Failure of the government
-
అందరికీ అను‘గృహం’..
సాక్షి, ప్రత్తిపాడు : పేదవాని గూడు గోడుగానే మిగిలిపోతోంది. కలల సౌథం కూలిపోతోంది. అర్హత ఉండీ ఇళ్లు మంజూరు కాని వారు కొందరు..మంజూరై బిల్లులు రాని వారు ఇంకొందరు.. బిల్లులు రాక ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేసిన వారు మరికొందరు.. ఇలా ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లు నిర్మించుకున్న వారి బాధ అంతులేకుండా ఉంది. ఇలాంటి పేదలందరికీ గూడు కల్పించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టించి ఇస్తానని మాట ఇచ్చారు. అంతేకాదు ఇచ్చిన రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పారు. దీనిపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ ప్రకటించిన పథకం వివరాలు పేదలందరికీ పక్కా ఇళ్లు ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ డబ్బు అవసరమైతే అదే ఇంటి మీద పావలా వడ్డీకే రుణ సదుపాయం పక్కా ఇళ్ల నిర్మాణాల వివరాలు.. టీడీపీ హయాంలో మంజూరైన ఇళ్లు : 3,61,732 అసంపూర్తిగా నిలిచిన ఇళ్లు : 21,568 ప్రారంభం కాని ఇళ్లు : 60,279 అందరికీ ఇళ్లు గొప్ప విషయం టీడీపీ ప్రభుత్వ హయాం లో పక్కా ఇళ్లు నిర్మించుకోవాలంటే జన్మభూమి కమిటీల దయ తప్పని సరి. అలాంటి వారికే ఇల్లు మంజూరు చేస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా అర్హులకు ఇస్తామని చెప్పడం గొప్ప విషయం. – కొత్త అమేష్, బీకేపాలెం జగన్ హామీ హర్షణీయం ఇళ్లు నిర్మించుకుని బిల్లులు రాక లబ్ధిదారులు అగచాట్లు పడుతున్నారు. మండలాల్లోని హౌసింగ్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. నిర్మించుకున్న ఐదారు నెలలకు కూడా బిల్లులు రాని దుస్థితి ఉంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. ఆయన మాటిస్తే నెరవేరుస్తారు. అందుకే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – బాపతు శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు -
అభివృద్ధికి ఎక్కడ.. ?
బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోచుకోకుండా పోతోంది. మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 6 వేల మంది జనాభా నివసిస్తున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. ఎంపీపీ సొంత గ్రామమైనా అభివృద్ధి ఏమీ జరగలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్వానంగా రోడ్లు.. గ్రామంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన అంతర్గత రోడ్లు ఇప్పుడు అధ్వానంగా మారాయి. కంకరతేలి, గుంతలుగా మారి నడక సాగించడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాహన చోదకులు అదుపు తప్పి గుంతలలో పడిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని వాడల్లో ఇప్పటి వరకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ఎస్సీ కాలనీ, నేతకాని వాడలలో సమస్యలు తీష్ట వేశాయి. మరికొన్ని వాడల్లో మట్టి రోడ్లు వేసినా గుంతలుగా మారాయి. స్ధానిక ప్రజా నిధులు వారి అనుచరుల వాడల్లో మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారనే ఆరోపణలు గ్రామస్తులు చేస్తున్నారు. రోడ్లపైనే మురికి నీరు.. గ్రామంలో మురికి నీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. అక్కడక్కడ మాత్రమే మురికి నీటి కాలువలు ఉన్నా అవి చెత్తతో నిండడంతో రోడ్లపై మురికి నీరు పారుతోంది. మురికి నీటి కాలువలు నిర్మించక పోవడంతో ఆ మురికి నీరంతా రోడ్లపై పారుతూ కంపు కొడుతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తం కావడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందాయి.ఏళ్లు గడుస్తున్నా కాలువల నిర్మాణం జరగడం లేదు. తాగు నీటి సమస్య తీవ్రం.. గ్రామంలో రెండు ఓవర్ హెడ్ ట్యాంక్లు ఉన్నాయి. వీటి ద్వారా గ్రామస్తులకు మంచి నీరందించాల్సి ఉండగా ట్యాంకుల నిర్వాహణ సరిగా చేపట్టడం లేదు. పక్షం రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో నీటిలో చిన్న చిన్న పురుగులు వస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామీణులకు తాగునీటిని అందించడంలో ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేనట్లు కనిపిస్తోంది. ఎంపీపీ స్వగ్రామంలో ఈ తీరైన సమస్యలు విలయతాండవం చేస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్, ఎంపీపీ గ్రామాభివృద్ధికి చిత్తశుద్ధితో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
వాగ్దానాల అమలులో సర్కారు వైఫల్యం
రాజధాని పేరుతో కాలయాపన సర్కారు తీరుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సారథి విమర్శ రేపు పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం నిర్వహించ నున్నట్లు వెల్లడి పుట్రేల (విస్సన్నపేట) : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి తెలిపారు. హామీలను మరిచి రాజధాని పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. మండలంలోని పుట్రేల గ్రామంలో మారెమ్మ గుడి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. రైతులకు చేయాల్సిన రుణమాఫీ రూ.87 వేలు కోట్లు ఉండగా మొదటి విడతగా రూ.6 వేలు కోట్లు మించి మాఫీ చేసింది లేదన్నారు. రెండో విడత మాఫీ సొమ్ము చాలా మందికి ఇప్పటివరకు ఖాతాల్లో జమ కాలేదన్నారు. పత్రికల్లో మాత్రం రూ.26 వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు ప్రకటనలు చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు ఇస్తామన్నారని, ఇంతవరకు రాష్ట్రంలో ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళా గ్రూపులకు రుణమాఫీలోను అదే తీరు అవలంబించారన్నారు. పబ్లిసిటీ తప్ప చేసిందేమీ లేదు : ఎమ్మెల్యే రక్షణనిధి రాష్ట్ర ప్రభుత్వం గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని, ఎన్నికల వాగ్దానాల అమలు పూర్తిస్థాయిలో చేయలేదని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి విమర్శించారు. పట్టిసీమ నీళ్లతో ఎకరానికి 50 బస్తాలు పండించామంటున్నారని, గతంలో తిరువూరు నియోజకవర్గంలో సాగర్ మూడో జోన్ కింద ఎకరానికి 60 బస్తాలు పండించిన సంగతేమిటని ప్రశ్నించారు. అన్నపూర్ణగా పేరొందిన జిల్లాలో పంటలు ఎండిపోయి జిల్లేడు చెట్లు మొలుస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ సుజలధార ఏ గ్రామంలోనైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఒక్క కాలనీ ఇళ్లయినా మంజూరు చేశారా అని నిలదీశారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక చోట్ల పింఛన్లు రాకుండా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పలువురు టీడీపీలోకి వెళ్లగానే అభివృద్ధిని చూసి వెళ్లామని ప్రకటనలు చేస్తున్నారని, మొన్నటిదాకా లేని అభివృద్ధి ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. సాక్షి చానల్ ప్రసారాలను నిలుపుదల చేయటం అప్రజాస్వామికమని, మీడియా స్వేచ్ఛను హరించటం సరికాదని స్పష్టం చేశారు. ఖాలీ పోస్టుల భర్తీ ఎప్పుడు? : ఉదయభాను రాష్ట్రంలో లక్షా 30 వేల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉండగా ఒక్క పోస్టూ భర్తీ చేయకపోగా నిరుద్యోగ భృతి చెల్లించటంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సామినేని ఉదయభాను అన్నారు. ప్రాజెక్టుల పేరుతో టెండర్లు వేసిన తర్వాత దానికి రెండింతలు పెంచి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, రానున్న రోజుల్లో బాబు సర్కారుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా రాణి, పార్టీ నేతలు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, సిరసాని ప్రకాష్, భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, నెక్కళపు కుటుంబరావు, దారావతు శ్రీను, రమేష్, సర్పంచ్ పెద్దిబోయిన కేశవులు తదితరులు పాల్గొన్నారు.