కొన్ని కాంబినేషన్ చిత్రాలంటేనే ఆది నుంచే యమా క్రేజ్ పెరుగుతుంది. అలాగే ఆ చిత్రంపై అంచనాలూ పెరుగుతాయి. సరిగ్గా అలాంటి రేర్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది.

కొన్ని కాంబినేషన్ చిత్రాలంటేనే ఆది నుంచే యమా క్రేజ్ పెరుగుతుంది. అలాగే ఆ చిత్రంపై అంచనాలూ పెరుగుతాయి. సరిగ్గా అలాంటి రేర్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ఆ సూపర్ జంటే అజిత్, అనుష్క. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ అజిత్ సరసన నటి అనుష్కను నటింప జేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆమె కూడా ఈ చిత్రంలో నటించడానికి సుముఖంగానే ఉన్నారని చెప్పారు.
అయితే ఆమెకింకా కథ వినిపించలేదని ప్రస్తుతం ఆమె బాహుబలి, రుద్రమదేవి వంటి రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారని తెలిపారు. అనుష్క సన్నిహితులు మాట్లాడుతూ గౌతమ్‌మీనన్, అనుష్క కాల్‌షీట్స్ అడిగిన మాట నిజమేనని అన్నారు. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, అయితే అజిత్ సరసన నటించే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఇంకా అగ్రిమెంట్‌పై సంతకం చేయలేదని వివరించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం షూటింగ్ మార్చి నుంచి మొదలవుతుందని తెలుస్తోంది.