english paper
-
ఇంగ్లీష్ పరీక్షలో విరాట్ కోహ్లిపై ప్రశ్న.. క్వశ్చన్ పేపర్ వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి.. గతేడాది జరిగిన ఆసియా కప్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోహ్లి, ఆసియాకప్-2022లో ఆఫ్గానిస్తాన్‌పై అద్భుతమైన సెంచరీతో తన పూర్వ వైభవాన్ని పొందాడు. తన రిథమ్‌ను పొందడమే కాకుండా సెంచరీ కోసం తన మూడేళ్ల నిరీక్షణకు విరాట్ తెరదించాడు. అది విరాట్ కోహ్లికి తన అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ. ఇక ఒకనొక దశలో కోహ్లిని జట్టు నుంచి తప్పించాలని పెద్దు ఎత్తున డిమాండ్లు వినిపించాయి. పాక్ మాజీ క్రికెటర్లు అయితే ఒక అడుగు ముందుకు వేసి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని హేళన చేశారు. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అద్భుతమైన పునరాగమనం చేసిన కోహ్లి.. ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇక తాజాగా ఒక స్కూల్ కూడా విరాట్ కోహ్లి పట్టుదల, అలుపెరగని పోరాటానికి సలాం కొట్టింది. తమ స్కూల్లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లి పునరాగమనం గురించి వివరించాలని ప్రశ్న వేసింది. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో విరాట్ కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఫోటో ఉంది. ఈ ఫోటో గురించి 100 లేదా 120 పదాల్లో వివరించాలని ప్రశ్నలో ఉంది. ఇక ఇది చూసిన కింగ్ కోహ్లి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి గురించి 100 పదాలు ఏంటి, పది పేజీలు అయినా రాయవచ్చు అంటూ అభిమానులు పోస్ట్‌లు చేస్తున్నారు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. ఇప్పటి వరకు చూసి ఉండరు! వీడియో వైరల్ -
ఆంగ్ల దినపత్రికలతో సీఎం వైఎస్ జగన్ చిట్‌చాట్
-
‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’
న్యూఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల ప్రశ్న ప్రతంలో దొర్లిన తప్పుకుగాను విద్యార్థులకు 2 మార్కులు కలపాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. మార్చి 12న జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రంలో తప్పుదొర్లిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది’ అని సీబీఎస్ఈ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
అధికారుల పరుగులు!
– పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంతో అప్రమత్తం – ఇంగ్లిష్ పరీక్షకు గట్టి ఏర్పాట్లు అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. మడకశిర, కదిరి ఘటనల నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్–1 పరీక్షకు విద్యాశాఖ గట్టి ఏర్పాట్లు చేసింది. విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ, ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ కేంద్రాలను తనిఖీలు చేశాయి. ఎక్కడా ఎలాంటి సమస్యా తలెత్తకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొత్తం 49,131 మంది విద్యార్థులకు గాను 48,773 మంది హాజరయ్యారు. 358 మంది గైర్హాజరయ్యారు. 94 కేంద్రాలను అ«ధికారులు తనిఖీలు చేశారు. -
11మంది చనిపోయారనగానే బాబు ఘాట్ విడిచారు
హైదరాబాద్: తొక్కిసలాట సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ ఉన్నారని స్పష్టమైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ జిల్లా ఎస్పీ చెప్పినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని వెలువరించింది. ఘటన జరిగిన వెంటనే నలుగురు చనిపోయినట్లు ఎస్పీ తొలుత చెప్పినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారని, పదకొండు మంది చనిపోయారని చెప్పిన తర్వాత మాత్రం సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించి అక్కడ నుంచి వెళ్లిపోయారని ఎస్పీ చెప్పినట్లు పత్రిక వెల్లడించింది. పుష్కర ఘాట్ వద్ద చేసిన ఏర్పాట్లలో లోపాలున్నట్లు కూడా ఎస్పీ తెలిపారని కథనం వెలువరించింది. బారికేడ్లు తొక్కిసలాటను నివారించలేకపోయాయని ఆ పత్రికతో ఎస్పీ చెప్పారు. ముఖ్యమంత్రి ఉదయం 6.26 నిమిషాల సుముహుర్తానికి పుష్కరస్నానం చేశారని భక్తులందరికీ తెలుసని, అదే సమయంలో స్నానం చేయాలని భక్తులు కుప్పలుగా వచ్చారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఎస్పీ స్పష్టం చేసినట్లు ఆంగ్ల పత్రిక వెలువరించింది. -
పార్టీని వీడే ప్రసక్తే లేదు: జలీల్‌ఖాన్
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ సాక్షి, హైదరాబాద్ : తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తల్లో నిజం లేదని, తాను పార్టీలోనే కొనసాగుతానని విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ స్పష్టంచేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిం చారు. ఏ పత్రికగాని, టీవీ చానల్ గాని తమపై ఒక వార్తను ఇచ్చే ముందు అందు లో వాస్తవం ఎంత ఉందో నిర్థారించుకోవడానికి తమను సంప్రదించాల్సి ఉందని.. కానీ తనపై వార్త ప్రచురించిన పత్రిక ఆ పని చేయలేదని ఆయన తప్పుపట్టారు.