అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి: చంద్రబాబు | Equitable development of all areas: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి: చంద్రబాబు

Published Wed, Jul 2 2014 5:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. లేక్వ్యూ అతిథి గృహంలో ఈ సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేశారు. పరిపాలనలో వికేంద్రీకరణ పాటిస్తామని చెప్పారు. నెలలో మూడు సార్లు, మూడు చోట్ల మంత్రి మండలి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మొదట గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ప్రమాణస్వీకారం చేశామన్నారు ఆ తరువాత విశాఖపట్నంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సారి కర్నూలులో సమావేవం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి నెల 5,10,20 తేదీలలో మంత్రి మండలి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికి రెండు సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర సమస్యలు కేంద్రానికి వివరించినట్లు తెలిపారు. విభజన వల్ల వచ్చిన నష్టాలు తెలిపినట్లు చెప్పారు.

అందరి సహకారంతో ముందుకుపోవాలన్నారు. భవిష్యత్లో అందరు కలసి పనిచేయాలన్నారు. ఆ క్రమంలో ఆరు అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి శ్వేతపత్రం పవర్ సెక్టార్పై విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆధుని సమాజంలో పవర్ చాలా ముఖ్యమైనదన్నారు.  గత పదేళ్లలో విద్యుత్ రంగం క్షీణించిందన్నారు. రాష్ట్ర విభజన వల్ల  ఏపిపై విద్యుత్ తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. జవాబుదారీతనంలేదన్నారు.

17,200 కోట్ల  రూపాయల నష్టాల్లో విద్యుత్ డిస్కంలు ఉన్నట్లు తెలిపారు.  తమ హయాంలో రూ.1,500 కోట్ల ఛార్జీలు పెంచితే, గత ప్రభుత్వం రూ. 28,835 కోట్ల ఛార్జీలు పెంచినట్లు వివరించారు. ఇప్పుడు విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని, తాము  నాణ్యమైన విద్యుత్ అందిస్తామని చెప్పారు. కానీ ఛార్జీలు పెంచం అని చెప్పలేం అన్నారు. విభజన అనంతరం విద్యుత్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని చెప్పారు. తమ  అవసరాలు తీరాక మిగిలిన విద్యుత్ తెలంగాణకే అన్నారు. కృష్ణా జలాల విడుదలపై కావాలనే వివాదం చేస్తున్నారని విమర్శించారు. చట్టప్రకారం 10 టిఎంసిల నీరు ఇవ్వాల్సిందేనన్నారు. హైదరాబాద్లో కూల్చివేతల తీరు పట్ల చంద్రబాబు అభ్యంతరకరం వ్యక్తం చేశారు.

హామీలు నిలబెట్టుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయవలసి ఉందని చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement