వారికోసం సొంతిళ్లు | anushka shetty Own homes works | Sakshi
Sakshi News home page

వారికోసం సొంతిళ్లు

Published Wed, Jan 28 2015 1:52 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 PM

వారికోసం సొంతిళ్లు

వారికోసం సొంతిళ్లు

తారలందరూ ఒకేలా ఉండరు. అలాగే వారి ఆలోచన, దృక్పథం వేర్వేరుగా ఉంటాయి.  సంపాదించడం ఒక ఎత్తు అయితే అందులో ఇతరులకు సాయం చేయడానికి మంచి మనసుండాలి. అనుష్క, అజిత్‌తో కలిసి నటించిన చిత్రం ఎన్నైఅరిందాల్ ఫిబ్రవరి 5 న తెరపైకి రానుం ది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో అజిత్ నుంచి ముఖ్యంగా మూడు అంశాలను తెలుసుకున్నారట. అందులో ఒకటి ఇతరులను గౌరవించడం, మరొకటి బిరియాని చేయడం. మూడవది తన కోసం శ్రమించే వారికి తగిన సాయం చేయడం, అజిత్ ఎన్నై అరిందాల్ చిత్ర షూటింగ్ సమయంలోనే తన ఇంటిలో, తోటలో పని చేసే వారికి చెన్నై తూర్పు సముద్ర తీర ప్రాంతంలో సొంత గృహాలను నిర్మించి ఇచ్చారు.

దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నటి అనుష్క తనవద్ద పని చేస్తున్న వాళ్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కట్టిస్తున్నట్లు తెలిసింది. దీని గురించి అనుష్క మాట్లాడుతూ ఒక సాధారణ యోగా టీచర్ అయిన తాను ఈ రోజు ఇంత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. తన కోసం రాత్రి, పగలు శ్రమిస్తున్న తన చుట్టూ వున్న వారు కారణమేనన్నారు. అలాంటివారి కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతోనే వారికి ఇళ్లు కట్టిస్తున్నా అని వివరించారు. తానొక నటి నన్న విషయాన్ని పక్కన పెడితే అందరిలానే అన్ని భావాలు కలిగిన సరాసరి మనిషినేనని అనుష్క పేర్కొ న్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement