Equitable development
-
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
‘2047 నాటికి వికాస్ భారత్’ తథ్యం
న్యూఢిల్లీ/గాంధీనగర్: సమాన, సమ్మిళిత అభివృద్ధిని సాధించే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి విషయంలో భారత్ నూతన శకంలోకి ప్రవేశిస్తోందంటూ వెలువడిన పలు నివేదికలను ఆయన ప్రస్తావించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందంటూ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ శుక్రవారం లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ రీసెర్చ్, జర్నలిస్టు అనిల్ పద్మనాభన్ విడుదల చేసిన నివేదికల గురించి ప్రస్తావించారు. గత తొమ్మిదేళ్లలో ప్రజల ఆదాయం భారీగా పెరిగినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయని వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు(ఐటీఆర్) దాఖలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని గుర్తుచేశారు. ఉత్తరప్రదేశ్‌లో 2014 జూన్‌లో 1.65 లక్షల ఐటీఆర్‌లు దాఖలు కాగా, 2023 జూన్‌లో 11.92 లక్షల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని వివరించారు. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ లాంటి చిన్నరాష్ట్రాల్లోనూ ఐటీఆర్‌ల సంఖ్య తొమ్మిదేళ్లలో 20 శాతం పెరిగిందన్నారు. దేశ ఉమ్మడి ప్రయత్నాలనే కాదు, దేశ శక్తిసామర్థ్యాలను సైతం ఈ నివేదికలు బహిర్గతం చేస్తున్నాయని ప్రధానమంత్రి వివరించారు. ‘2047 నాటికి వికాస్ భారత్’ అనే లక్ష్యాన్ని మనం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరో హెల్త్ ఎమర్జెన్సీకి సిద్ధం కావాలి ప్రజల సంక్షేమం కోసం నవీన ఆవిష్కరణలను, సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ సూచించారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాం«దీనగర్‌లో జరిగిన జీ20 దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధం కావాలని చెప్పారు. గడువు కంటే ముందే భారత్‌లో ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని(టీబీ) పూర్తిగా అరికట్టబోతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాలు ఒక ఉమ్మడి వేదికపై రావాలని ఆకాంక్షించారు. డిజిటల్ విధానాలు, నూతన ఆవిష్కరణలతో ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి నుంచి పాఠాలు నేర్చుకోవాలని, అలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజా ఉద్యమంగా అభివృద్ధి కార్యక్రమాలు న్యూఢిల్లీ: దేశంలో అభివృద్ధి కార్యక్రమాలను ఒక ప్రజా ఉద్యమంగా నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి చెందిన జిల్లా పంచాయతీ సభ్యులకు పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్‌ను సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, ఇందుకోసం ప్రతి గ్రామంలో, ప్రతి తహసీల్ పరిధిలో, ప్రతి జిల్లాలో అభివృద్ధి దీపం వెలిగించాలని ఉద్బోధించారు. శుక్రవారం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల బీజేపీ స్థానిక సంస్థల సభ్యులు పాల్గొన్న ‘క్షేత్రీయ పంచాయతీరాజ్ పరిషత్’ శిక్షణా కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్ అనేది కేవలం ఒక నినాదం కాదని, ప్రతిక్షణం ప్రగతి కోసం, ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. స్థానిక సంస్థల్లో వేర్వేరు హోదాల్లో ఉన్నవారు గ్రామాలు, జిల్లాల్లో పనులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని అన్నారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేయాలని వివరించారు. స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు పెరుగుతోందని, వనరుల కొరత లేదని వెల్లడించారు. గ్రాంట్ కింద గతంలో రూ.70,000 కోట్ల కేటాయింపులు జరిగేవని, ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకుపైగానే ఇస్తున్నారని తెలిపారు. దేశంలో తమ ప్రభుత్వం వచ్చాక 30,000కుపైగా జిల్లా పంచాయతీ భవనాలు నిర్మించామని గుర్తుచేశారు. ఉపాధి హామీ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించాలని కోరారు. ‘పీఎం విశ్వకర్మ’ను విజయవంతం చేయాలి బీజేపీ స్థానిక సంస్థల సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి మరిన్ని వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇవి ఎన్నికల్లో గెలవడానికి కాదని, 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవడానికేనని స్పష్టం చేశారు. ‘పీఎం విశ్వకర్మ’ పథకాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని కోరారు. గ్రామాల్లో సంప్రదాయ వృత్తిదారులను గుర్తించాలని, అర్హులతో జాబితాలు తయారు చేయాలని అన్నారు. సంప్రదాయ వృత్తిదారులు గ్రామాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వారు తమ పనులను సామాజిక బాధ్యతగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సంప్రదాయ వృత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయిస్తున్నామని తెలిపారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని సెపె్టంబర్ 17న ప్రారంభిస్తామని మోదీ పునరుద్ఘాటించారు. -
వీరి కుటుంబానికి కులం... మతం లేవు..!
తిరుపత్తూర్‌లో ప్రముఖ న్యాయవాది ఆమె. దేశంలో కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మహిళ. దీనిపై ఆమె పోరాటం దేశానికి మార్గదర్శకం చేసింది. ఆదేంటో చూడాలంటే తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూర్... ఆనంత కృష్ణన్, మణిమొళి దంపతులకు పెద్ద కుమార్తె ఆమె. పోలీసులచే చిత్రహింసలకు గురై, వారికి వ్యతిరేకంగా పోరాడి జైల్లోనే ప్రాణాలు విడిచిన స్నేహలతకు గుర్తుగా ఆమెకు స్నేహ అని పేరు పెట్టారు. ఆమె తన ఇంటిపేరుగా తల్లి పేరులోని మొదటి అక్షరం ఎం, తండ్రి పేరులోని మొదటి అక్షరం ఏ రెండు కలిపి ఎంఎ.స్నేహ అయ్యింది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పుడు మొదటిసారి నీది ఏ క్యాస్ట్? అని అడిగారు. నాకు కులం లేదని మా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పిందామె. పోనీ మతం అయినా చెప్పమన్నారు. ‘మాకు కులం, మతం లేవని చెప్పారు మా తల్లిదండ్రులు’ అని సమాధానం ఇచ్చిందామె. అలా మొదలైన స్నేహ జీవితంలో పాఠశాల, కళాశాల వరకు ఎక్కడా కులం, మతం అనే ఆప్షన్ లేదు. ఆమె సోదరీమణులు ముంతాజ్, జెన్నిఫర్ కూడా అలాగే కులం, మతం అనే ఆప్షన్ లేకుండా విద్యాభ్యాసం ముగించారు. కుల, మతభేదాలు లేకుండానే పార్తిపరాజాతో ఆమెకు వివాహం జరిగింది. ఆమె పిల్లలు నజ్రీన్, ఆతిల జరీన్, ఆరీఫా జోసిలకు కూడా కులమతాలు అంటకుండా పెంచుతున్నారు. కులం, మతం అంటూ కొట్టుకునే ఈ సమాజానికి స్నేహ దంపతులు మార్గదర్శకులుగా నిలిచారు. కులాలు, మతాలతో కొట్టుకునే ఈ సమాజానికి భిన్నంగా అవేవీ వారికి లేవని నిరూపించుకునే ప్రయత్నంలో వారు తమకు కులం, మతం లేవనే ప్రభుత్వ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధికారులు పలుమార్లు వారిని నిరాశపరిచారు. వారు ఫలానా మతం, ఫలానా కులం అంటూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రభుత్వాలు, అధికారులు, వారు ఏ కులానికీ, మతానికీ చెందిన వారు కాదనే సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరనే న్యాయపోరాటం ప్రారంభించారు స్నేహ దంపతులు. అలా అలుపెరగకుండా వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఆర్డీవో ఆదేశాల మేరకు తిరుపత్తూర్ తహసీల్దారు సత్యమూర్తి స్నేహ కుటుంబం ఏ కులానికీ, మతానికి చెందినవారు కాదంటూ సర్టిఫికెట్ అందచేయటం కొసమెరుపు. అలా స్నేహ దంపతులు తాము ఏ కులానికో, మతానికో చెందినవారం కాదని, తమది మానవజాతి అంటూ ప్రభుత్వ పత్రం పొందిన మొదటి కుటుంబంగా రికార్డులకెక్కారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి: చంద్రబాబు
-
అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో ఈ సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేశారు. పరిపాలనలో వికేంద్రీకరణ పాటిస్తామని చెప్పారు. నెలలో మూడు సార్లు, మూడు చోట్ల మంత్రి మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మొదట గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణస్వీకారం చేశామన్నారు ఆ తరువాత విశాఖపట్నంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సారి కర్నూలులో సమావేవం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి నెల 5,10,20 తేదీలలో మంత్రి మండలి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలు కేంద్రానికి వివరించినట్లు తెలిపారు. విభజన వల్ల వచ్చిన నష్టాలు తెలిపినట్లు చెప్పారు. అందరి సహకారంతో ముందుకుపోవాలన్నారు. భవిష్యత్‌లో అందరు కలసి పనిచేయాలన్నారు. ఆ క్రమంలో ఆరు అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి శ్వేతపత్రం పవర్ సెక్టార్‌పై విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆధుని సమాజంలో పవర్ చాలా ముఖ్యమైనదన్నారు. గత పదేళ్లలో విద్యుత్ రంగం క్షీణించిందన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏపిపై విద్యుత్ తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. జవాబుదారీతనంలేదన్నారు. 17,200 కోట్ల రూపాయల నష్టాల్లో విద్యుత్ డిస్కంలు ఉన్నట్లు తెలిపారు. తమ హయాంలో రూ.1,500 కోట్ల ఛార్జీలు పెంచితే, గత ప్రభుత్వం రూ. 28,835 కోట్ల ఛార్జీలు పెంచినట్లు వివరించారు. ఇప్పుడు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని, తాము నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. కానీ ఛార్జీలు పెంచం అని చెప్పలేం అన్నారు. విభజన అనంతరం విద్యుత్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని చెప్పారు. తమ అవసరాలు తీరాక మిగిలిన విద్యుత్ తెలంగాణకే అన్నారు. కృష్ణా జలాల విడుదలపై కావాలనే వివాదం చేస్తున్నారని విమర్శించారు. చట్టప్రకారం 10 టిఎంసిల నీరు ఇవ్వాల్సిందేనన్నారు. హైదరాబాద్‌లో కూల్చివేతల తీరు పట్ల చంద్రబాబు అభ్యంతరకరం వ్యక్తం చేశారు. హామీలు నిలబెట్టుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయవలసి ఉందని చంద్రబాబు చెప్పారు.