
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తన నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్‌తో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పలు హోదాల్లో పనిచేసిన నేత.. తన వంకర బుద్దిని చూపించారు. రాత్రిళ్లు మహిళా కార్పొరేటర్‌కు ఫోన్ చేసి.. వ్యక్తిగత విషయాలను అడగడం, అసభ్యకరంగా మాటాడం తీవ్ర దుమారం రేపింది. ఇక, ఈ విషయం మంత్రి దృష్టికి చేరినట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. అధికార పార్టీకి చెందిన కీలక నేత కొంత కాలంగా ఓ మహిళా కార్పొరోటర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఆమె భర్త కూడా రాజకీయాల్లో పాల్గొంటున్నారు. సదరు నేత వారి వ్యక్తిగత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ది తెలియని ఆమె కూడా తన ఇబ్బందులను వ్యక్తిగత విషయాలను ఆయనతో పంచుకునేది. దీన్ని అనుకూలంగా తీసుకున్న సదరు నేత.. తన వక్రబుద్ధి చూపించారు.
మూడు రోజల క్రితం ఆమెకు ఫోన్ చేసిన నేత.. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు. తిన్నావా.. లేదా?. అర్ధరాత్రి వరకూ ఏమీ తినకపోతే ఆరోగ్యం ఏమవుతుంది అంటూ ఓ రకంగా అడిగి, ఆ తర్వాత ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటంతో ఒక్కసారిగా షాకైంది. అనంతరం, ఆయన మాట్లాడిన సంభాషణను ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ క్రమంలో ఆ ఆడియోను పార్టీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ సందర్భంగా మంత్రి వద్ద బాధితురాలు కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఆడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment