Enter In to Politics
-
రాజకీయాల్లోకి తమిళ నటుడు విజయ్?
చెన్నై: తమిళ నటుడు దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకుగాను త్వరలోనే కొత్తగా రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. చెన్నైలో గురువారం జరిగిన విజయ్ అభిమానుల సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’సర్వసభ్య సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. విజయ్ అధ్యక్షతన ఏర్పాటయ్యే పార్టీకి నియమ నిబంధనలను ఖరారు చేసే అధికారం కూడా ఈ సమావేశం విజయ్‌కే వదిలేసింది. నెలలోగా పార్టీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. తమిళనాడుతోపాటు కేరళలోనూ విజయ్‌కు భారీగా అభిమానులున్నారు. ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ విజయ్ అభిమానుల సంఘం పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానంటూ గతంలోనే ఆయన ప్రకటించారు. -
ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ
-
ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది... లేనిది త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నం శివారులోని సింహచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీపై త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. మరో రెండు రోజులలో ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సమావేశమై చర్చిస్తానన్నారు. అనంతరం ఏ సంగతి ప్రకటిస్తాన్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో బాలకష్ణ మంగళవారం ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. బాలకృష్ణ వెంట విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఉన్నారు.