Expansion of national highway
-
భూసేకరణ వేగవంతం చేయండి
ఒంగోలు టౌన్: జిల్లాలోని ప్రాజెక్టులు, జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. శనివారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ఎన్‌హెచ్-545 దేవులపల్లి - మార్కాపురం, మార్కాపురం - వగ్గంపల్లి సెక్షన్, వగ్గంపల్లి - దోర్నాల టీ జంక్షన్, ఎన్‌హెచ్-216 చీరాల - ఒంగోలు సెక్షన్‌కు సంబంధించి భూసేకరణపై సమీక్షించారు. కురిచేడు - దొనకొండ కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. కొత్త బ్రాడ్‌గేజ్ లైన్, నడికుడి - శ్రీకాళహస్తి సెక్షన్‌కు సంబంధించి చర్చించారు. ఎన్‌హెచ్-565కు సంబంధించి ప్యాకేజీ 2, 3, 4ల్లో సర్వే పూర్తి అయినప్పటికీ స్క్రూట్నీ పెండింగ్‌లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కందుకూరు డివిజన్లో నిమ్స్, మెగా ఇండస్ట్రీయల్ హబ్‌కు సంబంధించి భూసేకరణకు అవసరమైన సర్వేయర్లను ఒంగోలు, మార్కాపురం డివిజన్లలోని ఆరుగురిని కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో రిపోర్టు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని జాయింట్ కలెక్టర్-2కు సూచించారు. ఎన్‌హెచ్-216కు సంబంధించి చీరాల, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు, మద్దిపాడు, ఒంగోలులో సర్వే చేపట్టాలని ఒంగోలు ఆర్డీఓను ఆదేశించారు. కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున మాట్లాడుతూ నిమ్స్‌కు సంబంధించి ఇప్పటివరకు పదివేల ఎకరాలు సర్వే పూర్తి చేశామని, మరో రెండువేల ఎకరాల్లో చేయాలని వివరించారు. సీఎస్‌పురం, వెలిగండ్లలో ఏర్పాటు చేయనున్న మెగా సోలార్ పార్క్‌కు సంబంధించి బ్లాకుల వారీగా ప్రతిపాదనలు పంపించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సహాయ పునరావాస కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్-2 ఐ ప్రకాష్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌బాషాఖాశిం, భూసేకరణ స్పెషల్ కలెక్టర్ నాగరాజారావు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి క్వారీ!
- మట్టి తవ్వకాలకు అనుమతుల వెనుక భారీ అక్రమాలు - చేతులు మారిన కోట్ల రూపాయలు - రైతుల నోట్లో మట్టికొట్టిన వైనం మంగళగిరి: భారీ ఎత్తున సొమ్ము చేతులు మారటం వల్లే ఆత్మకూరు చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ‘ప్రజాప్రయోజనాల’ ముసుగులో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు ఈ దందా నడిపినట్టు తెలుస్తోంది. సొంత పొలంలోని మట్టిని తోలుకునేందుకు ఎవరైనా దరఖాస్తు చేస్తే సవాలక్ష ప్రశ్నలతో కాలయాపన చేసే అధికారులు ఏకంగా 72 ఎకరాల్లో తవ్వకాలకు అనుమతులివ్వటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఇదీ సంగతి.. సర్వే నంబర్లు 198/అ, 199/అ 202లలో 99.90 ఎకరాల విస్తీర్ణంలో ఆత్మకూరు చెరువు ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఇది ఎండి పూడిపోవడంతో 10 ఎకరాల ను కుండలు తయూరు చేసుకునే సామాజికవర్గం వారు, మరో 18 ఎకరాల్లో దళితులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మిగిలిన 72 ఎకరాల్లో 100 మందికిపైగా రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 72 ఎకరాల్లోని మట్టిపై మాఫియా కన్ను పడింది. 2011లో ప్రారంభమైన విజయవాడ నుంచి చిలకలూరిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం కావటంతో ప్రజా ప్రయోజనాల పేరిట ఓ కాంట్రాక్టర్ అనుమతులు సాధించారు. అయితే స్థానిక రైతులు ఒప్పుకోకపోవడంతో పనులు సాగలేదు. దీంతో ఎకరాకు ఇంత ధర అని నిర్ణయించి రైతులను ఒప్పించడంతోపాటు గ్రామ పంచాయతీ ప్రతినిధులు, అధికారులకు నజరానాలు ఇచ్చి అనుమతులు సాధించారు. జాతీయ రహదారి విస్తరణ పనులకు మట్టి అవసరం లేదని ఎన్‌హెచ్ అధికారులు చెప్పినా దందా కొనసాగిపోరుుంది. గత డిసెంబర్ నుంచి పెద్దఎత్తున మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నారుు. ప్రతి రోజూ సుమారు 200 లారీలు, ట్రాక్టర్లలో లెక్కలేనన్నిసార్లు మట్టిని తరలిస్తున్నారు. వాహనాల వారు ఒకే వేబిల్లుతో పలుమార్లు తిరుగుతున్నారు. తద్వారా అక్రమార్కులు రూ. కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వానికి మాత్రం నామమాత్ర ఆదాయమే లభిస్తోంది. క్వారీ యూజమాన్యం నుంచి పెద్దమొత్తంలో మామూళ్లు అందుతుండటంతో అటు అధికారులు, ఇటు పాలకులు పట్టించుకోవటం లేదు. - జిల్లా స్థాయి అధికారులు తనిఖీలు నిర్వహించినపుడు ముందురోజే స్థానిక అధికారులు కాంట్రాక్టర్‌కు సమాచారమిస్తున్నారు. దీంతో జిల్లా అధికారులు వచ్చిన రోజు మాత్రం నిబంధనల ప్రకారం తవ్వకాలు సాగిస్తున్నారు. - మంగళగిరి వద్ద జాతీయ రహదారికి అరకిలో మీటర్ దూరంలో ఎకరా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా క్వారీ యూజమాన్యానికి అప్పగించడం విడ్డూరంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. - నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నేపథ్యంలో పలు జాతీయ సంస్థల ఏర్పాటుకు స్థలాల కోసం వెదుకుతున్న అధికారులకు ఇంత విలువైన భూమి కనిపించకపోవడం గమనార్హం. లీజు రద్దు చేయూలని నివేదించాం.. ఆత్మకూరు మట్టి క్వారీ అక్రమాలపై మైనింగ్ ఎ.డి. జగన్నాథరావును వివరణ కోరగా క్వారీ లీజును రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక అందజేశామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు నిర్వహించినా, వే బిల్లులు సక్రమంగా జారీ చేయకపోయినా జరిమానా విధించడంతోపాటు లీజు రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. దీనిపై మంగళగిరి తహశీల్దార్ శివరామకృష్ణారావు వివరణ ఇస్తూ శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు భూములను పరిశీలించటమే తమ బాధ్యతని పేర్కొన్నారు. మిగిలిన అనుమతులు, పర్యవేక్షణ మైనింగ్ శాఖ ఆధీనంలోనే ఉంటాయన్నారు. క్వారీ అనుమతులు తీసుకున్నది జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం మాత్రమేనన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలను మైనింగ్ శాఖ అధికారులే అడ్డుకోవాల్సి ఉందన్నారు.