entertainment news
-
గంగవ్వ ఇమిటేట్ చేసిన బిత్తిరిసత్తి
-
నేను ఇన్స్పిరేషన్ తో రాసిన నొవెల్స్ అవి.. కాపీ కొట్టి కాదు
-
మేము అందరమూ కలిసే ఉంటాం అంటున్న కాజల్
-
రణ్‌బీర్‌కు ఆల్రెడీ చెప్పా.. ఒకవేళ కాదు అంటే అప్సెట్ అవుతా..
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సోమవారం ఓ ఆసక్తి విషయాన్ని వెల్లడించింది. తన భర్త రణ్‌బీర్ కపూర్ దర్శకత్వం వహించబోయే సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని చెప్పింది. ఒకవేళ అందుకు రణ్‌బీర్ ఒప్పుకోకపోతే అప్సెట్ అవుతానని పేర్కొంది. ఈవిషయంపై ఇప్పటికే తన భర్తతో చర్చించినట్లు తెలిపింది. ఆలియా భట్ నటిస్తూ తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డార్లింగ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆలియా బదులిచ్చింది. తాను దర్శకత్వం విభాగంలో అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు, కరోనా టైంలోనే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు రణ్‌బీర్ ఇటీవల షంషేరా మూవీ ప్రమోషన్స్ సందర్భంగా వెల్లడించాడు. రచయితలను సంప్రదించి కథకు మెరుగులు దిద్దాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్ దర్శకత్వం వహించబోయే సినిమాలో మీరు ఉంటారా? అని ఆలియాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ.. ఈ విషయంపై రణ్‌బీర్‌తో ఇంతకుముందే మాట్లాడానని, నటిగా కాకపోయినా నిర్మాతగానైనా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పింది. అందుకు రణ్‌బీర్ కూడా ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో నన్ను కాదని సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్ -
వచ్చేస్తున్నాడు తొలి సూపర్ సోల్జర్..
-
ఊహించినట్లే జరిగింది..!
న్యూఢిల్లీ: ‘నేను అనుకున్నంతా అయ్యింది.. ‘మర్దానీ’ సినిమా చేసినప్పుడు నా పాత్రను చూసి అమ్మాయిలందరూ నన్ను ద్వేషిస్తారని భావించా.. సినిమా విడుదలయ్యాక నేను ఊహించినట్లే జరిగింది..’ అని మర్దానీ సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి ఆరంగేట్రం చేసిన ఢిల్లీ వాసి తాహిర్ రాజ్ బాసిన్ తెలిపాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ టైటిల్ పాత్ర పోషించింది. ఇందులో ఆమె పవర్ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించగా అమ్మాయిల అక్రమ రవాణా వ్యాపారం చేసే దుర్మార్గమైన వ్యక్తిగా 27 యేళ్ల తాహిర్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద మంచి టాక్ సంపాదించింది. దీనిపై తాహిర్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ ఈ సినిమా చేసేటప్పుడు నా పాత్ర స్వభావం చూసి అమ్మాయిలు నన్ను అసహ్యించుకుంటారని భావించా.. అయితే అమ్మాయిలు అందులో నా స్టైల్‌ను మాత్రం ఇష్టపడ్డారు..’ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా బాగున్నానని సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ట్విటర్లో ట్వీట్ చేయడం నాకు అవార్డు వచ్చినంత ఆనందం ఇచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో నటించేందుకు మొదట చాలా ఇబ్బంది పడ్డానని ఆయన అన్నాడు. ప్రధాన పాత్రలో సీనియర్ నటి రాణీ ముఖర్జీ నటిస్తుండటంతో ఆమెతో స్క్రీన్‌ను పంచుకోవడానికి కొంచెం తడబడ్డానని తెలిపాడు. ఆమె సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆమెతోనే నటించడమనేసరికి ఒకరకమైన ఒణుకు వచ్చిందని నవ్వుతూ చెప్పాడు. అయితే రాణి మాత్రం తనకు అన్నివిధాల మద్దతు ఇచ్చిందని, తనను కొత్త నటుడుడి చూడలేదని దాంతో త్వరలోనే మామూలుగానే నటించగలిగానని తాహిర్ అన్నాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో పాత్ర సంపాదించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని తాహిర్ వివరించాడు. నాలుగేళ్లుగా తాను ముంబైలో ఉంటూ సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్నానని, అందులో భాగంగా రెండేళ్ల కిందట యశ్‌రాజ్ ఫిల్మ్స్ కాస్టింగ్ డెరైక్టర్ షనూ శర్మను కలిసి తన ఫొటోలు చూపించానన్నాడు. కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఈ సినిమాలో అవకాశం కోసం స్క్రీన్ టెస్ట్‌కు రావాలని ఆమెనుంచి ఆహ్వానం అందిందని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అప్పటికే సుమారు 200 మందికిపైగా లైన్లో ఉన్నారని వివరించాడు.. చివరికి ఆ పాత్ర తనను వరించడం ఆనందంగా ఉందన్నాడు. బాలీవుడ్లో విలన్ పాత్రతో కెరీర్‌ను ప్రారంభించడంపై ఆయన మాట్లాడుతూ.. దానిపై తనకు ఎటువంటి బాధ లేదన్నాడు. ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న విలన్ పాత్రధారులెవరూ నేను చేసిన పాత్రను చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. అంత నీచమైన నేరప్రవృత్తిగల ఒక శాడిస్టు పాత్ర కాబట్టే నటించడానికి చాలా అవకాశం లభించింది. మున్ముందు కూడా ఇలాంటి పాత్రలొస్తే చాలెంజ్‌గా తీసుకుని నటిస్తాను..’ అని ముక్తాయించాడు. -
మేరీ కోమ్ మూవీ స్టిల్స్
-
పాత్రలో లీనమైపోయా
ముంబై: ‘మేరీ కోమ్’ పాత్రలో తాను లీనమైపోయానని, ఒకవేళ ఇదికనుక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడితే తన హృదయం గాయపడుతుందని బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా చెప్పింది. ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీకోమ్ జీవిత గాధను ‘మేరీకోమ్’ సినిమాగా రూపొందుతోంది. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఈ పాత్రకు తగు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశా. జీవితంలో అత్యంత విషాదం తనను ముట్టిన సమయంలో షూటింగ్లో పాల్గొన్నా. మా నాన్నగారు చనిపోయిన నాలుగురోజుల తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నా బాధంతా ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి రోజూ నాకో సవాలువంటిది. నా ఆత్మలో కొంతభాగం ఇందులోకి వెళ్లిపోయింది. ఇంటికెళ్లిన ప్రతిరోజూ ఈ సినిమా చేయగలనో లేదోనంటూ అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని. అయితే మరుసటి రోజు మాత్రం ఎప్పటిమాదిరిగానే షూటింగ్‌కు వెళ్లిపోయేదాన్ని’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మేరీకోమ్‌ను తలపించేరీతిలో మారేందుకుగాను ప్రియాంకచోప్రా ప్రతిరోజూ ఎంతో శ్రమించేది. వాకింగ్, రన్నింగ్, బాక్సింగ్ వంటి వాటిని సాధన చేసేది. ఒముంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఈ సినిమా నాకు అత్యంత ప్రత్యేకమైనది. వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఇష్టపడను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడదని ఆశిస్తున్నా. ఈ సినిమా ఇతివృత్తం నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నా’అని తెలిపింది. కాగా ఈ సినిమాపై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం చేస్తోంది. టొరంటోలో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఈ నెల నాలుగో తేదీన హాజరు కానుంది. కాగా మేరీ కోమ్ సినిమా ఈ నెల ఐదో తేదీన విడుదల కానుంది. -
స్వాతంత్య్ర దినోత్సవంపై బాలీవుడ్
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ అమితాబ్ సహా బాలీవుడ్ ప్రముఖులు జాతిజనులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్మాత శేఖర్‌కపూర్ మాట్లాడుతూ సంవత్సరంలో ఏదో ఒక్కరోజును కాకుండా కచ్చితంగా ప్రతిరోజునూ స్వాతంత్య్రదినోత్సవంగా పరిగణించాలన్నాడు. ‘ఇదొక సంఘటన కాదు. ఇదొక నిరంతర పరిణామం. ఒక దేశం ఎప్పటికీ స్వతంత్రం కాబోదు. అందులోని ప్రజలకు మాత్రమే స్వతంత్రం లభిస్తుంది’ అని అన్నాడు. నటి ప్రీతి జింతా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు’అని అమితాబ్ ట్వీట్ చేశాడు. ‘జై భారతి. వందే భారతి’ అంటూ లతా మంగేష్కర్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ శుభాకాంక్షలు. జైహో’ అని నటదర్శకురాలు ఫర్హాన్‌ఖాన్ పేర్కొన్నారు. నిర్మాత మాధుర్ భండార్కర్ మాట్లాడుతూ దేశంలో శాంతిసౌభ్రాతృత్వాలు పరిఢవించాలంటూ అభిలషించారు. వందేమాతరం అని పేర్కొన్నారు. గాయని ఆశా భోస్లే ‘జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. నటి అనుష్కశర్మ దేశసేవలో తరిస్తున్న జవానులనుఅభినందించారు. సహభారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వేషం, భయాలను వంటి వాటినుంచి ఇకనైనా స్వాతంత్రం పొందాలంటూ సంగీత దర్శకుడు విశాల్ డఢ్లాని దేశప్రజలకు సూచించారు. అదే నిజమైన స్వాతంత్య్రమంటూ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ తమ మనసులను కూడా స్వేచ్ఛగా ఉంచుకోవాలన్నారు. ఇంకా సుజయ్‌ఘోష్, ఆనంద్‌రాయ్, దియామీర్జా, వీర్‌దాస్, షాహిద్‌కపూర్, సంగీత దర్శకుడు శేఖర్ రవిజైని తమ తమ అభిమానులకు 68వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. -
దత్పుత్రుడా!
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు వరుసగా పెరోల్ ఇవ్వడంపై బీజేపీ మండిపడింది. ఆయనేమైనా అతిథి ఖైదీనా అని ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నాయకుడు కిరీట్ సోమయ్య ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు లేఖ రాశారు. సంజయ్ దత్‌కు ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారని, గత 50 ఏళ్లలో శిక్ష పడిన ఏ వ్యక్తికి ఈ విధంగా వరుస పెరోల్‌లు మంజూరు చేయడం ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో అరెస్టయిన మిగతా ఖైదీలు కూడా వరుసగా పెరోల్ ఇవ్వాలని అడిగితే ఏమి చేస్తారని ప్రశ్నించారు. కాగా, మార్చి 21 వరకు దత్‌కు పెరోల్‌కు అనుమతి ఇవ్వడంతో మండలి ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే మంగళవారం రాత్రి మండిపడ్డారు. ఎంతో మంది ఖైదీలు పెరోల్ కావాలని దరఖాస్తు చేసుకుంటున్నా తిరస్కరణకు గురవుతున్నాయన్నారు. దత్‌ను మాత్రమే ప్రత్యేకంగా చూడటమే సమాజంలోకి తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందని తెలిపారు. దత్ సోదరి ప్రియాదత్ కాంగ్రెస్ ఎంపీ అయినందువల్లే ఆయనకు వరుసగా పెరోల్లకు అనుమతి లభిస్తోందనే విషయం సామాన్యులకు కూడా అర్థమైపోతుందన్నారు. 1993 మార్చి ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటడు సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు అయిన సంగతి తెలిసిందే. గత నెలలో కాలేయ సంబంధిత రోగంతో బాధపడుతున్న దత్ భార్య మాన్యతకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇదేమి న్యాయం: ఉద్ధవ్‌ఠాక్రే సాక్షి, ముంబై: 1993లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు తరచూ పెరోల్ గడువు పొడిగించడంపై శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఘాటుగా స్పందించారు. ‘మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వీ ప్రజ్ఞాసింగ్, కర్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఇంతవరకు నేరం రుజువు కాలేదు. కనీసం వీరిపై విచారణ కూడా ప్రారంభం కాలేదు. అయినా వారు గత ఐదేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నారు. కానీ సంజయ్ దత్‌పై నేరం రుజువయ్యాక యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పటికీ తరచూ పెరోల్‌పై ఎలా విడుదల చేస్తున్నార’ని పార్టీ అధికార దినపత్రిక సామ్నాలో తీవ్ర విమర్శ లు చేశారు. నేరస్తుడు నేరస్తుడే, వారిని కులం, మతం అనే భేదంతో చూడవద్దని, న్యాయం అందరికీ సమానంగా జరిగేలా చూడాలని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్‌ను జైలు సూపరింటెండెంట్ నాలుగు పర్యాయాలు పెరోల్‌పై విడుదల చేశారు. ప్రభుత్వం అండలేనిదే జైలు అధికారులు అలా విడుదల చేయడానికి సాహసించరని వ్యాఖ్యానించారు. దత్‌కు ఒక రకమైన న్యాయం, ప్రజ్ఞాసింగ్, పురోహిత్లకి మరో రకమైన న్యాయమా..? అని నిలదీశారు. ఇదిలాఉండగా ముస్లిం యువకులను అనవసరంగా వేధించవద్దని ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ మండిపడ్డారు. ప్రజ్ఞాసింగ్, పురోహిత్ల సంగతేంటి..? వీరి తరఫున వాదించేదెవరూ...? అని ఉద్ధవ్‌ఠాక్రే నిలదీశారు. నిబంధనల ప్రకారమే పెరోల్: సీఎం ముంబై: 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజయ్ దత్‌కు పెరోల్ పొడిగింపును ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సమర్థించారు. అంతా చట్ట ప్రకారం జరిగిందని, ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని చవాన్ బుధవారం మీడియాకు తెలిపారు. దీని వెనుక ఎలాంటి రాజకీయం లేదని వివరించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న భార్య మాన్యతను చూసుకునేందుకు మరో నెల రోజుల పాటు పెరోల్ పొడిగించాలని సంజయ్ దత్ పెట్టుకున్న దరఖాస్తుకు పుణే జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ ఆరున పెరోల్‌పై బయటకు వచ్చిన సంజయ్ దత్ భార్య మాన్యత ఆరోగ్యం సరిగా లేదని మరో నెల రోజులు పాటు పెరోల్‌పై బయటే ఉన్నారు. తాజాగా మళ్లీ దత్‌కు పెరోల్ లభించడంపై రాజకీయ విమర్శలు ఎక్కువయ్యాయి. కాగా, యెరవాడ జైలు సూపరింటెండెంట్, పుణే డివిజనల్ కమిషనర్ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని బాంబే హైకోర్టులో మంగళవారం దాఖలు చేసిన పిల్ ఈ నెల 25న విచారణకు రానుంది.