misbehaved
-
HYD: మహిళా కార్పొరేటర్‌తో BRS కీలక నేత అసభ్యకర వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తన నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్‌తో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన నేత.. తన వంకర బుద్దిని చూపించారు. రాత్రిళ్లు మహిళా కార్పొరేటర్‌కు ఫోన్ చేసి.. వ్యక్తిగత విషయాలను అడగడం, అసభ్యకరంగా మాటాడం తీవ్ర దుమారం రేపింది. ఇక, ఈ విషయం మంత్రి దృష్టికి చేరినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. అధికార పార్టీకి చెందిన కీలక నేత కొంత కాలంగా ఓ మహిళా కార్పొరోటర్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఆమె భర్త కూడా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. సదరు నేత వారి వ్యక్తిగత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ది తెలియని ఆమె కూడా తన ఇబ్బందులను వ్యక్తిగత విషయాలను ఆయనతో పంచుకునేది. దీన్ని అనుకూలంగా తీసుకున్న సదరు నేత.. తన వక్రబుద్ధి చూపించారు. మూడు రోజల క్రితం ఆమెకు ఫోన్ చేసిన నేత.. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తిన్నావా.. లేదా?. అర్ధరాత్రి వరకూ ఏమీ తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ఓ రకంగా అడిగి, ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటంతో ఒక్కసారిగా షాకైంది. అనంతరం, ఆయన మాట్లాడిన సంభాషణను ఫోన్లో రికార్డు చేసింది. ఈ క్రమంలో ఆ ఆడియోను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి వద్ద బాధితురాలు కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. -
ఉపాధి హామీ కూలీలతో నగ్నంగా నిలబడి అసభ్యకర ప్రవర్తన
తమిళనాడు: మద్యం మత్తులో ఉపాఽధి హామీ కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు స్థానికంగా ఉపాధీ హమీ పనులు చేస్తున్నారు. మంగళవారం మద్యం మత్తులో వారి వద్దకు వెళ్లిన అదే గ్రామానికి చెందిన ప్రభాకరన్ నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మహిళలు బుధవారం ఉదయం పుల్లరంబాక్కం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో తిరువళ్లూరు–ఊత్తుకోట మార్గంలో రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ముళ్ల పొదల్లో దాక్కుకున్న ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు. -
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్‌లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్‌లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్‌కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
జొన్నాడలో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు దౌర్జన్యం
-
స్నేహం ముసుగులో యువతులను లొంగదీసుకుని.. ఆతర్వాత
సాక్షి, చెన్నై(తమిళనాడు): పొల్లాచ్చి కేసులో నిందితులకు అండగా ఖాకీలు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. వీడియో వైరల్ కావడంతో ఓ స్పెషల్ ఎస్ఐతో సహా ఏడుగురిని గురువారం సస్పెండ్ చేశారు. మాయ మాటలతో, స్నేహం ముసుగులో విద్యార్థినులను, యువతులను బలవంతంగా లొంగ దీసుకోవడమే కాదు, ఆ దృశ్యాల్ని కెమెరాల్లో బంధించి, తరచూ బెదిరిస్తూ వారి జీవితాలతో చెలాగాటం ఆడుతూ వచ్చిన మృగాళ్ల బండారం పొల్లాచ్చిలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. బాధితులు అనేక మంది గతంలో చేసిన ఫిర్యాదుతో మృగాళ్ల తిరునావుక్కరసు, శబరినాథన్, మణివణ్ణన్, వసంతకుమార్, సతీష్ తొలుత అరెస్టు అయ్యారు. కేసు సీబీఐ చేతికి వెళ్లినానంతరం అన్నాడీఎంకేకు చెందిన అరులానందన్, బాలు, బాబు పట్టుబడ్డారు. ఈ కీచకుల్లో ఐదుగురు సేలం జైల్లో, మరో ముగ్గురు గోబి చెట్టి పాళయం జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మార్గం మధ్యలో సపర్యలు బుధవారం వీరిని కేసు విచారణ నిమిత్తం కోయంబత్తూరు కోర్టుకు హాజరు పరిచారు. సేలం జైల్లో ఉన్న ఐదుగుర్ని ఎస్ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసులు వ్యానులో కోర్టుకు తీసుకొచ్చారు. రిమాండ్ పొడిగించినానంతరం వీరిని మరలా జైలుకు తరలించారు.అయితే, మార్గం మధ్యలో ఈ కీచకులకు అండగా భద్రతకు వెళ్లిన పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో అర్ధరాత్రి వేళ వైరల్‌గా మారింది. గోల్డెన్‌ట్విన్స్ షూటింగ్‌స్పాట్ వద్ద పోలీసుల వాహనం ఆపేశారు. కీచకులు వారి కుటుంబీకులు, బంధువులు వారితో ముచ్చటించడమే కాకుండా, కోర్టు సమర్పించిన చార్జ్‌షీట్ నకలు వారి చేతికి చేరింది. అర్ధగంటకు పైగా కుటుంబంతో నిందితులు గడిపిన వీడి యో వెలుగులోకి రావడంతో పోలీసు బాసులు స్పందించారు. ఎస్ఐ సుబ్రమణ్యంతో పాటుగా ఏడుగురు పోలీసుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కీచకులు, వారి కుటుంబాలతో భద్రతకు వెళ్లిన వారికి ఉన్న సంబంధాలు, వారి నుంచి వీరికి ఏ మేరకు నగదు ముట్టిందో.. అన్న అనుమానాలు బయలు దేరాయి. దీంతో సీబీఐ సైతం సస్పెండైన ఏడుగురి మీద గురి పెట్టడం గమనార్హం. -
నోరు పారేసుకున్న సర్పంచ్
సాక్షి, రంగారెడ్డి: గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ అమలు తీరును తెలుసుకునేందుకు వెళ్లిన అధికారిపై మొయినాబాద్ మండలం కనకమామిడి సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రణాళికను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసిన ఆ అధికారికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతోపాటు దుర్భాషలాడారు. కనకమామిడి పంచాయతీ అనుబంధ గ్రామం సజ్జన్‌పల్లిని శనివారం జిల్లా పంచాయతీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు ముళ్లపొదలు ఉన్నట్లు గుర్తించారు. గృహనిర్మాణ వ్యర్థాలు, శిథిలావస్థ ఇళ్ల తొలగింపు తప్ప మరే ఇతర పనులను చేపట్టనట్లు కనబడింది. ఈ సమయంలో స్థానికంగా సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సదరు అధికారి ఫోన్లో ఆయన్ను నిలదీశారు. ‘ఎవరు చెబితే మీరు గ్రామానికి వచ్చారో తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు. మీ సంగతి అంతా గమనించిన’ అని సర్పంచ్ దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై ఘటనా స్థలం నుంచి సదరు అధికారి ఆవేదనతో ఇన్చార్జి కలెక్టర్ హరీష్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. సదరు సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ అధికారికి సూచించారు. తనిఖీకి వచ్చిన అధికారి పట్ల అమర్యాదగా మాట్లడటంతో ఇన్చార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్‌కు షాకాజ్ నోటీసులు జారీచేశారు. అలాగే 30 రోజుల ప్రణాళిక అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన పంచాయతీ సెక్రటరీ రవీందర్‌కు చార్జిమెమో ఇచ్చారు. దీనిపై సర్పంచ్ జనార్దన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ అడిగేందుకు పలుమార్లు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
-
తప్పతాగి పోలీసు డ్రస్‌లో హంగామా..
హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి హంగామా చేశాడు. పోలీస్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి ఫుల్‌గా మందు కొట్టి నడిరోడ్డుపై వీరంగం చేశాడు. రోడ్డుపై వచ్చివెళ్లే వాహనాలను అడ్డుకుని... లైసెన్స్ చూపించాలంటూ గడబిడ చేశాడు. అంతేకాకుండా ఫైర్ సిబ్బందితోనూ గొడవకు దిగాడు. ఆటోవాలాల వద్ద అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశాడు. కాగా పోలీస్ డ్రస్సులో ఉన్న ఆ వ్యక్తి ఎవరనేది తెలియలేదు. తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి కాదని సికింద్రాబాద్ ఫైర్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఎవరనేది తేలాల్సి ఉంది. దాంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.