Europe market
-
5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్, ఫీచర్లతో అదరగొడుతున్నాయ్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ మోడల్ గెలాక్సీ ఎ - 22 5జీ యురేపియన్ మార్కెట్లో విడుదలైంది. త్వరలోనే ఈ ఫోన్లు ఇండియన్ మార్కెట్ లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం యురేపియన్ మార్కెట్ లో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ ఫీచర్స్ ఇలా ఉన్నాయి శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జీ లో 6.6-అంగుళాల పొడవు. హెచ్డి + డిస్ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంది.పేరులేని డ్రాగన్ ఆక్టా కోర్ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 700 అని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ ఇంటర్నల్ స్టోరేజే తో 1టెరాబైట్ మైక్రో ఎస్డీ కార్డ్ ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5జి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 1.8 లెన్స్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్, ఎఫ్ / 2.2 లెన్స్, 5 మెగాపిక్సెల్ సెన్సార్, ఎ F / 2.4 లెన్స్ 2-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో ఫోన్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌తో పాటు ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో వస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎ 22 5జీ ధర ఎంతంటే గ్రే, మింట్, వైలెట్, వైట్ కలర్ లలో అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ225జీ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న బేస్ మోడల్ కోసం శాంసంగ్ గెలాక్సీ ఏ 22 5 జీ యూరో 229 (సుమారు రూ. 20,300) వద్ద ప్రారంభమవుతుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 249 (సుమారు రూ .22,100). ఈ ఫోన్‌ను 6 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటి ధర ఎంత అనేది శాంసంగ్ నిర్ధారించలేదు. చదవండి : Realme C21y : రియల్ మీ సిరీస్ ఫీచర్స్ ఇలా.. -
అద్భుత ఫీచర్లతో ఒప్పో స్మార్ట్ఫోన్లు లాంచ్
న్యూఢిల్లీ : మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్ఎక్స్17 నియో, ఆర్ఎక్స్ 17 ప్రొ స్మార్ట్ఫోన్లను తాజాగా యూరప్ మార్కెట్లో విడుదల చేసింది. భారీ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర అద్భుత ఫీచర్లను వీటిల్లో జోడించింది. అయితే భారత మార్కెట్లో ఎపుడు అందుబాటులోకి వచ్చేది స్పష్టత లేదు. ఒప్పో ఆర్ఎక్స్17 నియో ఫీచర్లు 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 16 +2 మెగాపిక్సల్ డ్యుయ రియర్ కెమెరాలు 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3600 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 29వేలు ఒప్పో ఆర్ఎక్స్17 ప్రొ ఫీచర్లు 6.41 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 20+12 మెగాపిక్సల్ డ్యుయ రియర్ కెమెరాలు 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : సుమారు రూ. 49,800 -
12 శాతం తగ్గిన అరబిందో లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో అరబిందో ఫార్మా నికరలాభం క్రితంతో పోలిస్తే 12% తగ్గి రూ.455.7 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు 15.5 శాతం అధికమై రూ.4,250 కోట్లకు ఎగసింది. ఎబిటా 18.3%గా ఉంది. యూఎస్, యూరప్ మార్కెట్ జోష్ కంపెనీకి తోడైంది. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 11.5 శాతం అధికమై రూ.1,890 కోట్లు, యూరప్ ఫార్ములేషన్ విక్రయాలు 30.7 శాతం వృద్ధితో రూ.1,199 కోట్లు నమోదైంది. ఏపీఐల విక్రయం ద్వారా రూ.748 కోట్లు సమకూరింది. పరిశోధన, అభివృద్ధికి రూ.169 కోట్లు వ్యయం చేశారు. యూఎస్ఎఫ్డీఏ నుంచి 13 ఏఎన్‌డీఏలకు తుది, 3 ఏఎన్‌డీఏలకు తాత్కాలిక అనుమతులు దక్కించుకుంది. కొన్ని రకాల ఉత్పాదన సంబంధ నిబంధనల మూలంగా లాభంపై ప్రభావం చూపిందని అరబిందో ఫార్మా ఎండీ ఎన్.గోవిందరాజన్ వ్యాఖ్యానించారు. -
నష్టాలతో బోణీ..
♦ ఆసియా, యూరప్ మార్కెట్ల క్షీణత ప్రభావం ♦ సెన్సెక్స్‌కు 72 పాయింట్ల నష్టం కొత్త ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఆసియా, యూరోప్ మార్కెట్ల పతన ప్రభావంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కారణంగా శుక్రవారం స్టాక్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 72 పాయింట్లు క్షీణించి 25,270 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 7,713 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే చివరి గంటలో బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు తగ్గాయి. ఐదు వారాల్లో తొలిసారిగా మార్కెట్ నష్టపోయింది. ఈ ఏడాది మొదటి క్వార్టర్లో జపాన్‌లో వ్యాపార విశ్వాసం క్షీణించడంతో జపాన్ స్టాక్ సూచీ నికాయ్ 3.5 శాతం పతనం కావడం, ముడి చమురు ధరల క్షీణత మళ్లీ ప్రారంభమవడం, అమెరికా ఉద్యోగ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు వేచి చూడడం ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి. -
561 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులు
ముగింపులో సెన్సెక్స్‌కు స్వల్ప లాభాలు ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 22,986 పాయింట్ల వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 6,981 పాయింట్ల వద్ద ముగిశాయి. మైనస్ 352 నుంచి ప్లస్ 34కు యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం, చమురు ధరల్లో రికవరీ, దిగువ స్థాయిల్లో కొనుగోళ్లు, రూపాయి బలపడడం సానుకూల ప్రభావం చూపించాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఇంట్రాడేలో గురువారం నాటి ముగింపుతో పోల్చితే 352 పాయింట్లు నష్టపోయింది. 22,600-23,161 పాయింట్ల కనిష్ట , గరిష్ట స్థాయిల మధ్య ఊగిసలాడింది. మొత్తం మీద సెన్సెక్స్ 561 పాయింట్ల రేంజ్లో కదలాడింది. -
యూరో తీరుతో నష్టాలు..
♦ ఆద్యంతం ఒడిదుడుకులు ♦ 330 పాయింట్ల నష్టంతో 24,287కు సెన్సెక్స్ ♦ 102 పాయింట్లు నష్టపోయి 7,387కు నిఫ్టీ యూరోప్ మార్కెట్ల నష్టాలు భారత స్టాక్ మార్కెట్‌ను కూడా సోమవారం నష్టాల్లో పడేశాయి. దీంతో రెండు వరుస ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. రూపాయి 30 పైసలు క్షీణించడం, చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 330 పాయింట్లు క్షీణించి 24,287 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 102 పాయింట్లు (1.36 శాతం) నష్టపోయి 7,387 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ రంగం సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాలపాలయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఎలా ఉంటాయోనన్న (మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) అంచనాలతో బీఎస్ఈ సెన్సెక్స్ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 24,637 వద్ద స్వల్ప లాభాల్లోనే ప్రారంభమైంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు జోరుగా ఉన్నాయన్న వార్తలతో ప్రొరంభంలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,699 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత యూరోప్ మార్కెట్ల బలహీనత కారణంగా నష్టాల్లోకి జారిపోయింది. 24,197 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 330 పాయింట్ల (1.34 శాతం)నష్టంతో 24,287 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాల్లో ఉక్కు షేర్లు..: ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధరను నిర్ణయించిన నేపథ్యంలో ఉక్కు కంపెనీల షేర్లకు లాభాలు కొనసాగాయి. భూషణ్ స్టీల్ 6.2 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.9 శాతం, టాటా స్టీల్ 0.2 శాతం చొప్పున పెరిగాయి. అమెరికా, యూరప్ మార్కెట్ల పతనం న్యూయార్క్/లండన్: అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు, మరో మాంద్యం తప్పదేమోనన్న భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూరోప్ మార్కెట్లు 16 నెలల కనిష్ట స్థాయికి పడిపోగా, కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. లండన్ ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్ 2.7 శాతం, జర్మనీ డ్యాక్స్ 3.42 శాతం, ఫ్రాన్స్ సీఏసీ 40 ఇండెక్స్ 3.3 శాతం చొప్పున నష్టపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా స్టాక్ సూచీలు నాస్డాక్, డోజోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్లు 2 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.