fake bills scam
-
చైనా లోన్ యాప్స్: వెలుగులోకి కొత్త కోణం
హైదరాబాద్: చైనా లోన్ యాప్స్ స్కాంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సెంట్రల్ సైబర్ స్టేషన్(సీసీఎస్)పోలీసులు లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసును నమోదు చేశారు. కాగా, లోన్ యాప్స్ పేరుతో కొత్త పద్ధతిలో కొన్ని గ్యాంగ్‌లు.. రూ. 5 వేల కోట్లని అక్రమమార్గంలో చైనాకు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. ఈ ముఠా విమానాల ద్వారా పెద్ద మొత్తంలో వస్తువులు దిగుమతి చేసుకున్నట్లుగా నకిలీ బిల్లులు సృష్టించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బిల్లులను పరిశీలించగా ఈ గ్యాంగ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు రూ.450 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసినట్లు నకిలీ పత్రాలను సృష్టించినట్లు అధికారులు కనుగొన్నారు. ఈ మేరకు లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: దుర్గగుడి ఫ్లైఓవర్‌పై రేసింగ్ విన్యాసాలు: ‘క్రిమినల్ కేసు నమోదు’ -
కుంభకోణంలో తప్పు ఒప్పుకున్న ఉపాధ్యాయులు
తప్పు ఒప్పుకున్నారు. తప్పుడు ధ్రువీకరణతో బిల్లులు పెట్టుకుని నిధులు తీసుకున్నట్టు అంగీకరించారు. ఎప్పటికైనా... వాస్తవాలు బయటకు రాక తప్పదని భావించి అప్రూవర్లుగా మారారు. గడచిన కొద్ది రోజులుగా సాక్షిలో వస్తున్న వరుస కథనాలు ఓ వైపు సంచలనం సృష్టించగా... విచారణ నివేదిక ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ శుక్రవారం నిర్వహించిన విచారణకు వచ్చిన అధికారులు... బాధ్యులతో కార్యాలయంలో హడావుడి నెలకొంది. సాక్షి ప్రతినిధి విజయనగరం: చేసిన తప్పును ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుందనుకున్నారో ఏమో.. పార్వతీపురం పట్టణంలోని ఆర్సీఎం బాలుర ఉన్నత పాఠశాల, ఎలిమెంటరీ పాఠశాల, బాలగుడబ ఆర్సీఎం యూపీ పాఠశాలలో పనిచేసినట్లు తప్పుడు నివేదికలు, బిల్లులు సమర్పించినట్లు 13 మం ది ఉపాధ్యాయలు విచారణలో అంగీకరించారట. తప్పుడు సర్వీసు రిజిస్టర్‌ను విద్యాశాఖకు సమర్పించి తద్వారా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి 14 సంవత్సరాలకు సంబంధించిన జీతం బకాయిలు రూ.4.01కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలపై కొద్దిరోజులుగా ‘సాక్షి’ వరుస కథనాలు వెలువరించిన సంగతి తెలిసిందే. గుట్టు మొత్తం బయటపడిపోవడంతో ఇక తప్పించుకోలేమని భావించి ఈ కుంభకోణంతో ప్రమేయం ఉన్నవారు నిజాన్ని ఒప్పుకున్నారు. ముచ్చటగా మూడవసారి ఈ కుంభకోణంపై పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్ ఈ నెల 7, 15 తేదీల్లో ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపి తాజాగా శనివారం మూడోసారి కూడా విచారణ నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ విచారణలో అనేక విషయాలపై సబ్‌కలెక్టర్ ఆరాతీసి జరిగిన అవకతవలను గుర్తించినట్టు సమాచారం. విచారణకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఎయిడెడ్ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఫాదర్లు హాజరయ్యారు. అవకతవకలు నిజమే...: యాజమాన్యం ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తప్పుడు సర్వీస్ రిజిస్టర్లు చూపించి ఎరియర్స్‌ను పొందినట్టు ఉపాధ్యాయులు అంగీకరించినట్టు విచారణకు హాజరైనవారి నుంచి వచ్చిన ప్రాధమిక సమాచారం. మొత్తం 13 మంది ఉపాధ్యాయులు తాము 2017లో విధుల్లో చేరినట్టు రాత పూర్వకంగా సబ్‌కలెక్టర్ కు తెలియజేశారు. మిగిలిన 14 సంవత్సరాలకు ఎరియర్సు బిల్లులు ఉద్దేశ పూర్వకంగానే సమర్పించి ప్రభుత్వం కళ్లుగప్పి, విద్యాశాఖ ఉన్నతాధికారులను మోసం చేసి డబ్బును రాబట్టినట్టు విచారణలో స్పష్టమైనట్టు తెలిసింది. చర్చి ఫాదర్లను విచారించిన సబ్‌కలెక్టర్ విచారణలో భాగంగా సబ్‌కలెక్టర్ టి.ఎస్.చేతన్ చర్చి ఫాదర్లను శనివారం విచారించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ చేయడంలో కొంతమంది ఫాదర్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల నియామకాలను కూడా నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు పిటిషనర్ గురువులు ఆరోపించారు. ఈ కోణంలో కూడా సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరుపుతున్నారు. రాజీ ప్రయత్నాలు ఈ కుంభకోణం కేసును ఎలాగైనా ఇక్కడితో ఆపేయించడానికి కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు..తప్పు జరిగిపోయిందని, ఇది విచారణలో రుజువై శిక్ష పడితే ఆర్సీఎం ఎయిడెడ్ పాఠశాలల పరువు పోతుందని, ఈ రొంపి నుండి ఎలాగైనా తప్పించాలని వారు తమ ఉన్నతాధికారులను సంప్రదించి మొరపెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. నివేదిక ఆధారంగా చర్యలు ఇప్పటికే పార్వతీపురం సబ్ కలెక్టర్ చేతన్ విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన నివేదిక మరో రెండు రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత నివేదికలోని అంశాల ఆధారంగా కుంభకోణంలో బాధ్యులపై చర్యలు ఉంటాయి. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్, విజయనగరం -
ఇదీ అవినీతి రంగు!
ఏలూరు(సెంట్రల్): కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛందంగా ప్రైవేట్ సంస్థలు చేసిన పనులకు డబ్బులు డ్రా చేసేందుకు కుయుక్తులు పన్నారు. బిల్లులు సిద్ధం చేశారు. ఈ ఉదంతం నగరపాలక సంస్థలో చర్చకు దారితీసింది. ఈ బిల్లుల తయారీలో నగరపాలక సంస్థ కీలక విభాగంలోని ఓ ముఖ్య అధికారి ప్రత్యేక పాత్ర పోషించినట్టుగా సమాచారం. అసలేం జరిగింది.. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, వంతెనలు, డివైడర్ల గోడలపై కొందరు వాల్‌పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడం, ఇతర ప్రకటనల రంగులు వేయడం చేస్తున్నారు. దీనివల్ల అవి అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, వంతెనలు, ఫ్లైఓవర్ల గోడలను సుందరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తలంచారు. సుందరీకరణలో భాగంగా 3డీ బొమ్మలు, రంగులు వేయాలని నిర్ణయించారు. రంగులు, 3డీ డిజైన్లను వేసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ఈ ఏడాది జనవరిలో టెండర్లను పిలిచారు. విశాఖపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం. స్వచ్ఛందంగా చేసిన వ్యాపార సంస్థలు.. అయితే 3డీ డిజైన్లు, బొమ్మలు వేసేందుకు నగరంలోని పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. నగరపాలకసంస్థ కార్యాలయం, నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న దామరాజు వెంకట్రావు పంతులు పార్కు, కర్రల వంతెన, లోబ్రిడ్జి, ప్రభుత్వాస్పత్రి, ఓవర్ బ్రిడ్జి గోడలకు వివిధ రకాల డిజైన్లతో కూడిన బొమ్మలను వేసి, వారి వ్యాపార సంస్థల పేర్లను వాటి పక్కనే వేసుకున్నారు. ఇదంతా ఉచితంగానే చేశారు. కాంట్రాక్టరే చేసినట్టుగా బిల్లులు అయితే ఈ పనిని కాంట్రాక్టరే చేసినట్టుగా నగరపాలక సంస్థ అధికారులు బిల్లుల కాజేతకు యత్నిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా రూ.8.14 లక్షలకు బిల్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలోని గోడలకు ప్రైవేట్ సంస్థలు రంగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. కాంట్రాక్టరే రంగులు వేసినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేయడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రైవేట్ సంస్థల సౌజన్యంతోనే.. నగరంలోని డివైడర్లు, ప్రభుత్వ కార్యాలయాల గోడలకు పోస్టర్లను అంటించి అధ్వానంగా చేస్తున్నారు. దీంతో గోడలపై ఎటువంటి పోస్టర్లను వేయకుండా ఉండేలా 3డీ బొమ్మలు, రంగులు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అయితే వీటిని వేసేందుకు నగరంలోని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వాటితోనే రంగులు, బొమ్మలు వేయించాం. ఈ పనికి నగరపాలకసంస్థ నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. బిల్లులు సిద్ధం చేసినట్టుగా నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తాం. –ఎ.మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్ -
పీడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్ బంధువు అరెస్ట్
న్యూఢిల్లీ: ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) డ్రెయినేజీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మేనల్లుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. వాయవ్య ఢిల్లీ ప్రాంతంలో డ్రెయినేజీ వ్యవస్థ నిర్మాణ బాధ్యతలను రేణు కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ చేపట్టింది. సుమారు రూ.3.1 కోట్ల విలువైన పనులను పీడబ్ల్యూడీ అధికారులతో కుమ్మక్కై ఈ కంపెనీ నాసిరకంగా చేపట్టిందని ఏసీబీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేణు కన్స్ట్రక్షన్స్ కంపెనీలో సీఎం మేనల్లుడు వినయ్ బన్సల్‌కు సగం వాటా ఉంది. వినయ్ బన్సల్‌ను గురువారం అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఢిల్లీ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఒక రోజు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. çఆప్‌ను వేధించడమే కేంద్రం పనిగా పెట్టుకుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోపించారు. -
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
-
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
తెలంగాణ సీఎం సహాయనిధిలో అక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీరియస్ అయ్యారు. కొన్ని ఆస్పత్రులు నకిలీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్న వ్యవహారం ఆయన దృష్టికి రావడంతో దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. నకిలీ బిల్లులతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండులో చేతివాటం చూపించినట్లు వెలుగుచూసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నిజమైన పేదలు వైద్యం చేయించుకోడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సాయం చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ గత కొన్ని రోజులుగా కొన్ని ఆస్పత్రుల్లో దుర్వినియోగం అవుతోంది. ఉదారంగా సాయం చేస్తుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్న వ్యవహారం సీఎం దృష్టికి వచ్చింది. గత ఏడు నెలల్లో జరిగిన విషయాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరిపి నిజనిర్ధారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.