English mideum
-
‘మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఇంతటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన అనుచర గణం, బినామీలతో కోర్టులో పిటిషన్లు దాఖలు చేయించారని మండిపడ్డారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని.. కానీ ఈ తీర్పును ఛాలెంజ్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించి పేదల ఆకాంక్షను నెరవేరుస్తామని శ్రీనివాసులు తెలిపారు. కేవలం చంద్రబాబు బినామీదారులకు చెందిన నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలను కాపాడుకునేందుకే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోపెట్టినా ఆయనకు బుద్ధి రాలేదని శ్రీనివాసులు మండిపడ్డారు. -
సీఎం జగన్‌కు గణపతి సచ్చిదానంద ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోందని, పాదయాత్రలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి కృషిచేస్తున్నారంటూ గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. లోకకళ్యాణం ప్రజా సంక్షేమం కోసం వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదవ రోజు సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ తండ్రి వైఎస్సార్ బాటలో జగన్ నడుస్తున్నారని, అనువంశిక అర్చకుల వారసత్వ హక్కుల పునురుద్ధరిస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ప్రతీ ఒక్కరూ ఆహ్వానించదగ్గ నిర్ణయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమని దీనిపై వివాదం చేయడం సరైనది కాదన్నారు. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా ఇంగ్లీషు అవసరమన్న విషయం మర్చిపోకూడదన్నారు. రాష్రంలో ఇప్పుడు ఇంగ్లీషు మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారి పిల్లలంతా ఇంగ్లీషులోనే చదివిస్తున్నారంటూ విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి సమయం ఇవ్వకుండానే ఇలా విమర్శలు చేయడం తగదన్నారు. హిందూధర్మ పరిరక్షణ అన్నది ప్రతీ ఒక్కరి బాధ్యతని, దత్తపీఠం ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కాగా ప్రకృతి వైపరీత్యాల నివారణ కోసం చేపట్టిన అతిరుద్ర యాగానికి పలువురు భక్తులు హాజరయ్యారు. -
పవన్ మన్మథుడ్ని ఫాలో అవుతున్నారు..
సాక్షి, అనంతపురం : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇక్బాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వ దోపిడీ పై ఎందుకు ప్రశ్నించలేదో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీషు మీడియంపై చంద్రబాబు, ఇతర విపక్షాల రాద్ధాంతం అనవసరమని.. పేద పిల్లల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘పవన్ కళ్యాణ్ చెగొవేరాను కాదు... నిజ జీవితంలో క్యాషియోను(మన్మథుడు) ఫాలో అవుతున్నారు. పవన్ పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధాన్ని అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరం. పవన్ పూర్తిగా ప్రశ్నించే తత్వాన్ని మరిచిపోయారు. నైతికతను వివాహ బంధంలో విడనాడారు. రాజకీయాల్లో సైతం అదేవిధంగా నైతికతను మరిచిపోయారు. టీడీపీ నుంచి బయటకు వచ్చి లోకేష్ అవినీతిపై మాట్లాడి ఆ తర్వాత మరిచిపోయారు. వరదల వల్ల ఇసుక కొరత వస్తే దానిపై ప్రభుత్వం చెబుతున్నప్పటికీ లాంగ్ మార్చ్ చేశారు. తిరుపతి సభలో వాచ్ డాగ్‌లా ఉంటానని చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు అక్రమ కట్టడంలో ఉన్నా, ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డా, శివరామకృష్ణన్ కమిటీని పక్కనపెట్టి నారాయణ కమిటీ నిర్ణయాలు అమలు చేసినా ప్రశ్నించలేదు. రైతుల ఇబ్బందులను ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కనీసం ఆ పని కూడా చేయలేదు. రైతు వేషంలో వచ్చి చంద్రబాబుతో కలిసి ప్యాకేజీ మాట్లాడుకున్నారని ప్రజలు చెప్పుకున్నారు. చంద్రబాబు చేసిన రూ.2.50 లక్షల కోట్ల అప్పు, రూ.40వేల కోట్ల బిల్లులపై మీరు ప్రశ్నించారు. దేశంలో వృద్ధిరేటు గురించి ప్రస్తావిస్తూ రాష్ట్ర వృద్ధిరేటును చంద్రబాబు చెబుతున్నా మీరు నిలదీయలేదు. నీరు-మట్టి, పుష్కరాలు, తాత్కాలిక కట్టడాలలో దోపిడీ, పోలవరం ప్రాజెక్ట్ దోపిడీ, ఇసుక మాఫియాను కనీసం ప్రశ్నించలేకపోయారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అనేది తక్షణం తీసుకున్న నిర్ణయం కాదు. నిపుణుల కమిటీతో పాటు, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ప్రజలు చెప్పిన మీదటనే ఆ నిర్ణయం అమలు చేస్తున్నారు. పేదలు తమ బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని అనుకుంటున్నారు. అది వారికి ఆర్థికంగా ఎలా భారమవుతుంది, దాన్ని తొలగించాలంటే ఏం చేయాలనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మతం మారతారన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సైతం అలా ఎందుకు రాస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే. సీఎం జగన్‌ది సెక్యులర్ తత్వం. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి సీఎం వైఎస్ జగన్‌కు ఉన్న అనుబంధం గురించి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కులాలు, మతాల పట్ల ముఖ్యమంత్రికి ఎంతో గౌరవం ఉంది. అందరిని సమాన దృష్టితో చూస్తున్నారు. ఆయన ప్రవేశపెడుతున్న పథకాలే అందుకు సాక్ష్యం. 2050లో మన రాజధానిని ప్రపంచంలోనే అత్యుత్తమంగా చేస్తామని చంద్రబాబు చెప్పినా... దానికి ప్రతిపాదనలు కనిపించడం లేదు. 2030లో పేదరికాన్ని పోగొడతామని ఆయన అన్నారు. మరి మీరు అప్పటిదాకా ఉంటారా అని రాధాకృష్ణ ఎందుకు చంద్రబాబును ప్రశ్నించలేదు. ఐదు ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టిస్తామని అన్నారు... దాని గతి లేదు’ అంటూ మండిపడ్డారు. -
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
ఆంగ్ల మాధ్యమం చదవలేక అఘాయిత్యం ముస్తాబాద్(కరీంనగర్): ఇంగ్లిష్ మీడియం చదువు ఆ విద్యార్థిపాలిట శాపమైంది. తల్లిదండ్రుల కోరిక కాదనలేక.. ఇటు చదవలేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనా ఓ బీటెక్ విద్యార్థి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కళాశాలలో ఇమడలేక అందులో చేరిన నాలుగు రోజులకే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎస్సై ప్రవీణ్, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ముస్తాబాద్‌కు చెందిన సూర నరేశ్(18) శుక్రవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే నరేశ్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సూర కనుకవ్వ, సాయిలు దంపతులకు ఇద్దరు కుమారులు రాజశేఖర్, నరేశ్. రాజశేఖర్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లొచ్చాడు. చిన్న కుమారుడు నరేశ్‌ను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు భావించారు. గత నెల 27న హైదరాబాద్‌లోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఓ హాస్టల్‌ను ఉంచారు. క్లాసులు అర్థం కావడంలేదురా.. నరేశ్ హైదరాబాద్‌లో హాస్టల్లో ఉండగా.. అక్కడ తనకు ఇంగ్లిష్‌లో చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని, జైలులో ఉన్నట్లు అనిపిస్తోంది అని తన స్నేహితులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. కాలేజీకి వెళ్లబుద్ధికావడం పేర్కొన్నాడు. వినాయక చవితి పండుగ కోసమని సెలవు పెట్టి గురువారం స్వగ్రామానికి వచ్చాడు. రాత్రి బాగానే ఉన్న నరేశ్‌ను కాలేజీలో ఎలా ఉందని తల్లి కనుకవ్వ వాకబు చేసింది. అంతా బాగుందని నరేశ్ చెప్పాడు. శుక్రవారం ఉదయం పనులపై తల్లిదండ్రులు, సోదరుడు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నరేశ్ ఉరేసుకున్నాడు. తమ ఇంట్లో ఎవరూ చదవలేదని, బాగా చదివి ప్రయోజకుడవుతాడని తమ కొడుకును హైదరాబాద్‌లో బీటెక్‌లో చేర్పించామని, కొడుకు మనసు అర్థం చేసుకోలేక పోయామని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, నరేశ్ కాలేజీకి కూడా ఒక్క రోజే వెళ్లాడని, హాస్టల్లో తనతోపాటు ఉంటున్న నలుగురు స్నేహితులు పేర్కొన్నారు. తనకు క్లాసులు అర్థం కావడం లేదని చెప్పాడని, ఇంతలో ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.