Enrolment Centres
-
త్వరలో మళ్లీ సీఎస్సీ ఆధార్ కేంద్రాలు?
న్యూఢిల్లీ: ఆధార్ నమోదు, సమాచారంలో మార్పులు, చేర్పులు, ఆన్లైన్ దరఖాస్తుల ఫైలింగ్‌లో ప్రజలకు సహకరించడం వంటి సేవలకు త్వరలో మళ్లీ కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ)ను అనుమతించే అవకాశం కనిపిస్తోంది. అయితే ‘నాన్–బయోమెట్రిక్’ (వేలిముద్ర అవసరం లేని)కు మాత్రమే ఈ సేవలు పరిమితమవుతాయని సమాచారం. ఈ మేరకు అనుమతులు జారీపై యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నేపథ్యం ఇదీ:ఆధార్ ఎన్రోల్మెంట్, అప్డేషన్ సేవల పునఃప్రారంభానికి తమను అనుమతించాలని సీఎస్‌ఈలను నిర్వహిస్తున్న గ్రామ స్థాయి సంస్థలు (వీఎల్ఈ) ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. తాము ఎంతో వ్యయంతో పరికరాలను కొన్నామని, ఆధార్ సంబంధ కార్యకలాపాలకు ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకున్న తరుణంలో యూఐడీఏఐ నిర్ణయం సరికాదని వీఎల్ఈలు కేంద్రానికి ఇప్పటికే విన్నవించాయి. కేంద్రం కూడా ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందిస్తోంది. 120 కోట్ల ఆధార్ కార్డుదారుల బయోమెట్రిక్ డేటా భద్రతకుగాను సీఎస్సీ అలాగే ప్రైవేటు ఆపరేటర్లపై యూఐడీఏఐ నియంత్రణలు విధించిన సంగతి తెలిసిందే. తక్కువ ఫీజుతో సీఎస్సీలకు తాజా అనుమతుల వల్ల ఆన్లైన్ వ్యవస్థతో పెద్దగా పరిచయంలేని గ్రామీణ ప్రాంతవాసులకూ ఎంతో ప్రయోజనం కలుగుతుందని యూఐడీఏఐ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. -
ఇక ఆధార్ సేవా కేంద్రాలు
సాక్షి, న్యూఢిల్లీ : పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది. ఆధార్ సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు, అప్డేట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆధార్ కార్డుల రాజ్యాంగ చెల్లుబాటుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన అనంతరం యూఐడీఏఐ ఈ మేరకు సన్నాహాలు చేపట్టింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ఆధార్ నిబంధనలున్నాయని గతంలో అప్పటి సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆధార్‌ను బ్యాంకింగ్, మొబైల్ సేవలు, స్కూల్ అడ్మిషన్లకు అనివార్యం చేయరాదని పేర్కొంది. ఆధార్‌తో పాన్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. పౌరుల ఆధార్ వివరాలను ప్రైవేట్ కంపెనీలు కోరరాదని తేల్చిచెప్పింది. ఇక ఆధార్ సేవా కేంద్రాల్లో నూతన ఆధార్ కార్డుల నమోదుతో పాటు మార్పులను కూడా చేపడతారు. ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ చేసుకుని సంబంధిత పత్రాలతో నిర్ధిష్ట తేదీ, సమయంలో హాజరై అవసరమైన సేవలు పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు. -
ఆధార్‌కు డబ్బులు మాత్రం చెల్లించకండి:యూఐడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: అన్నింటికి ఇప్పుడు ఆధార్ ఆధారంగా మారింది. సిమ్ కార్డుల దగ్గరి నుంచి బ్యాంకు ఖాతాల దాకా అన్నింటికి జత చేయాల్సిన పరిస్థితి. అలాకానీ పక్షంలో ఆయా సేవలను నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. దీంతో ఆధార్ సెంటర్లకు ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటూ పలువురు అవినీతికి పాల్పడుతున్నారు. ఆధార్ కార్డుల దరఖాస్తుల పేరిట పెద్ద ఎత్తున్న వసూళ్లకు పాల్పడుతున్న దృశ్యాలు అనేకం దేశ రాజధానిలో వెలుగు చూశాయి. సాధారణంగా ఆధార్ సమాచారం అప్ డేట్ కోసం.. అందులో మార్పులు.. చేర్పుల కోసం అధికారికంగా నిర్ణయించిన ఫీజు 25 రూపాయలు.. కానీ, తన దగ్గరి నుంచి 200 రూపాయలు వసూలు చేస్తారని చెబుతున్నారు లాల్ కౌన్ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ. జంగ్‌పూరకు చెందిన ఆర్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్థానికంగా ఉండేరో సైబర్ కేఫ్ నిర్వాహకుడి దగ్గర ఆధార్ నమోదు కేంద్రం అనుమతులు కూడా ఉన్నాయి. దీంతో ఎడా పెడా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడు. ఆర్తి ఆధార్ లేకపోవటంతో అతన్ని సంప్రదించంగా 500 రూపాయలు వసూలు చేశాడు. ఆర్తి, లక్ష్మీలే కాదు ఆధార్ పూర్తి ఉచితం అన్న విషయం తెలీక చాలా మంది ఇలా ఆధార్ సెంటర్లలో డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ, రాకేష్ మాత్రం అలా కాదు. ఆధార్ సభ్యత నమోదు ఫ్రీ అని అతనికి తెలుసు. అందుకే 150 రూపాయలు నిర్వాహకుడు డిమాండ్ చేస్తే.. వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి ధృవీకరించి వెంటనే తన ఆధార్‌ను ధరఖాస్తు చేసుకున్నాడు. వెంటనే అతను ఇచ్చిన ఫిర్యాదుతో ఆ నిర్వాహకుడి కేంద్రానికి అనుమతి రద్దు చేసేశారు. ఇలా ఆధార్ కోసం డబ్బులు వసూలు చేయటం సన్నివేశాలు ఒక్క ఢిల్లీలోనే కాదు... దేశవ్యాప్తంగా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఇలా అవినీతికి పాల్పడిన విషయాలు తమ పరిధిలోకి వస్తే అధికారిక కేంద్రాల లైసెన్సు రద్దు చేయటంతోపాటు వారికి జరిమానా కూడా విధించినట్లు యూఐడీఏఐ చెబుతోంది. 2016 నుంచి ఇప్పటిదాకా 5871 మంది ఆపరేట్లపై ఫిర్యాదు అందటంతో వారిపై చర్యలు తీసుకున్నామని యూఐడీఏఐ చీఫ్ డాక్టర్ అజయ్ భూషణ్ పాండే చెబుతున్నారు. ఒకవేళ ఆధార్ ఎన్రోల్మెంట్ పేరిట ఎవరైనా ఛార్జీలు వసూలు చేస్తే వెంటనే @uidai.gov.in కి మెయిల్ చేయటంగానీ లేదా 1947 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని పాండే సూచిస్తున్నారు.