
తమిళనాడు: మద్యం మత్తులో ఉపాఽధి హామీ కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు స్థానికంగా ఉపాధీ హమీ పనులు చేస్తున్నారు. మంగళవారం మద్యం మత్తులో వారి వద్దకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన ప్రభాకరన్ నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
దీంతో మహిళలు బుధవారం ఉదయం పుల్లరంబాక్కం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో తిరువళ్లూరు–ఊత్తుకోట మార్గంలో రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముళ్ల పొదల్లో దాక్కుకున్న ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment