దొంగ నోట్ల రాకెట్.. నటి అరెస్ట్
తిరువనంతపురం: నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్ పోషించిన సూర్య శశికుమార్(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు.
సుమారు రూ. 57లక్షలు విలువ చేసే 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను, ప్రింటర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్య తల్లి రమాదేవి(56) ఈ గ్యాంగ్‌కు మెయిన్ హెడ్ గా వ్యవహరించినట్లు తేలింది. దీంతో సూర్యతోపాటు, తల్లి రమాదేవి, సోదరి శృతి(29)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.