మాల్దీవులు మాజీ ఉపాధ్యక్షుడికి జైలు
మాలె: మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ను హత్య చేసేందుకు కుట్రపన్నిన కేసులో ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్కు 15 ఏళ్ల జైలు శిక్షపడింది. గత సెప్టెంబర్లో స్పీడ్ బోటులో బాంబు పెట్టి అబ్దుల్లాను చంపేందుకు అదీబ్ కుట్రపన్నినట్టు నేరం రుజువైంది. అదీబ్తో పాటు ఆయన బాడీగార్డులు ఇద్దరిని కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్షపడింది.
గురువారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఈ రోజు శిక్షను ఖరారు చేసింది. తాజా తీర్పుతో యమీన్ శత్రువులు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయారు. కొందరు దేశ బహిష్కరణకు గురికాగా, మరికొందరు జైలుపాలయ్యారు.