట్ల బ్యాంకు అధికారుల తీరు..! ప్రభుత్వం అందజేస్తున్న ‘ఆసరా’పింఛన్ కోసం వస్తే చీదరించుకుంటున్నారు.. నెలంతా కష్టపడి పని చేసి ‘ఉపాధి’డబ్బుల కోసం వస్తే కసరించుకుంటున్నారు.. ♦ పింఛన్ అడిగితే చీదరింపు..! ♦ కూలి అడిగితే కసరింపు!! ♦ ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని వినాయకపురం ఏపీజీవీబీ ఖాతాదారులయిన ఉపాధి కూలీలు, పింఛన్ దారులు బుధవారం అశ్వారావుపేట బ్రాంచికి వచ్చి భంగపాటుకు గురయ్యామని వాపోతున్నారు. పింఛన్ కోసం వచ్చామంటే ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని..? పోండి.. మా దగ్గర డబ్బుల్లేవంటున్నారని.. ఉపాధి కూలీ డబ్బులడిగితే.. మీరీ బ్యాంకుకు ఎందుకొచ్చారని కసరుకుంటున్నారని అమాయక గిరిజనులు వాపోతున్నారు. వినాయకపురం బ్రాంచిలో ఒక బ్యాంకుమిత్రపై పింఛన్లు కాజేసిన ఆరోపణపై పోలీసు కేసు నడుస్తోంది. మరో ఇద్దరిపైనా ఆరోపణలున్నాయి. పలు కారణాలతో పింఛన్లు, కూలీ డబ్బుల పంపిణీ ఆలస్యం అవుతోంది. దీంతో వినాయకపురం బ్యాంకుకు వెళ్లిన వారికి అక్కడ సిబ్బంది డబ్బుల్లేవని.. అశ్వారావుపేట బ్యాంకుకు వెళ్లాలని సూచిస్తున్నారు. బ్యాంకు మిత్రల వద్ద డబ్బుల్లేక, వినాయకపురం బ్యాంకులో డబ్బులు లేకపోవడంతో పింఛన్ దారులు, ఉపాధి హామీ కూలీలు అశ్వారావుపేట బ్యాంకుకు వచ్చారు.ఇదీ కాక అశ్వారావుపేట బ్రాంచి పరిధిలోని బ్యాంకు మిత్రలకు కూడా సరిపడా డబ్బులివ్వక పోవడంతో బ్యాంకు మిత్రలకు బదులుగా ఖాతాదారులు బ్యాంకునే ఆశ్రయించి నగదు పొందుతున్నారు. ఈ క్రమంలో బుధవారం మండల పరిధిలోని మారుమూల గ్రామాలయిన మొద్దులమడ, కుడుములపాడు, కావడిగుండ్ల, గాండ్లగూడెం తండాతోపాటు పలు గ్రామాల నుంచి గిరిజనులు వచ్చారు. కూలి, పింఛన్ డబ్బులు తీసుకుని బుధవారం సంత చేసుకుని ఇంటికి వెళదామని ఆశతో వచ్చిన గిరిజనులకు నిరాశ, ఛీదరింపులే దక్కాయని వాపోతున్నారు. గిరిజన నియోజకవర్గంలో గిరిజనులకు కనీసం కూలి డబ్బులు, పింఛన్ డబ్బులు కూడా ఇవ్వకుండా గంటల తరబడి నిలబెట్టారని వాపోతున్నారు. కాగా మొక్కుబడిగా కొందిరికిచ్చి కొందరికి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి పింఛన్, కూలి డబ్బులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. వచ్చే వాడినే కాదు.. పింఛన్ డబ్బుల కోసం బ్యాంకు మిత్ర వద్దకు వెళితే డబ్బులు లేవన్నాడు. అశ్వారావుపేట బ్యాంకు దగ్గరకు వస్తే డబ్బులిప్పిస్తానన్నాడు. తీరా ఇక్కడకు వచ్చాక నిన్నవ్వరు రమ్మన్నారు..? – విప్పచెట్టు కేతిరెడ్డి, గాండ్లగూడెం తండా అన్ని ఊర్లూ ఇక్కడే.. వినాయకపురం బ్యాంకుకు వెళ్లిన వారిని అశ్వారావుపేట బ్యాంకు వద్దకు వారు పంపుతున్నారు. మండలంలోని అన్ని ఊర్ల నుంచి పింఛన్‌దారులు, ఉపా«ధి కూలీలం వచ్చాం. కానీ ఇక్కడ ఎవరు రమ్మన్నారని ప్రశ్నిస్తున్నారు. – తుర్సం రాజు, మొద్దులమడ రావొద్దంటే రాముగా.. కరువు పనికి రాకపోతే మీకు అవి ఆపేస్తాం, ఇవి ఆపేస్తామంటూ ఎంపీడీఓ ఆఫీసోల్లు బెదిరిస్తారు. తీరా పనిచేశాక బ్యాంకుకొచ్చి డబ్బులడిగితే ఎందుకొచ్చారు.. ఎవరు రమ్మంటే వచ్చారంటూ ఛీత్కరించుకుంటున్నారు. – మడకం కుమారి, ఊట్లపల్లి బ్రాంచి మేనేజర్ వివరణ ఈ విషయాలను బ్రాంచి మేనేజర్ సుజిత దృష్టికి తీసుకెళ్లగా అశ్వారావుపేట బ్రాంచి ఖాతాదారులకు చెల్లింపులు చేయడానికే మాదగ్గర సరిగా డబ్బులుండడంలేదు. వినాయకపురం బ్రాంచి ఖాతాదారులను మా దగ్గరకు ఎవరు రమ్మన్నారని ప్రశ్నించారు. వీలయితే సాధ్యమైనంత వరకు వారికి డబ్బులిచ్చేందుకు ప్రయత్నిస్తాం. మా బ్రాంచి ఖాతాదారులకు డబ్బులివ్వకుంటే చెప్పమనండి అని అన్నారు. -
పెరిగిన కూలిని పొందాలి
► కలెక్టర్ వాకాటి కరుణ ► ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల పనుల పరిశీలన ములుగు : పెరిగిన ఉపాధి కూలిని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ప్రస్తుతం రోజూ రూ.194 చొప్పున అందిస్తున్నారని, నిబంధనల ప్రకారం పనిచే స్తే ఈ మొత్తం వస్తుందని తెలిపారు. మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లి, అబ్బాపురం గ్రామ పంచాయతీ పరిధి బాణాలపల్లిలో సాగుతున్న ఉపాధిహామీ, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల పనులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఇంకుడుగుంతలు, ఫాం పాండ్స్తోనే సాధ్యమని అన్నారు. కూలీల పని ని ఎప్పటికప్పుడు నమోదు చేసి వేతనాలు స కాలంలో అందేలా చూడాలన్నారు. రెండు నెల లుగా వేతనాలు రావడంలేదని కూలీలు కలెక్టర్‌కు చెప్పారు. త్వరలో అందేలా చూస్తానని స మాధానం చెప్పారు. అనంతరం కూలీల మస్టర్‌ను పరిశీలించారు. రోజూ ఎన్ని గంటలు పని చేస్తున్నారు.. అధికారులు సహకరిస్తున్నారా.. లేదా అని ఆరాతీశారు. మట్టిపనే.. మంచిపని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపా ధి పనులు చేసుకుంటున్నామని అబ్బాపురానికి చెందిన మధు కలెక్టర్‌కు తెలియజేశాడు. కలెక్టర్ స్పందిస్తూ మట్టి పనే అన్నింటికంటే మంచిపని అని అన్నారు. ఏదో ఒక పని చేసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు. అనంతరం బాణాలపల్లిలో ఉపాధి పథకంలో పెంచుతున్న టేకు చెట్లను పరిశీలించారు. కింది భాగంలో కొ మ్మలు పెరిగితే చెట్టు ఎదగదని ఫీల్డ్ అసిస్టెం ట్లు రైతులను ఈ విషయాలపై వివరించాల ని సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ చీమల పా టి మహేందర్‌జీ, ఏపీడీ వెంకటనారాయణ , త హసీల్దార్ సత్యనారాయణ,ఏపీఓ సునిత, గౌస్‌పల్లి సర్పంచ్ సరళ,వీఆర్వో నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు,టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలి ఎస్ఎస్ తాడ్వాయి : ఉపాధి హామీ పథకం కిం ద ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. తాడ్వారుు ఎంపీడీఓ కార్యాలయంలో తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట మండలాల్లో ఉపాధి పనులపై శనివారం సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడుగుంతలు, ఫాం పాండ్ల నిర్మాణ పనుల్లో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం మండలాలు జిల్లాలోనే వెనుకబడి ఉన్నాయన్నారు. తాడ్వా రుు మండలంలో ఇంకా వంద ఫాంపాండ్లు, 300 ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచిం చారు. ఒక్కో గ్రామానికి 35 చొప్పున ఫాంపాం డ్లు నిర్మించాలని చెప్పారు. ఈ పనులు వారం రోజుల్లో పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చిన్నబోరుునపల్లిలో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో తవ్వించిన ఇంకుడుగుంతలను అటవీశాఖ అధికారులు దున్నేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో కలెక్టర్ సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఉపాధిహా మీ పథకం కింద తాడ్వారుు మండలంలో నా టిన టేకు మొక్కల వివరాలను ఏపీఓ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. ఫాంపాండ్, ఇంకుడుగుంతల నిర్మాణ పనుల్లో పూర్తిగా వెనుకబడిన మంగపేట మండలాన్ని సందర్శించాలని ఏపీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ శంకర్‌రెడ్డి, ఏపీడీ వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు పులుసం సరోజన, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, తహసీల్దార్ పొదెం లక్ష్మయ్య, ఎంపీడీఓలు వసుమతి, సురేష్, ప్రవీన్‌కుమార్, తాడ్వాయి ఏపీఓలు కుమారస్వామి, చంద్రకాంత్, రాజు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.