England Test captain
-
బెన్ స్టోక్స్‌కు చేదు అనుభవం.. లగేజి మిస్సింగ్! స్పందించిన ఎయిర్‌లైన్స్
ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. లండన్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించడంతో సిరీస్ 2-2తో సమమైంది. చివరి టెస్టు అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు వారి గమ్యస్ధానాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడు లండన్ నుంచి డర్హామ్కు బ్రిటీష్ ఎయిర్వేస్లో ప్రయాణం చేశాడు. ఈ సందర్భంగా అతడి లగేజి బ్యాగ్‌లు కన్పించకుండా పోయాయి. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి కూడా తీసుకువెళ్లాడు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ.. ఇంతవరకు లగేజీ అందించలేదని స్టోక్స్ ట్విటర్ వేదికగా తన ఆవేదనను తెలియజేశాడు.విమానంతో పాటు నా లగేజి రాలేదు. నేను మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నా అని బ్రిటీష్ ఎయిర్వేస్ను ట్యాగ్ చేస్తూ స్టోక్స్ ట్వీట్ చేశాడు. వెంటనే దానికి సదరు విమానయాన సంస్థ కూడా స్పందించింది. "హాయ్ బెన్, మీకు ఆసౌకర్యం కలిగినందుకు చింతుస్తున్నాం. మీ వివరాలను మాకు పంపించండి. మేము పరిశీలిస్తాము" అని బ్రిటీష్ ఎయిర్వేస్ రిప్లే ఇచ్చింది. ఇక యాషెస్ తర్వాత స్టోక్స్ సుదీర్ఘ విరామం తీసుకోనున్నాడు. అతడు తిరిగి మళ్లీ వచ్చే ఏడాది జనవరిలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా స్టోక్స్ ఇప్పటికే వైట్‌బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో టీ20.. శుబ్‌మన్ గిల్‌పై వేటు! విధ్వంసకర ఓపెనర్ ఎంట్రీ Bags not turned up off the plane @British_Airways and help would be greatly appreciated — Ben Stokes (@benstokes38) August 2, 2023 -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్..!
లండన్: ఇటీవలి కాలంలో వరుస పరాజయాల బాట పట్టిన ఇంగ్లండ్ టెస్ట్ టీమ్.. పూర్వ వైభవం సాధించే క్రమంలో జట్టులో సమూల మార్పులకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలుత కెప్టెన్‌ను మార్చిన ఆ జట్టు.. తాజాగా కొత్త కోచ్‌ను నియమించే పనిలో నిమగ్నమైంది. జో రూట్ రాజీనామా చేశాక బెన్ స్టోక్స్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు).. టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి కోసం న్యూజిలాండ్ మాజీ సారధి, కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెక్ కల్లమ్, ఈసీబీ మధ్య చర్చలు కూడా ముగిసినట్టు సమాచారం. ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ.. గత కొద్ది రోజులుగా మెక్ కల్లమ్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ టెస్ట్ జట్టు గతేడాది భారత పర్యటనకు వచ్చినప్పట్నుంచి వరుస పరాజయాల బాట పట్టి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో పరాభవం, ఆతర్వాత యాషెస్‌లో ఆసీస్ చేతిలో 0-4 తేడాతో దారుణ ఓటమి, ఇటీవల విండీస్ చేతిలో 1-2 తేడాతో ఓటమి.. ఇలా ఆ జట్టు ఆడిన ప్రతి టెస్ట్ సిరీస్‌లోనూ ఓటమిపాలై ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అప్రతిష్టను మూటగట్టుకుంది. దీంతో జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేయాలని ఈసీబీపై ఒత్తిడి అధికమైంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ బోర్డు ఇంగ్లండ్ టెస్ట్ బృందంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. కాగా, జూన్‌లో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ సిరీస్ నుంచే స్టోక్స్ ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపడతాడు. ఒకవేళ ఈసీబీతో మెక్‌కల్లమ్‌కు డీల్ కుదిరితే.. అతను తన సొంత జట్టుకు వ్యతిరేకంగా పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పేరు దాదాపుగా ఖరారైంది. కిర్‌స్టెన్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ మెంటార్‌గా ఉన్నాడు. చదవండి; 'దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది' -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్..
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ గురవారం వెల్లడించాడు. కాగా స్టోక్స్ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు 81వ కెప్టెన్. ఇక వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీకు జో రూట్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. "బెన్ స్టోక్స్‌కు టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు నేను పెద్దగా ఆలోచించలేదు. భవిష్యత్తులో ఇంగ్లండ్ జట్టును విజయ పథంలో స్టోక్స్ నడిపిస్తాడన్న నమ్మకం మాకు ఉంది. అదే విధంగా ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు చేపట్టేందుకు అతడు అంగీకరించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇంగ్లండ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అతడే సరైనోడు" అని రాబ్ కీ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. ఇక స్టోక్స్ 2013లో టెస్టుల్లో అరంగేట్రంచేశాడు. ఇప్పటి వరకు 73 టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఇంగ్లండ్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్‌గా స్టోక్స్ ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు 73 టెస్టులు ఆడిన స్టోక్స్ 5,061 పరుగలతో పాటు.. 174 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND vs SA T20 Series: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?! Ben Stokes named England Men's Test captain: England & Wales Cricket Board (ECB) (file photo) pic.twitter.com/P6qp0bLYXe — ANI (@ANI) April 28, 2022 -
జో రూట్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై
ఇంగ్లండ్ టెస్టు సారథి జో రూట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ బాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు రూట్ శుక్రవారం ప్రకటించాడు. యాషెస్ సిరీస్‌లో ఘోరపరాభవం, వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం రూట్ కెప్టెన్సీ వైదొలగాలని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రూట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రూట్ (64మ్యాచ్‌లు) రికార్డు సృష్టించాడు. తన ఐదేళ్ల కెప్టెన్సీ లో ఇంగ్లండ్‌కు 27 విజయాలు అందించి అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా రూట్ కలిగి ఉన్నాడు."నా దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇంగ్లండ్ వంటి జట్టకు కెప్టెన్‌గా మరి కొంత కాలం కొనసాగాలని భావించాను. కానీ ఇటీవల కాలంలో అనూహ్య పరిణమాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపింది. ఇంగ్లండ్ తదుపరి కెప్టెన్‌గా ఎవరు ఎంపికైన నా వంతు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్దంగా ఉంటాను. నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు దన్యవాదాలు" అని రూట్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 RR Vs GT: "అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు అవసరమా" -
ఇంగ్లండ్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న జో రూట్!
వెస్టిండీస్ పర్యటన అనంతరం ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు జో రూట్ హింట్ ఇచ్చాడు. సిరీస్‌లో అఖరి టెస్టులో వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్ తలపడతోంది. తొలి రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగియడంతో చివరి మ్యాచ్‌లో సత్తా చాటాలని ఇరు జట్లు బావిస్తోన్నాయి. ఈ క్రమంలో విలేకేరుల సమావేశంలో మాట్లాడిన జో రూట్ కీలక వాఖ్యలు చేశాడు. "ఇటువంటి సమయంలో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు నేనే సరైన వ్యక్తినని భావిస్తున్నాను. కానీ, మాకు ప్రస్తుతం ప్రధాన కోచ్ లేడు. ప్రధాన కోచ్ వచ్చి భిన్నంగా ఆలోచిస్తే, కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. నేను ఇంగ్లండ్ జట్టుకు పెద్ద అభిమానిని. మా జట్టు ప్రపంచంలో అత్యుత్తమ జట్టుగా ఉండాలి అని ఎప్పడూ కోరుకుంటాను. కాబట్టి మేనేజెమెంట్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇప్పటి వరకు జట్టును అత్యుత్తమ స్థితిలో ఉంచడానికి నా వంతు నేను కృషి చేశాను. కెప్టెన్‌గానే కాకుండా జట్టు సభ్యడిగా కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను" అని రూట్ పేర్కొన్నాడు. ఇక వెటరన్ బ్యాటర్ అలిస్టర్ కుక్ రాజీనామా చేసిన తర్వాత 2017లో జో రూట్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రూట్ ఇప్పటి వరకు 63 టెస్టులకు సారథ్యం వహించాడు. అయితే ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి తర్వాత రూట్‌పై విమర్శలు వెల్లు వెత్తాయి. అంతే కాకుండా వెంటనే ఇంగ్లండ్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేశారు. మరో వైపు యాషెస్ సిరీస్‌లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ హెడ్ కోచ్ పదవి నుంచి క్రిస్ సిల్వర్ వుడ్ తప్పుకున్నాడు. అప్పటి నుంచి రూట్ కూడా కెప్టెన్సీ తప్పుకుంటాడని వార్తలు వినిసిస్తున్నాయి. అయితే తాజాగా రూట్ చేసిన వాఖ్యలు ఆ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. చదవండి: భారత అభిమానులకు గుడ్ న్యూస్.. మూడు వన్డేలు, ఐదు టీ20లు.. ఏ జట్టుతో అంటే! -
ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ కెప్టెన్..!
IPL Auction 2022: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు ఇంగ్లండ్ టెస్ట్ సారథి జో రూట్ కీలక ప్రకటన చేశాడు. ఫిబ్రవరిలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలం నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. యాషెస్ సిరీస్‌కు ముందు ఐపీఎల్ అరంగేట్రం చేయాలని భావించినప్పటికీ.. ఆసీస్ చేతిలో 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోవడంతో వేలం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. యాషెస్ సిరీస్ అనంతరం రూట్ మాట్లాడుతూ.. నా జట్టు కోసం చేయాల్సింది చాలా ఉంది. అందుకోసం నేను చేయగలిగినంత త్యాగం(ఐపీఎల్ వేలం నుంచి వైదొలగడం) చేస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌పైనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా, రూట్ తొలిసారి 2018 ఐపీఎల్ సీజన్లో తన పేరును వేలానికి ఉంచాడు. అయితే, అప్పుడు అతన్ని తీసుకునేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఎలాగైనా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని రూట్ పట్టుదలగా ఉన్నాడు. అయితే, యాషెస్ ఓటమి అతని ఐపీఎల్ ఎంట్రీ ఆశలపై నీళ్లు చల్లింది. ఇదిలా ఉంటే, యాషెస్‌లో దారుణ పరాజయం అనంతరం ఇంగ్లండ్ జట్టులో భారీ మార్పులు తప్పవని తెలుస్తోంది. కెప్టెన్ రూట్‌తో పాటు పలువురు సీనియర్లపై వేటు వేయాలని భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. చదవండి: బీసీసీఐ క్రేజీ ఆఫర్.. నో చెప్పిన కోహ్లి..! -
కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించా.. కానీ!
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారిగా అలిస్టెర్ కుక్ ఆసక్తికర విషయాలపై నోరువిప్పాడు. తన నాయకత్వ లక్షణాలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మేనేజ్మెంట్ సందేహాలు వ్యక్తం చేయడంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్‌తో ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని భావించాడు కుక్. 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ మాట్లాడుతూ.. '2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో నా నాయకత్వంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆపై బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలవడం, ఆ వెంటనే ఐదు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0తో దారుణ మూటకట్టుకోవడం నన్ను అసహనానికి గురిచేశాయి' అని పేర్కొన్నాడు. 'సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను అందించాను. ఆపై అదే జోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయాలు సాధించినా ప్రస్తుతం బోర్డు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. గతేడాది పాక్‌తో సిరీస్ డ్రా చేసుకోవడం ఎంతగానో బాధించింది. జట్టు సమష్టిగా వైఫల్యం చెందినా ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది. రెండు యాషెస్ సిరీస్‌లు అందించాను. మరో సిరీస్ వరకు కెప్టెన్ విజయాన్ని అందించాలని భావించాను. ఈసీబీ తనపై నమ్మకం కోల్పోవడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. 2012 ఆగస్టులో పగ్గాలు చేపట్టిన కుక్ వరుస పరాభవాలతో ఈ ఫిబ్రవరిలో అవమానాల మధ్య కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. 2010-14 మధ్య కాలంలో 69 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు కుక్. కుక్ వైదొలిగాక మిడిలార్డర్ ప్లేయర్ జో రూట్ కెప్టెన్ అయ్యాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
కెప్టెన్సీకి కుక్ బైబై
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలిస్టెర్ కుక్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రికార్డు స్థాయిలో ఇంగ్లండ్ జట్టుకు 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ స్టార్ మాట్లాడుతూ ‘ఇది నాకు బాధకలిగించే రోజే కానీ... జట్టుకోసం సరైన నిర్ణయమే తీసుకున్నాను’ అని వెల్లడించాడు. సారథ్యానికి రాజీనామా చేసినా... ఆటగాడిగా కెరీర్‌ను కొనసాగిస్తానన్నాడు. తన రాజీనామాను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్‌కు ఆదివారమే అందజేశాడు. ‘ఇంగ్లండ్‌కు సారథ్యం వహించడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఐదేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగాను. ఇపుడు బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం కఠినమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం సరైన సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని కుక్ అన్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కుక్ రికార్డులకెక్కాడు. 140 మ్యాచ్‌లాడిన కుక్ 11,057 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 53 అర్ధసెంచరీలున్నాయి. కుక్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అదేజోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయం సాధించింది. 2012లో ‘విజ్డెన్ క్రికెట్ అఫ్ ద ఇయర్’గా ఎంపికైన అతను ఆ మరుసటి ఏడాదే (2013) ఐసీసీ ప్రపంచ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.