
పెరిగిన కూలిని పొందాలి
► కలెక్టర్ వాకాటి కరుణ
► ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల పనుల పరిశీలన
ములుగు : పెరిగిన ఉపాధి కూలిని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. ప్రస్తుతం రోజూ రూ.194 చొప్పున అందిస్తున్నారని, నిబంధనల ప్రకారం పనిచే స్తే ఈ మొత్తం వస్తుందని తెలిపారు. మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లి, అబ్బాపురం గ్రామ పంచాయతీ పరిధి బాణాలపల్లిలో సాగుతున్న ఉపాధిహామీ, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల పనులను శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచుకునేందుకు ఇంకుడుగుంతలు, ఫాం పాండ్స్‌తోనే సాధ్యమని అన్నారు. కూలీల పని ని ఎప్పటికప్పుడు నమోదు చేసి వేతనాలు స కాలంలో అందేలా చూడాలన్నారు. రెండు నెల లుగా వేతనాలు రావడంలేదని కూలీలు కలెక్టర్‌కు చెప్పారు. త్వరలో అందేలా చూస్తానని స మాధానం చెప్పారు. అనంతరం కూలీల మస్టర్‌ను పరిశీలించారు. రోజూ ఎన్ని గంటలు పని చేస్తున్నారు.. అధికారులు సహకరిస్తున్నారా.. లేదా అని ఆరాతీశారు.
మట్టిపనే.. మంచిపని
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఉపా ధి పనులు చేసుకుంటున్నామని అబ్బాపురానికి చెందిన మధు కలెక్టర్‌కు తెలియజేశాడు. కలెక్టర్ స్పందిస్తూ మట్టి పనే అన్నింటికంటే మంచిపని అని అన్నారు. ఏదో ఒక పని చేసుకుంటే ఇబ్బందులు ఉండవన్నారు. అనంతరం బాణాలపల్లిలో ఉపాధి పథకంలో పెంచుతున్న టేకు చెట్లను పరిశీలించారు. కింది భాగంలో కొ మ్మలు పెరిగితే చెట్టు ఎదగదని ఫీల్డ్ అసిస్టెం ట్‌లు రైతులను ఈ విషయాలపై వివరించాల ని సూచించారు. ఆమె వెంట ఆర్డీఓ చీమల పా టి మహేందర్‌జీ, ఏపీడీ వెంకటనారాయణ , త హసీల్దార్ సత్యనారాయణ,ఏపీఓ సునిత, గౌస్‌పల్లి సర్పంచ్ సరళ,వీఆర్వో నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు,టెక్నికల్ అసిస్టెంట్‌లు ఉన్నారు.
ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలి
ఎస్‌ఎస్ తాడ్వాయి : ఉపాధి హామీ పథకం కిం ద ఇంటింటికి ఇంకుడుగుంతలు నిర్మించాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. తాడ్వారుు ఎంపీడీఓ కార్యాలయంలో తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట, మంగపేట మండలాల్లో ఉపాధి పనులపై శనివారం సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంకుడుగుంతలు, ఫాం పాండ్‌ల నిర్మాణ పనుల్లో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం మండలాలు జిల్లాలోనే వెనుకబడి ఉన్నాయన్నారు. తాడ్వా రుు మండలంలో ఇంకా వంద ఫాంపాండ్‌లు, 300 ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచిం చారు. ఒక్కో గ్రామానికి 35 చొప్పున ఫాంపాం డ్‌లు నిర్మించాలని చెప్పారు. ఈ పనులు వారం రోజుల్లో పరిశీలించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చిన్నబోరుునపల్లిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో తవ్వించిన ఇంకుడుగుంతలను అటవీశాఖ అధికారులు దున్నేశారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో కలెక్టర్ సంబంధిత అధికారితో ఫోన్‌లో మాట్లాడారు. ఉపాధిహా మీ పథకం కింద తాడ్వారుు మండలంలో నా టిన టేకు మొక్కల వివరాలను ఏపీఓ కుమారస్వామిని అడిగి తెలుసుకున్నారు. ఫాంపాండ్, ఇంకుడుగుంతల నిర్మాణ పనుల్లో పూర్తిగా వెనుకబడిన మంగపేట మండలాన్ని సందర్శించాలని ఏపీడీని ఆదేశించారు. ఈ సమావేశంలో పీడీ శంకర్‌రెడ్డి, ఏపీడీ వెంకటనారాయణ, జెడ్పీటీసీ సభ్యురాలు పులుసం సరోజన, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, తహసీల్దార్ పొదెం లక్ష్మయ్య, ఎంపీడీఓలు వసుమతి, సురేష్, ప్రవీన్‌కుమార్, తాడ్వాయి ఏపీఓలు కుమారస్వామి, చంద్రకాంత్, రాజు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.