ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా | ennai arinthal movie Postponed again | Sakshi
Sakshi News home page

ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా

Published Sun, Jan 25 2015 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా

ఎన్నై అరిందాల్ మళ్లీ వాయిదా

 ఎన్నై అరిందాల్ చిత్ర విడుదల మరోసారి వాయిదా పడింది. అజిత్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఎన్నై అరిందాల్. త్రిష, అనుష్క కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో శ్రీసాయిరాం పిక్చర్స్ పతాకంపై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుందనే ప్రచారం జరిగింది.
 
 అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా చిత్ర విడుదల వాయిదా పడింది. అయితే ఎన్నై అరిందాల్ చిత్రాన్ని ఈ నెల 29న  విడుదల చేస్తామని నిర్మాత  ఏఎం రత్నం వెల్లడించారు. అయినా చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఎన్నై అరిందాల్ చిత్రం ఇటీవలే సెన్సార్‌కు వెళ్లింది. సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్రానికి ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం లేకపోవడంతో నిర్మాత రివైజింగ్ కమిటీకి వెళ్లడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ టాక్. ఏదేమైనా ఎన్నై అరిందాల్ చిత్రం వాయిదాల పర్వం అజిత్ అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తోందన్నది నిజం. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు మరోసారి ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement