engineering posts
-
దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈఈ (సివిల్), 5 ఏఈఈ (ఎలక్ట్రికల్), మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులు కాంట్రాక్టు విధానంలో భర్తీకి దేవదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా’కు అప్పగించింది. ఏఈఈ పోస్టులకు సంబంధిత కేటగిరిలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాసైన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరి రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. రాత పరీక్ష వంద మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత ఇంజనీరింగ్ అంశాలపైన, పది మార్కులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం, మరో పది మార్కులకు జనరల్ నాలెడ్జితో కూడిన మర్టీపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. దేవదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునరి్నర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పథకం ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపడుతోంది. రూ. 450 కోట్లకు పైగా పనులకు అనుమతులు తెలిపింది. అందులో రూ. 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు రూ. 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా దేవదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో రూ. 300 కోట్ల ఖర్చుతో 3 వేల ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మరో రూ. 50 కోట్ల టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది. మరోవైపు దేవదాయ శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఆలయాల వారీగా కొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించింది. వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అత్యవసరంగా కాంట్రాక్టు విధానంలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్టు దేవదాయ శాఖ పేర్కొంది. పూర్తి పారదర్శకంగా భర్తీ ప్రక్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బందిని నియమిస్తున్నాం. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా’కు అప్పగించాం. – కొట్టు సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) -
‘ఇంజనీరింగ్ నోటిఫికేషన్లు’.. తదుపరి చర్యలన్నీ నిలుపుదల
సాక్షి, అమరావతి: వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు నిలుపుదల చేసింది. అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా తదుపరి చర్యలన్నింటినీ స్తంభింపజేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీపీఎస్సీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షను కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తున్నారని.. ఇది చట్టవిరుద్ధమంటూ నెల్లూరు జిల్లాకు చెందిన బాణాల చరణ్, ప్రకాశం జిల్లాకు చెందిన మద్దుల రాజారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్ 26న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సైతం ఇంగ్లిష్‌లోనే రాత పరీక్ష నిర్వహించనున్నారని, ఇది చట్టవిరుద్ధమంటూ ప్రకాశం జిల్లాకు చెందిన డి.శివశంకర్‌రెడ్డి, మద్దుల రాజారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపిస్తూ.. ఇంగ్లిష్‌లో మాత్రమే రాతపరీక్ష నిర్వహించడం అధికార భాషా చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఇంగ్లిష్‌లోనే పరీక్ష నిర్వహించడం వల్ల తెలుగు మీడియం విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తెలుగులో కూడా పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి రెండు నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ట్రాన్స్పోర్ట్ సబార్డినేట్ సర్వీసుల్లో అసిస్టెంట్ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
మరో 200 ఏఈవో పోస్టులు
భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చే నెలలో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: మరో 200 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇందుకు వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేయ నుందని ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ‘సాక్షి’కి తెలిపారు. తాజాగా ఏవో పోస్టుల ఫలితాల్లోనూ ఏఈవోలూ అర్హత సాధిం చారు. దీంతో కొన్ని ఏఈవో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశముంది. వాటితో కలిపి 200కు పైగా ఏఈవో పోస్టులు ఉంటాయని.. వాటి భర్తీకి సర్కారు ఆమోదం కూడా లభించిందని పార్థసారథి తెలిపారు. ఇదిలావుండగా ఈసారి ఏఈవో పోస్టులకు వ్యవసాయ ఇంజినీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పదిలో ఒక పోస్టు చొప్పున గతంలోనే వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కేటాయించగా... వారితోపాటు ఈసారి ఆ పోస్టును వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు కూడా భాగం కల్పించారు. ఆ ప్రకారం 200 పోస్టుల్లో 20 పోస్టులు వ్యవసాయ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులకు దక్కుతాయి. ఈ మేరకు న్యాయశాఖ కూడా అనుమతి ఇచ్చిందని పార్థసారథి తెలిపారు. వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు న్యాయం... ఏఈవో పోస్టుల్లో వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన వ్యవసాయశాఖ మరోవైపు ఇతర పోస్టుల్లోనూ వారికి అర్హత కల్పించే విషయంపై సమగ్ర పరిశీలన చేస్తోంది. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 16, నిజామాబాద్ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 7, మహబూబ్‌నగర్ జిల్లాలో 28, మెదక్‌లో 15, రంగారెడ్డిలో 37, కరీంనగర్లో 16, ఖమ్మంలో 11, నల్లగొండ జిల్లాలో 11 ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. మొత్తం ఆ పోస్టుల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులు రెండు, వివిధ కేటగిరీలకు చెందిన డ్రాఫ్ట్మేన్ పోస్టులు 18 పోస్టులు, వ్యవసాయ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు నాలుగున్నాయి. వివిధ గ్రేడ్లకు చెందిన మెకానికల్ పోస్టులు 14 ఖాళీగా ఉన్నాయి. వాటిలో తమనే భర్తీ చేయాలని వ్యవసాయ ఇంజినీరింగ్ విద్యార్థులు కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ ఫైలును కూడా వ్యవసాయశాఖ ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. -
ఎడ్యుకేషన్ & జాబ్స్: మరో 161 ఇంజనీరింగ్ పోస్టులు
మరో 161 ఇంజనీరింగ్ పోస్టులు మొత్తంగా 931 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 770 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈనెల 20న నోటిఫికేషన్‌ను జారీ చేసిన టీఎస్పీఎస్సీ... తా జాగా మరో 161 పోస్టులను (సివిల్ ఇంజనీరింగ్) అందులో చేర్చింది. మొత్తంగా 931 పోస్టులను ఆ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదనంగా చేర్చిన 161 పోస్టులకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వివరణలు రానందున అప్పుడు నోటిఫికేషన్లో చేర్చలేదని తెలిపారు. ప్రస్తుతం వాటిపై పూర్తి స్థాయిలో వివరణలు వచ్చినందున నోటిఫికేషన్లో చేర్చినట్లు వివరించారు. అభ్యర్థులు సెప్టెంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, అదేనెల 20న పరీక్ష ఉంటుందని వివరించారు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. ⇔ ఐసెట్ ప్రవేశాలకు 3 వేల మంది ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు ఐసెట్ వెబ్ ఆప్షన్లలో భాగంగా శుక్రవారం 3,047 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 27 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించగా శుక్రవారం వరకు 14,237 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు. ⇔ నేటి నుంచి ఓయూ సెట్ సర్టిఫికెట్ల పరిశీలన సాక్షి, హైదరాబాద్: ఓయూసెట్-2015కు వెబ్ ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు శనివారం నుంచి సెప్టెంబర్ 1 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. మొత్తం 25,098 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. మొదటి రెండు విడతల్లో కలిపి 16,250 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 31, వచ్చేనెల ఒకటిన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు నేరుగా కౌన్సెలింగ్ జరగనుందని పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ⇔ రాష్ర్టస్థాయిలోనూ విదేశీ అధ్యాపకులతో బోధన సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్ (గేయిన్) కింద ఐఐటీ, ఎన్ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లోలాగే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా విదేశీ అధ్యాపకులతో బోధన చేయించొచ్చని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. విదేశీ విశ్వ విద్యాలయాలు, ఇతర రంగాలకు చెందిన అధ్యాపకులతో బోధన చేయించేందుకు వీలుగా గేయిన్ కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. అయితే ఎన్బీఏ అక్రిడిటేషన్ కలిగి ఉన్న కోర్సులనే వారితో బోధింపచేయాలని పేర్కొంది. ⇔ హెచ్‌సీయూ అధ్యాపకులకు పతకాలు సాక్షి, హైదరాబాద్: రసాయన శాస్త్రంలో చేస్తున్న పరిశోధనలకు గాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్లు డీబీ రామాచారి, కేసీ కుమార స్వామిలకు ‘ద కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా’ (సీఆర్‌ఎస్‌ఐ) రజత, కాంస్య పతకాలకు ఎంపిక చేసింది. త్వరలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పతకాలను వీరికి సీఆర్‌ఎస్‌ఐ అందించనుంది. ప్రొ. కేసీ కుమార స్వామి రసాయన శా్రస్తంలో 168 ప్రచురణలను వెలువరించారు. కెమికల్ రీసెర్చ్‌లో ప్రొ.రామాచారి 70 ప్రచురణలు వెలువరించి, ఐఎన్ఎస్ఏ యంగ్ సైంటిస్ట్ మెడల్ ఏకే బోస్ అవార్డులను అందుకున్నారు.