ఈపీఎఫ్‌పై 8.8% వడ్డీ!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ డిపాజిట్లపై 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ రేటును కొనసాగించేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. 4 కోట్లకు పైగాగల చందాదారులకు సంబంధించిన ఈ వ్యవహారంపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆర్థిక మంత్రిని కలిశారు. అయితే 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌వో నిర్ణాయక బోర్డు (సీబీటీ) సూచన మేరకు వడ్డీని 8.8 శాతంగాకాక, 8.7 శాతంగా కేంద్రం తొలుత నిర్ణయించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళనలకు దిగడంతో వడ్డీని 8.8 శాతంగా నిర్ణయించారు. ఈసారి అలాంటి ఆందోళనకు తావులేకుండా చేయాలని భావించి, ముందస్తుగా ఆర్థిక శాఖ అనుమతి పొందాలని భావిస్తున్నారు.