endangered animal
-
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
వారెవ్వా.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది..
సాధారణంగా చిన్న పిల్లలు అందంగా ఉన్న జంతులను చూసేందుకు, వాటితో ఆడుకునేందుకు ఇష్టపడతారు. కానీ, ఓసారి ఇక్కడ చూడండీ. చిన్నారులు ఖడ్గమృగాన్ని చూస్తే అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఆఫ్రికన్ రిజర్వ్ కేంద్రం, కెన్యాలో జరిగిన జరిగిన చిన్న సంఘటన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓఎల్ పిజేటా ఓ చిన్నారి ఏకంగా ఖడ్గమృగానికి అడుగులు ఎలా వేయాలో నేర్పించి ఔరా అనిపించింది. ఆ చిన్న ఖడ్గమృగము పేరు రింగో. చిన్నారి చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటున్నట్లుగా, పిజేటా వెనకాలే బుడి బుడి అడుగులు వేస్తూ రైనో రింగో వచ్చేసింది. పిజేటా ఏమాత్రం బెదరకుండా, హాయిగా నవ్వుతూ ఖడ్గమృగానికి ఎలా నడవాలో చెబుతూ నడిచింది. తన వెనకాలే అడుగులు వేస్తూ రావాలంటూ ట్రెయినింగ్ ఇస్తున్నట్లు ఉన్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు. 'అమ్మా.. ఆ రైనోకు నడవటం నేర్పుతాను. నా వెనకాల అడుగులు వేస్తూ నెమ్మదిగా నడవాలని రింగోకు చెప్పాను' అని బేబీ పిజేటా అంటోంది. ఓ సందర్భంలో రింగో తనకు చాలా దగ్గరగా వచ్చిందని, వెంటనే కాస్త దూరం పెంచెలా నడక మొదలెట్టానని చిన్నారి చెప్పింది. మన పిల్లలకు జంతులు, ఇతరుల పట్ల ఎలా మెలగాలో నేర్పిస్తే వారు అలాగే ప్రవర్తిస్తారని దీంతో జంతువులు అంతరించి పోకుండా పోతాయన్న మాటలు ఆ వీడియోలో వినిపిస్తాయి.