వారెవ్వా.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది.. | Little girl teaches endangered white rhino baby to walk in this cute footage | Sakshi
Sakshi News home page

వారెవ్వా.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది..

Published Tue, May 31 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

వారెవ్వా.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది..

వారెవ్వా.. ఖడ్గమృగానికి నడక నేర్పించింది..

సాధారణంగా చిన్న పిల్లలు అందంగా ఉన్న జంతులను చూసేందుకు, వాటితో ఆడుకునేందుకు ఇష్టపడతారు. కానీ, ఓసారి ఇక్కడ చూడండీ. చిన్నారులు ఖడ్గమృగాన్ని చూస్తే అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఆఫ్రికన్ రిజర్వ్ కేంద్రం, కెన్యాలో జరిగిన జరిగిన చిన్న సంఘటన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఓఎల్ పిజేటా ఓ చిన్నారి ఏకంగా ఖడ్గమృగానికి అడుగులు ఎలా వేయాలో నేర్పించి ఔరా అనిపించింది. ఆ చిన్న ఖడ్గమృగము పేరు రింగో. చిన్నారి చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింటున్నట్లుగా, పిజేటా వెనకాలే బుడి బుడి అడుగులు వేస్తూ రైనో రింగో వచ్చేసింది.

పిజేటా ఏమాత్రం బెదరకుండా, హాయిగా నవ్వుతూ ఖడ్గమృగానికి ఎలా నడవాలో చెబుతూ నడిచింది. తన వెనకాలే అడుగులు వేస్తూ రావాలంటూ ట్రెయినింగ్ ఇస్తున్నట్లు ఉన్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు. 'అమ్మా.. ఆ రైనోకు నడవటం నేర్పుతాను. నా వెనకాల అడుగులు వేస్తూ నెమ్మదిగా నడవాలని రింగోకు చెప్పాను' అని బేబీ పిజేటా అంటోంది. ఓ సందర్భంలో రింగో తనకు చాలా దగ్గరగా వచ్చిందని, వెంటనే కాస్త దూరం పెంచెలా నడక మొదలెట్టానని చిన్నారి చెప్పింది. మన పిల్లలకు జంతులు, ఇతరుల పట్ల ఎలా మెలగాలో నేర్పిస్తే వారు అలాగే ప్రవర్తిస్తారని దీంతో జంతువులు అంతరించి పోకుండా పోతాయన్న మాటలు ఆ వీడియోలో వినిపిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement