ముగిసిన టీపీఎఫ్ బస్సు యాత్ర
పట్టణంలో ర్యాలీ నిర్వహించిన నాయకులు
నర్సంపేట : హరితహరం పేరుతో పోడు భూములను ఫారెస్టు అధికారులు లాక్కుం టున్నారని దీనిని నిరసిస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరిగిందని , శనివారంతో యాత్ర ముగిసిందని టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్ అన్నా రు. అనంతరం పట్టణంలోని అం»ే ద్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో పోడు భూముల ఆక్రమణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న హన్మకొండ నుంచిlబయలుదేరిన బస్సు యాత్ర 5 రోజుల పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్ద గూడూరు, పాకాల, కొత్తగూడ, ఇల్లం దు, గుండాల, టేకులపల్లి, కాచనపల్లి, కొత్తగూడెం, చంద్రుగొండ, మండలా ల్లో కొ నసాగిందన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం సాగుచేసుకుంటు న్న పోడు భూములను గుంజుకుం టు న్న గ్రామాలను పర్యటించి ఆదివాసీ ప్రజలకు సమావేశాలు ఏర్పాటు చేసి, వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం చేస్తున్న ్రçపజా వ్యతి రేక విధానాలను వివరించడం జరిగిందన్నారు. అనంతరం నర్సంపేటకు చే రుకుని ముగింపు ర్యాలీని పట్టణంలో ని అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు కొనసాగించామన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు సాయన్న, జనగాం కుమారస్వా మి, స్వప్న, నవీన్, గణేష్, శ్రీనివాస్, శాంత, వెంకన్న, సైదులు,యాదయ్య, శ్రీనివాస్,శాంత, వెంకన్న, సైదులు, మమత, యాకయ్య పాల్గొన్నారు.