విద్యుదాఘాతంతో యువకుడి మృతి
నార్పల (శింగనమల) : నార్పల మండలం బి.పప్పూరుకు చెందిన ఎరికల శివయ్య (26) విద్యుదాఘాతంతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌ను మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని కాపాడబోయిన తల్లిదండ్రులు లక్ష్మినారాయణమ్మ, రాజన్న, భార్య అశ్వని స్వల్పంగా గాయపడ్డారు.
విద్యుదాఘాతానికి గురైన శివయ్యను హూటాహుటిన 108లో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాంప్రసాద్ కేసు నమోదు చేశారు.