గార్డులు లేని గూడ్స్ రైళ్లు రాబోతున్నాయ్!
న్యూఢిల్లీ: సరకు రవాణా రైలు చివరి బోగీలో ఇక గార్డులు కనిపించరేమో. ప్రస్తుత మున్న విధానంలో మార్పులు చేసేందుకు రైల్వే శాఖ కొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎండ్ ఆఫ్ ట్రైన్ టెలిమెట్రీ(ఈఓటీటీ)గా పిలిచే పరికరాన్ని ఆఖరి బోగీలో అమరుస్తారు. ట్రాన్స్మిటర్ను లోకోమోటివ్‌కు బిగిస్తారు. రైలు నడుస్తున్నపుడు అంతా సవ్యంగానే ఉందని తెలిపేలా నిరంతరం ఈ రెండింటి మద్య సమాచార మార్పిడి జరుగుతుంది. సమాచార అంతరాయం కలిగితే డ్రైవర్‌కు సంకేతం అందుతుంది.
తదనుగుణంగా రైలును అపి విడిపోయిన బోగీలను తిరిగి కలపడం లేదా ఇతర పునరుద్ధరణ పనులు చేసే వీలుంటుంది. ఈఓటీటీ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉందని రైల్వే రోలింగ్ స్టాక్ సభ్యుడు హేమంత్ కుమార్ తెలిపారు. తొలిదశలో రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ఇలాంటి పరికరాలు వేయి కొనుగోలుచేసే ప్రాజెక్టుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది.