Energy efficiency company
-
ఈఈఎస్ఎల్తో జియోథింగ్స్ ఒప్పందం
న్యూఢిల్లీ: స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు కోసం ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్)తో జియోథింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్రెంచ్ సంస్థ ఈడీఎఫ్‌తో కలిసి బిహార్‌లో తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం సొల్యూషన్ ఆధారిత 10 లక్షల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. తాజా స్మార్ట్ సాంకేతికల వినియోగం ద్వారా విద్యుత్ రంగం లబ్ధి పొందేందుకు తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం ఉపయోగపడగలదని జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థా మస్ తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ నిర్దేశించుకున్న 25 కోట్ల స్మార్ట్ మీటర్ల లక్ష్య సాకారం దిశగా ఈ ప్రయత్నాలు తోడ్పడగలవని పేర్కొన్నారు. విశ్వసనీయమైన విధంగా శక్తిపరమైన భద్రతను సాధించుకోవడంలో స్మార్ట్ మీటరింగ్ కీలకంగా ఉండగలదని ఈఈఎస్ఎల్ తెలిపింది. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
చీకటి ఒప్పందం
- ఎల్ఈడీ కాంట్రాక్ట్‌లో ‘నారాయణ’ తంత్రం - కౌన్సిల్‌ను డమ్మీ చేసిన వైనం - గప్‌చుప్‌గా కమిషనర్‌తో సంతకం - నేడు స్టాండింగ్ కమిటీ ముందుకు.. విజయవాడ సెంట్రల్ : వీధి దీపాల్లో చీకటి ఒప్పందం కుదిరింది. ఎల్ఈడీ లైట్ల కాంట్రాక్టులో ప్రభుత్వం జరిపిన మంత్రాంగం వివాదాస్పదమైంది. నగరంలో 30వేల ఎల్ఈడీ లైట్లు వేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ అక్రమంగా కట్టబెట్టారు. రూ.25కోట్ల పెట్టుబడితో వారు స్ట్రీట్‌లైట్లు ఏర్పాటుచేస్తే ఏడేళ్లలో రూ.48.14 కోట్లు తిరిగి చెల్లించాలన్నది ఒప్పందం. ఈ మేరకు ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 74ను జారీ చేసింది. నెలరోజుల కిందట కమిషనర్ జి.వీరపాండియన్‌ను మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ హడావుడిగా తుళ్లూరు పిలిచి ఒప్పంద పత్రంపై సంతకం చేయించారు. శనివారం జరగనున్న స్టాండింగ్ కమిటీలో ఈ అంశాన్ని ఆమోదానికి పెట్టారు. కాగా, కౌన్సిల్ దృష్టికి రాకుండా రూ.48.14 కోట్ల డీల్ ఓకే చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్థానిక సంస్థల (కౌన్సిల్)పై సర్కార్ కర్రపెత్తనం ఏవిధంగా చేస్తోందో ఈ అంశాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. కౌన్సిల్లో రికార్డు చేయలేదేం? కౌన్సిల్‌కు తెలియకుండా కమిషనర్‌తో మంత్రి సంతకం చేయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాండింగ్ కమిటీ ఆమోదముద్ర వేస్తే రూ.48.14 కాంట్రాక్ట్ ఢిల్లీ కంపెనీ వశమవుతుంది. నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసే జీవోలను కౌన్సిల్లో రికార్డు చేయాలి. ఇందుకు విరుద్ధంగా స్టాండింగ్ కమిటీ చర్చతో సరిపెట్టేద్దామని పాలకులు భావిస్తున్నారు. మంత్రి నారాయణ నుంచి వ చ్చిన ఒత్తిడి కారణంగానే ఈవిధంగా వ్యవహారం నడిచిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. స్టాండింగ్ కమిటీదే ప్రధాన పాత్ర వీధి దీపాల నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ 2008లో రియల్ ఎనర్జీ సంస్థకు అప్పగించింది. దీనికి సంబంధించి నెలకు రూ.26 లక్షలు చెల్లిస్తున్నారు. గత ఏడాదితో కాంట్రాక్ట్ కాలపరిమితి పూర్తయింది. మంత్రి సి‘ఫార్సు’తో మరో ఆరు నెలలు పొడిగించారు. జూన్‌తో కాంట్రాక్ట్ పూర్తి కావొస్తోంది. ఒప్పందం ప్రకారం రియల్ ఎనర్జీ సంస్థ వీధిదీపాలు, మెటీరియల్‌ను నగరపాలక సంస్థకు అప్పగించి వెళ్లాలి. ఈ నేపథ్యంలోనే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటుచేసే బాధ్యతను ఎనర్జీ ఎఫెషియెన్సీ సర్వీస్‌కు అప్పగిస్తూ కమిషనర్ ఒప్పంద పత్రంపై సంతకం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేక అకౌంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ రూ.24.50 కోట్ల పెట్టుబడితో నగరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నెలకు రూ.57.31 లక్షల చొప్పున ఏడేళ్ల వ్యవధిలో రూ.48కోట్ల14 లక్షల 14వేల 500 నగరపాలక సంస్థ చెల్లించాలి. ఇందుకోసం ఎస్కరో ప్రత్యేక అకౌంట్‌ను తెరుస్తున్నారు. దీని ప్రకారం పన్నుల ద్వారా వసూలయ్యే సొమ్ములో రూ.57.31 లక్షలు ప్రతినెలా ఈ అకౌంట్లో జమ అవుతాయి. ఇంత తతంగాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కౌన్సిల్‌ను డమ్మీ చేసిన సర్కార్ తీరుపై స్టాండింగ్ కమిటీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.