20, 22 తేదీల్లో జాబ్‌మేళా
హైదరాబాద్: లోక్‌సత్తా, ఇంజినీర్స్ కాడ్ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20, 22 తేదీల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అధ్యక్షులు బి.సాంబిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10 నుంచి మ.2 గంటల వరకు ఈ జాబ్‌మేళా ఉంటుందని పేర్కొన్నారు. అమీర్‌పేటలోని యూరేకాకోర్ట్ 2వ అంతస్తులో ఉన్న సీసీఈ సంస్థలో ఈ మేళా ఉంటుందని తెలిపారు. డిగ్రీ, డిప్లొమా, మెకానికల్, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నెలకు జీతం రూ.7 వేలు ఆపై ఉంటుందని, పూర్తి వివరాలకు 89770 31068 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు.