ennai arinthal
-
వారికోసం సొంతిళ్లు
తారలందరూ ఒకేలా ఉండరు. అలాగే వారి ఆలోచన, దృక్పథం వేర్వేరుగా ఉంటాయి. సంపాదించడం ఒక ఎత్తు అయితే అందులో ఇతరులకు సాయం చేయడానికి మంచి మనసుండాలి. అనుష్క, అజిత్‌తో కలిసి నటించిన చిత్రం ఎన్నైఅరిందాల్ ఫిబ్రవరి 5 న తెరపైకి రానుం ది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో అజిత్ నుంచి ముఖ్యంగా మూడు అంశాలను తెలుసుకున్నారట. అందులో ఒకటి ఇతరులను గౌరవించడం, మరొకటి బిరియాని చేయడం. మూడవది తన కోసం శ్రమించే వారికి తగిన సాయం చేయడం, అజిత్ ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ సమయంలోనే తన ఇంటిలో, తోటలో పని చేసే వారికి చెన్నై తూర్పు సముద్ర తీర ప్రాంతంలో సొంత గృహాలను నిర్మించి ఇచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నటి అనుష్క తనవద్ద పని చేస్తున్న వాళ్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి అనుష్క మాట్లాడుతూ ఒక సాధారణ యోగా టీచర్ అయిన తాను ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. తన కోసం రాత్రి, పగలు శ్రమిస్తున్న తన చుట్టూ వున్న వారు కారణమేనన్నారు. అలాంటివారి కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే వారికి ఇళ్లు కట్టిస్తున్నా అని వివరించారు. తానొక నటి నన్న విషయాన్ని పక్కన పెడితే అందరిలానే అన్ని భావాలు కలిగిన సరాసరి మనిషినేనని అనుష్క పేర్కొ న్నారు. -
ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా
ఎన్నై అరిందాల్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. అజిత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఎన్నై అరిందాల్. త్రిష, అనుష్క కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శ్రీసాయిరాం పిక్చర్స్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. అయితే ఎన్నై అరిందాల్ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తామని నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు. అయినా చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవలే సెన్సార్‌కు వెళ్లింది. సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్రానికి ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం లేకపోవడంతో నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏదేమైనా ఎన్నై అరిందాల్ చిత్రం వాయిదాల పర్వం అజిత్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోందన్నది నిజం. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు.